అక్షయ తృతీయకు అందరూ బంగారమే కొనాలమే అనుకుంటారు. కానీ మనీ ప్లాంట్ కూడా కొనుక్కోవచ్చట.

అవును అందరికీ గోల్డ్ కొనేంత డబ్బులు ఉండకపోవచ్చు. అలాంటి వారు మనీప్లాంట్ కొనుక్కోవచ్చట.

ఇది అదృష్టాన్ని ఇస్తుందని చాలామంది భావిస్తారు. కాబట్టి మీరు కూడా ఈ అక్షయ తృతీయకు దీనిని కొనుక్కోవచ్చు.

పైగా దీనిని పెంచడం కూడా చాలా తేలిక. ఇంట్లో అయినా.. ఇంటి బయట అయినా వాటిని పెంచుకోవచ్చు.

దీనిని కేవలం నీటిలో వేసి పెంచుకోవచ్చు. షో కోసం పెంచుకోవాలనుకునేవారికి ఇది బెస్ట్.

కుండీల్లో మట్టి వేసి కూడా వీటిని పెంచుకోవచ్చు. గ్రోత్ ఇంకా బాగుంటుంది.

లేదంటే మనీ ప్లాంట్​ని హ్యాంగ్ చేసుకుని కూడా మంచిగా పెంచుకోవచ్చు.

వీటిని పెంచుకుంటే లక్ కలిసి వచ్చినా రాకున్నా ప్రశాంతత మాత్రం పెరుగుతుంది.

ఇంట్లో పచ్చని వాతావరణం ఉంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.

కాబట్టి మొక్కలు పెంచుకోవాలనుకునేవారు ఈ అక్షయ తృతీయకు మీ గార్డెన్​లో మరో మొక్కను చేర్చేయండి.