తేనెను పసుపుతో కలిపి ముఖానికి ఫేస్ మాస్క్​గా అప్లై చేస్తే ఎంతో మంచిదట.

టేబుల్ స్పూన్ పసుపులో అరటీస్పూన్ పసుపు వేసి కలిపి మాస్క్​గా తయారు చేసుకోవచ్చు.

ఈ పేస్ట్​ని ముఖానికి అప్లై చేస్తే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. చర్మానికి కలిగే లాభాలేంటో చూసేద్దాం.

ఈ పేస్ట్​ ముఖానికి మాస్క్​గా అప్లై చేసి.. పది నుంచి పదిహేను నిమిషాలు ఉంచాలి.

గోరువెచ్చని నీటితో కడిగితే మంచిది. వారానికి రెండు మూడుసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

తేనే చర్మానికి మాయిశ్చరైజర్​ని అందిస్తుంది. పొడి చర్మం దూరమవుతుంది.

ఈ మాస్క్​లోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు పింపుల్స్, గాయాలు త్వరగా తగ్గుతాయి.

చర్మానికి మెరుపును అందిస్తాయి. సహజంగా గ్లోని అందించడంలో హెల్ప్ చేస్తాయి.

యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖంపై ముడతలను దూరం చేసి.. ఫ్రెష్, యంగ్ లుక్​ని ప్రమోట్ చేస్తాయి.

ఈ మాస్క్​ని ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకుని ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.