సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కంటి చూపు మందగిస్తుంది. వయసుతో పాటు కూడా ఈ సమస్యలు వస్తాయి.

కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల కంటి చూపును కాపాడుకోవడంతో పాటు మెరుగుపరచుకోవచ్చు.

20-20-20 రూల్​ని ఫాలో అవ్వాలి. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్నదానిని 20 సెకన్లు చూడాలి.

దీనివల్ల కళ్లు స్ట్రైన్ అవ్వడం తగ్గుతాయి. స్క్రీన్ ఎక్కువగా చూసేవారికి ఇది మంచిది.

విటమిన్ ఎ, సి, ఈ, ఒమెగా 3, జింక్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​ని డైట్​లో తీసుకోవాలి.

బయటకు వెళ్లేప్పుడు యూవీ కిరణాలు తాకకుండా సన్​గ్లాసెస్ పెట్టుకుంటే కంటికి మంచిది.

హైడ్రేషన్ కూడా కంటిచూపును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుంది. కళ్లు పొడిబారడం తగ్గుతాయి.

కళ్లలో ఏమైనా దుమ్ము పడితే దానిని రుద్దడం ఆపాలి. దీనివల్ల ఇన్​ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

కంటిచూపునకు సంబంధించిన టెస్ట్​లు చేయించుకోవాలి. అవసరమైతే కళ్లజోడు వాడాలి.

స్క్రీన్ టైమ్​ని వీలైనంత తగ్గించాలి. రాత్రుళ్లు పడుకునే ముందు వాడకాన్ని మానేయాలి.