ఆస్తమాపై అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం రోజు ఆస్తమా డే నిర్వహిస్తున్నారు.

ఆస్తమా ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. దానిలో ఫుడ్ కూడా ఒకటి.

అవును కొన్నిసార్లు ఫుడ్ కూడా ఆస్తమాను ట్రిగర్ చేస్తుంది. కాబట్టి కొన్ని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి.

ఆస్తమా రోగులు చల్లని, పుల్లని ఫుడ్స్​కి దూరంగా ఉండాలి. తినకపోవడమే మంచిది.

ఐస్ క్రీమ్, సిట్రస్ ఫ్రూట్స్​ ఆస్తమాను రెట్టింపు చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

అలాగే ఆస్తమా రోగులు ప్రిజర్వేటివ్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోకపోవడమే మంచిది.

ఆస్తమా రోగులు జంక్​ ఫుడ్​ తినకపోవడమే మంచిది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.

చిప్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్​లో ఉండే ఫ్యాట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి.

వైద్యులు సూచించిన మందులు తప్పక ఉపయోగించాల్సిన అవసరం ఉంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.