Chinni Serial Today June 9th: చిన్ని సీరియల్: చిన్ని వల్ల మహి తులాభారం సక్సెస్.. కావేరికి బాలరాజు లవ్ సర్‌ఫ్రైజ్
Chinni Today Episode మామయ్య మనతో ఉన్నప్పుడు నాన్న లేడని చందు కావేరి దగ్గర ఎమోషనల్ అవ్వడం చందుని బాలరాజు ఓదార్చడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి తులాభారం కార్యక్రమం జరుగుతుంది. మహి కోసం దేవా, నాగవల్లి నిలువు దోపిడీ చేసినా తూకం కొంచెం కూడా కదలదు. దాంతో చిన్ని కృష్ణుడి తులాభారం గుర్తు చేసి తులసి ఆకులు తీసుకొచ్చి వేయడంతో తూకంపైకి లేస్తుంది. అందరూ చాలా సంతోషిస్తారు. పంతులు మహిని దీవిస్తాడు. కృష్ణుడి ఆశీషులు మీ ఇద్దరి మీద నిండుగా ఉన్నాయి అందుకే మీ ఇద్దరితో హోమం జరిపించాడు అని అంటారు.
మహి తండ్రి ఫోన్ తీసుకొని అందరూ సెల్ఫీ తీసుకుందాం అని అంటాడు. లోహితను మహి కోపంగా చూసి ఇందాక చిన్ని గురించి ఏదోదో మాట్లాడావ్ కదా.. చిన్ని వల్ల చెడు జరుగుతుంది అన్నావ్ ఇప్పుడు చూడు చిన్ని వల్ల ఎంత మంచి జరిగిందో.. ఇంకెప్పుడూ చిన్నితో అలా మాట్లాడకు చిన్ని మీద కోపంగా ఉండకు కూడా అని చెప్తాడు. అందరం హ్యాపీగా ఉందాం అంటాడు. కావేరి ప్రమీల ఫొటో చూసి మహి లాంటి మంచి కొడుకుని కన్నావ్ నీ మంచితనమే మహికి శ్రీరామ రక్ష అని అనుకుంటుంది.
కావేరిని బాలరాజు వచ్చి పిలిచి వెళ్దాం అని అంటాడు. కావేరి వెళ్తూ తన దీపం ఆగిపోవడం చూసి రెండు చేతులు అడ్డు పెడుతుంది. అది చూసిన నాగవల్లి కోపంగా మా అక్క దగ్గర దీపం పెట్టడానికి కారణం అయిన నువ్వే దీపం ఆగిపోకుండా చేతులు అడ్డు పెడుతున్నావా అని అంటుంది. నువ్వు పొరపాటు పడుతున్నావ్ అని కావేరి నిజం చెప్పబోతే నాగవల్లి మా అక్క గురించి నువ్వు మాట్లాడకు అని అంటుంది. కోర్టు విధించిన శిక్షించిన శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవచ్చు కానీ నా నుంచి తప్పించుకోలేవని అంటుంది. ఇంతలో మహి వచ్చి టీచర్ తిన్నారా అని అడిగితే కడుపు నిండా పెట్టానని నాగవల్లి అంటుంది.
కావేరి వాళ్లు వెళ్లిపోతుంటే దేవా వాళ్లకి వచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. మహి చిన్నితో తాను ఇచ్చిన గిఫ్ట్ జాగ్రత్తగా దాచుకోమని చెప్తాడు. ఇక బాలరాజు వాళ్లు చందు, లోహితను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. లోహితకు అర్థమయ్యలే మీ అందరూ మహిలా మంచిగా ఉండాలి కలిసి మెలిసి ఉండాలి అని చెప్తుంది కావేరి. లోహిత క్లాస్‌లు చాలు టీచర్ అని వెళ్లిపోతుంది. చందు అత్తతో ఎందుకు అత్త మనకే ఇలా జరుగుతుంది. నాన్న మనతో ఉన్నప్పుడు మామయ్య మనతో లేడు.. మామయ్య ఉన్నప్పుడు నాన్న లేడు అని ఏడుస్తాడు. బాలరాజు మహిని దగ్గరకు తీసుకొని చిన్నినే కాదు నువ్వు లోహిత కూడా నా బిడ్డలే అని అంటాడు. మామయ్య అని చందు బాలరాజుని పట్టుకొని ఏడుస్తాడు.
మహి పుస్తకాలకు నాగవల్లి అట్టలు వేస్తుంది. మహి చూసి నేను అంటే నీకు ఎందుకు అంత ప్రేమ పిన్ని అంటే నాగవల్లి ఎమోషనల్ అయి నువ్వు నా అక్క కొడుకువురా అంటే నా కొడుకువి నువ్వు స్కూల్‌కి వెళ్తే అమ్మ నీకోసం ఇలా రెడీ చేయదా అంటే మహి ఏడుస్తూ ఈ మధ్య నిన్ను చూస్తే అమ్మ గుర్తొస్తుంది పిన్ని అని ఏడుస్తాడు. మహికి అమ్మలేని లోటు తీర్చాలని నాగవల్లి అనుకుంటుంది. చిన్ని పడుకొని ఉంటే కావేరి చిన్ని బ్యాగ్ సర్దుతుంది. బాలరాజు చిన్ని కాలు కదపడం చూసి చిన్నికి కాలు నొప్పులుగా ఉన్నాయి అనుకుంటా కావేరి అని అంటాడు. పూజలో అటూ ఇటూ తిరిగింది కదా అని కావేరి అంటుంది. పాపం నిద్ర పట్టడం లేదు అనుకుంటా అని బాలరాజు కావేరి కాళ్ల పట్టుకొని నొక్కుతాడు. చిన్ని కాళ్లు పట్టుకొని ఏడుస్తాడు.
చిన్ని కాళ్ల మీద కన్నీరు పడటంతో చిన్ని లేస్తుంది. ఏమైంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావ్ నువ్వు నా కాలు పట్టుకోవడం ఏంటి అంటుంది. దానికి రాజు నేను చేసిన తప్పులకు నీ కాళ్లు పట్టుకోలేను ఇలా అయినా పట్టనివ్వు అంటాడు. ఉదయం కావేరి స్నానానికి వెళ్తుంటే బెడ్ మీద ఓ చీర పెట్టి దాని మీద పువ్వులు చల్లి ఉంటాయి. బాల సర్‌ఫ్రైజ్ చేయడానికి ఈ చీర తీసుకొచ్చాడని అనుకొని కావేరి చీర కట్టుకుంటుంది. తర్వాత బయటకు వస్తే ఐలవ్‌యూ అని రాసి ఉంటుంది. టిఫెన్ రెడీ అని చెప్పి స్మైల్ సింబల్ రాస్తాడు. కావేరి ఇదేంటి అంటే నా ప్రేమ చూపిస్తున్నా అంటాడు. అవసరమా ఈ వయసులో అని కావేరి అంటే ప్రేమకు వయసు ఉండదు అని కావేరిని దగ్గరకు తీసుకోబోతే అప్పుడే చిన్ని వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!





















