Chinni Serial Today June 6th: చిన్ని కోసం మహి ప్రత్యేక పూజ! కావేరి, నాగవల్లి మధ్య యుద్ధం.. నేటి ఎపిసోడ్ హైలైట్స్!
Chinni Today Episode చిన్నికి మహి గిఫ్ట్ ఇవ్వడం.. కావేరిని నాగవల్లి పొడవడానికి ప్రయత్నిస్తే దేవా ఆపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి ఇంటికి కావేరి, చిన్ని వస్తారు. నువ్వు నేను మీ నాన్నతో ఉన్నాం అని మహికి తెలీదు చందు వాళ్లతోనే ఉన్నాం అనుకుంటున్నాడు కాబట్టి చందు వాళ్లు వస్తే వాళ్లతో వెళ్దాం అని కావేరి చెప్తుంది. చిన్ని సరే అంటుంది. ఇంతలో చందు, లోహిత వస్తారు. చిన్ని లోహితను పలకరించినా లోహిత ఏం అనదు. అందరూ కలిసి లోపలికి వెళ్తారు.
చిన్ని వాళ్లని చూసి మహి వాళ్లు ఎదురెళ్తారు. నాగవల్లి కోపంతో ఉంటుంది. మహి వాళ్లని లోపలికి తీసుకెళ్తాడు. దేవా కావేరితో మీరు వస్తారు అని నాకు తెలుసు మీరు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. కావేరి కోపంగా చూడటంతో మహికి చాలా సంతోషంగా ఉందని అంటాడు. నాగవల్లి దేవాతో చిన్ని, కావేరి వచ్చినందుకు నా కడుపు రగిలిపోతుంది బావ అని అంటుంది. నాకు అంతే కానీ మహి కోసం తప్పదు అని దేవా అంటాడు. చిన్ని కొబ్బరి రేకులతో చేసిన బొమ్మని తన ఫ్రెండ్స్‌కి చూపిస్తుంది. అందరూ చూసి చాలా బాగుంది అని అంటారు. లోహిత దాన్ని తీసుకొని ఇది ఒక బొమ్మేనా నేను అయితే చెత్తకుప్పలో వేసేస్తా అని విసరబోతే చిన్ని ఆపుతుంది.
చిన్ని కావేరి వెనక పరుగులు తీస్తుంది. ఇంతలో చందు వచ్చి ఆ బొమ్మ తీసుకొని చిన్నిని ఎందుకు ఏడిపిస్తావ్.. ఇలా చేస్తే బాగోదు అని చెల్లిని తిడతాడు. చందు చిన్నికి బొమ్మ ఇస్తాడు. లోహిత కోపంతో రేకుల బొమ్మ ఇచ్చి బాగా మెక్కడానికి వచ్చింది ఇవ్వమ్మా ఇవ్వు అంటుంది. నువ్వు ఏం గిఫ్ట్ ఇవ్వకుండానే తింటావ్ కదా అని చందు అంటే నా వల్ల ఎవరికీ నష్టం ఉండదు కానీ ఈ మహా తల్లి ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే.. మనం అయిపోయాం.. ఇప్పుడు మహి వాళ్లని నాశనం చేయడానికి వచ్చింది అని చిన్నిని లోహిత అంటుంది. చిన్ని బాధ పడుతుంటే చందు ఏం బాధ పడొద్దు అంటాడు. తను నన్ను అన్నందుకు కాదు అర్థం చేసుకోనందుకే బాధగా ఉందని చిన్ని వెళ్లిపోతుంది.
కావేరి పార్వతి ఫొటో చూసి ఎమోషనల్ అవుతుంది. ఫొటో చూస్తూ నిర్దాక్షిణంగా నీ ప్రాణం తీసిన దేవాకి త్వరలోనే శిక్ష పడేలా చేస్తాను పార్వతి అని అనుకుంటుంది. కావేరి పార్వతి ఫొటో దగ్గర ఉండటం నాగవల్లి చూసి కోపంగా చాకు తీసుకొని వెళ్తుంది. కోపంగా కావేరిని పిలిచి మా అక్కని చంపిందే కాక అలా చూస్తావేంటే అని కావేరిని నాగవల్లి అడుగుతుంది. మా అక్క ప్రాణాలు తీసిన నిన్ను వదలనే అని పొడవబోతే దేవా వచ్చి ఆపుతాడు. మన ఇంటికి అతిథిలా వచ్చింది తను ఇప్పుడు అలా చేయకూడదు అని నాగవల్లికి సర్ది చెప్తాడు. దేనికైనా సమయం సందర్భం ఉండాలి కదా అని దేవా అంటే కావేరి షాక్ అయి చూస్తుంది. దేవా నాగవల్లిని పంపేస్తాడు.
కావేరి దేవాతో పెళ్లాన్ని చంపిన పెద్ద మనిషివి పెద్ద మనిషిలా బాగానే మాట్లాడావ్ పెద్ద మనిషి ముసుగులో ఎక్కువ రోజులు ఉండలేవ్ గుర్తు పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ బాలరాజుని చూసి ఏం రెచ్చిపోతున్నావే అని దేవా అనుకుంటాడు. మరోవైపు బాలరాజు సత్యంబాబు మర్డర్ గురించి తన మనుషులతో ఎంక్వైరీ చేయిస్తాడు. సత్యంబాబుని రోడ్డు మీద ఎవరూ చంపలేదు అని దేవా తన అడ్డాలో చంపి రోడ్డు మీద పడేసుంటాడని అనుకుంటారు. బాలరాజు ఆలోచించి తనకు ఆ రోజు కాల్ చేసిన మాణిక్యాన్ని గుర్తు చేసుకొని మాణిక్యాన్ని అడ్డు పెట్టుకొని ఓ ఆట ఆడుకోవాలి అనుకుంటాడు. కావేరి దేవా ఇంట్లో ఎలా ఉందో తెలుసుకోవాలని కాల్ చేసి మాట్లాడుతాడు. ఫంక్షన్ అయిన తర్వాత చెప్తే వచ్చి తీసుకెళ్తా అంటాడు.
మహి తులాభారానికి ఏర్పాట్లు చేస్తారు. మహి రెడీ అయి కిందకి వస్తాడు. చందు మహితో నీ కోసం చిన్ని గిఫ్ట్ తీసుకొచ్చిందని అంటాడు. మహి చాలా హ్యాపీగా చిన్నికి గిఫ్ట్ అడుగుతాడు. చిన్ని ఇచ్చిన బొమ్మలు చూసి మహి చాలా సంతోష పడతాడు. మహి కూడా చిన్ని కోసం తీసుకున్న గిఫ్ట్ ఇస్తాడు. మనసంతా నువ్వే సినిమాలో హీరోయిన్ హీరోకి ఇచ్చినట్లు ఓ వాచ్‌ని మహి చిన్నీకి ఇస్తాడు. చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. లోహిత కుళ్లుకుంటుంది. చిన్ని మహికి థ్యాంక్స్ చెప్తుంది. పూజ ప్రారంభమవుతుంది. పంతులుతో మహి పంతులు ఇలా మృత్యుంజయ హోమం జరిపిస్తే నాకు ఉన్న గండాలు అన్నీ పోతాయా అని అడుగుతాడు. తప్పకుండా పోతాయి అని పంతులు చెప్పడంతో మహి చిన్నీని చూసి అక్కడ మరో పీట వేస్తాడు. అందరూ షాక్ అయి చూస్తారు అది ఎందుకు నాగవల్లి అడిగితే చిన్ని కోసం అని మహి అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాఘవ కొడుకే ఆనంద్.. రుక్మిణి, ఆనంద్‌ల ప్రేమ కథ వెనక పెద్ద కథే ఉందిగా!





















