Chinni Serial Today June 3rd: చిన్ని సీరియల్: ప్రాణాలకు తెగించి మహిని కాపాడిన చిన్ని.. పిల్లల స్నేహం దేవా కళ్లు తెరిపిస్తుందా..!
Chinni Today Episode మహిని కాపాడటానికి చిన్ని పాము కాటుకు గురి కావడం మహి చిన్ని కోసం ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నికి గిఫ్ట్ ఇవ్వడానికి మహి చిన్ని కోసం వెతుకుతాడు. చందు ఓ వైపు మహి ఓ వైపు చిన్ని ఎక్కడ ఉందా అని చూస్తారు. మహి వెళ్తుంటే అక్కడే ఆడుకుంటున్న పిల్లలు మహికి బాలు ఇవ్వమని చెప్తారు. చిన్ని, చందు మహి దగ్గరకు వస్తుంటారు. మహి పక్కనే పాము ఉండటం చిన్ని చూస్తుంది.
మహి అంటూ చిన్ని పరుగులు తీసి మహిని పక్కకు నెట్టి తాను పాము కాటుకి గురవుతుంది. మహి, చందు చాలా కంగారు పడతారు. అందర్ని పిలుస్తారు. చిన్ని అమ్మా అని గట్టిగా అరుస్తుంది. బాలరాజు, కావేరి రావడంతో చిన్నికి పాము కాటేసిందని చందు చెప్తాడు. చిన్ని కళ్లు తిరిగి పడిపోతుంది. నోటి నుంచి నురగ వస్తుంది. బాలరాజు చిన్ని చేతికి కట్టు కట్టి విషం నోటితో లాగేస్తాడు. తర్వాత హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. చందు, లోహిత కూడా చిన్ని వెనక పరుగులు తీస్తారు. మహి ఏడుస్తూ ఉంటే నాగవల్లి, దేవా వస్తారు. ఏమైందని అడిగితే చిన్నికి పాము కాటేసిందని మహి చెప్తాడు. తనని కాపాడబోయి చిన్ని ప్రమాదంలో పడింది అని మనం కూడా హాస్పిటల్‌కి వెళ్దాం అంటాడు.
బాలరాజు వాళ్లు వెళ్తున్న ఆటో డ్రైవర్ నాటు వైద్యులు పాము కాటుని నయం చేస్తారు అనడంతో కావేరి అక్కడికి తీసుకెళ్లమని అంటుంది. అక్కడికి తీసుకెళ్తారు. గురువుగారు చిన్నిని చూస్తారు. మహిని తీసుకొని దేవా వాళ్లు అక్కడికి వస్తారు. చిన్నికి భయంకరమైన విష నాగు కాటేసిందని గురువుగారు చెప్తారు. కావేరి బాలరాజు షాక్ అయిపోతారు. గురువుగారు పసరు మందు నూరుతూ ఆ విషనాగు కాటేస్తే క్షణాల్లో విషం ఎక్కుతుంది. మరుక్షణమే కోమాలోకి వెళ్తారని చెప్తారు. కోమాలోకి వెళ్లినవాళ్లు బయటకు రావడం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కావేరి చాలా ఏడుస్తుంది. బాలరాజు కూడా ఏడుస్తాడు. ఎలా అయినా చిన్నిని కాపాడమని కావేరి, బాలరాజు బతిమాలుతారు.
గురువుగారు చిన్నికి పసరు మందు వేస్తారు. చాలా సేపటి తర్వాత చిన్ని కళ్లు తెరుస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఎలా ఉందని కావేరి అడిగితే బాగానే ఉందని టీచరమ్మ అని కావేరి చెప్తుంది. బాలరాజు గురువుగారికి దండం పెట్టి మా చిన్నిని కాపాడారు మీ రుణం తీర్చుకోలేని అంటాడు. మహి చిన్నితో థ్యాంక్యూ చిన్ని నా ప్రాణాలు కాపాడటానికి నీ ప్రాణాలు మీదకు తెచ్చుకున్నావ్ థ్యాంక్యూ అని అంటాడు. దానికి చిన్ని ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయలేనా అంటుంది. దేవా చిన్నితో అందరూ నీలా ఫ్రెండ్ కోసం చేయలేరు కదా అమ్మా అంటాడు. దానికి కౌంటర్‌గా బాలరాజు స్నేహం కోసం ప్రాణం ఇవ్వడం అన్నది మా రక్తంలోనే ఉంది.. అది నిలబెట్టుకోవడం ఎదుటి వారి ప్రవర్తనలో ఉంటుంది అంటాడు.
మహి ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్యూ అమ్మ అని దేవా చిన్నికి చెప్తాడు. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అంకుల్ అని చిన్ని అంటుంది. చిన్నిని తీసుకెళ్లొచ్చా అని బాలరాజు అంటే ఇంకా వైద్యం ఉంది ఈ రాత్రికి ఇక్కడే ఉంచమని అంటారు. రేపు ఉదయం వస్తాను అని చెప్పి మహి వెళ్తాడు. కావేరి ఏడిస్తే ఎందుకు అమ్మా ఏడుస్తావ్ నువ్వు నాన్న ఉండగా ఆ యముడు కూడా నా దగ్గరికి రాలేడు అని అంటుంది. ఉదయం గురువుగారు చిన్నిని పరిశీలించి చిన్నిని తీసుకెళ్లొచ్చని చెప్తారు. ఉదయం చిన్ని కోసం మహి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకొని వస్తాడు. నువ్వు గుడికి రాలేవు కదా చిన్ని అందుకే నీ దగ్గరకు దేవుడిని తీసుకొచ్చా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథునని ఎవరు ఏం అన్నా తట్టుకోలేనమ్మా.. ప్రేమ బయట పెట్టేసిన దేవా!





















