Chinni Serial Today August 1st: చిన్ని సీరియల్: మహికి చిన్ని ఆచూకీ దొరికిందా.. సీసీటీవీ ఫుటేజ్‌లో ఏముంది? మధు కన్నీటికి కారణమెవరు?
Chinni Serial Today Episode August 1st సుబ్బుకి యాక్సిడెంట్ అవ్వడంతో మధు చదవడం మానేస్తానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode సుబ్బుకి యాక్సిడెంట్ అయిందని తెలిసి మధుమిత పరుగున ఇంటికి వస్తుంది. మధు పెంచిన తండ్రిని చూసి ఏడ్చేస్తుంది. ఏమైంది నాన్న ఏం జరిగింది అని అడుగుతుంది. దాంతో పెద్ద యాక్సిడెంట్ కాదమ్మా కంగారు పడకు అని జరిగిన విషయం చెప్తారు.
పద్దూ అందరితో మీకు యాక్సిడెంట్ అయిందని మధు చాలా కంగారు పడిపోయింది అని చెప్తుంది. నేను అంటే నా బిడ్డకి ప్రాణం అమ్మ అని సుబ్బు అంటాడు. అసలు ఇదంతా నా వల్లే నా చదువు కోసం డబ్బు కట్టాలని ఇలా వీధి వీధి తిరుగుతూ కష్టపడుతున్నావ్.. నేను ఇక కాలేజ్‌కి వెళ్లను చదువు మానేస్తాను.. నేను ఊరిలోనే ఏదో ఒక పని చూసుకొని నువ్వు బయటకు వెళ్లకుండా చూసుకుంటా అంటుంది. దాంతో సుబ్బు పిచ్చి తల్లీ నాకు ఏదో చిన్ని దెబ్బ తగిలిందని చదువు మానేస్తా అంటావా.. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నీ కల మీ అమ్మకోరిక కూడా. నీ కల నెరవేరకపోతే నేన బతికున్నా చచ్చిన వాడితో సమానం ఇంకెప్పుడు చదువు మానేస్తా అని అనొద్దు అంటాడు.
మహి చిన్ని గీసిన డ్రాయింగ్ చూస్తూ నాకు తెలుసు చిన్ని నువ్వు ఈ ఊరిలోనే ఉన్నావని నాకు తెలుసు త్వరలోనే మనం కలుస్తామని నా మనసు చెప్తుంది అని హ్యాపీగా ఫీలవుతాడు. ఇక చిన్ని తండ్రి బాలరాజు ఫొటో పట్టుకొని త్వరలోనే మనం కలుస్తామని నా మనసు చెప్తుంది నాన్న అంటుంది. మహి చిన్నిని తలచుకొని మాట్లాడుతుంటే.. చిన్ని తండ్రి గురించి ఆలోచిస్తుంది. మహి చిన్ని నువ్వు ఈ ఊరిలో ఉన్నావని తెలిసింది కదా ఎక్కడున్నా తెలుసుకుంటానని అంటాడు. మధు తండ్రి ఫొటో చూస్తూ నువ్వు ఎక్కడున్నా తెలుసుకుంటా నాన్నఅంటుంది.
స్వరూప మధుని చూసి ఇంకా పడుకోలేదా ఏమైంది అమ్మా అని పక్కన కూర్చొంటుంది. మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావా అని సుబ్బు గురించి అంటే అవును మానాన్న గురించే ఆలోచిస్తున్నా అని బాలరాజు గురించి అనుకుంటుంది. ఇక స్వరూపతో అమ్మ ఒక రెండు నిమిషాలు నీ ఒడిలో పడుకుంటా అని కావేరిని గుర్తు చేసుకొని ఏడుస్తుంది. అలా తల్లి ఒడిలో పడుకుండిపోతుంది.
ఉదయం మినిస్టర్ దేవా పొలిటికల్ పని మీద రోడ్డు మీద వెళ్తుంటే అటుగా బాలరాజు తిరుగుతూ ఉంటాడు. ఓ చోట బాలరాజు అలసిపోయి కూర్చొంటాడు. దేవా దగ్గరకు ఓకాయన వచ్చి స్కూట్ సమస్యలు చెప్పి సాయం చేయమని అంటాడు. దేవా చూస్తున్నా ఆ పేపర్ ఎగిరి బాలరాజు పక్కన పడుతుంది. అతనితో దేవా మాట్లాడటం ఆ మాటలు విన్ని బాల దేవా గాడి గొంతులా ఉందని చూస్తాడు. బాలరాజు చూసే టైంకి దేవా కారు ఎక్కి వెళ్లిపోతాడు. బాలరాజు షాక్ అయి వెనక పరుగెత్తబోయి పడిపోతాడు. రేయ్ దేవా అని అరుస్తాడు. అప్పటికే దేవా వెళ్లిపోతాడు. నిన్ను అస్సలు వదలనురా అని అనుకుంటాడు. నువ్వు మినిస్టర్ అయినా సరే నిన్ను వదలను చంపేస్తా అనుకుంటాడు.
మహి, తన ఫ్రెండ్‌ని తీసుకొని చిన్ని బొమ్మ వేసిన ప్లేస్‌కి వస్తాడు. అక్కడున్న సీసీ కెమెరాల్లో చిన్ని బొమ్మ వేయడం రికార్డ్ అయింటుంది కదా అని మొత్తం చూస్తాడు. అక్కడ సీసీ టీవీ ఉండదు దాంతో ఇక్కడ లేకపోయినా దగ్గర్లో ఉన్న సీసీ టీవీలను చూద్దాం చిన్ని ఆటో ఇటో వెళ్లుంటుంది కదా అనుకొని ఓ షాప్ దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ కోసం పరుగులు పెడతాడు. షాపు అతనికి వెళ్లి ఫుటేజ్ అడుగుతాడు. అతను ఇవ్వను అంటాడు. దాంతో మహి ఫ్రెండ్ అతను ఎవరో తెలుసా మినిస్టర్ దేవేంద్ర గారి అబ్బాయి అని అంటాడు. దాంతో షాప్ అతను ఇస్తాడు. కళ్లు లేని పాప అంతా ఉంటుంది కానీ చిన్ని కనిపించే టైంకి మహి పెన్‌డ్రైవ్ కోసం తిరిగిపోతాడు. దాంతో చాలా షాప్‌లకు తిరుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















