అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today Comedy: 'గోవింద చూడవయ్య వీళ్ళిద్దరి మాయ గోల.. 'ప్రేమ' టార్చర్ 2.0.. ధీరజ్ ఇక కాస్కో..!

Illu Illalu Pillalu Serial Prema Comedy ధీరజ్‌ని తన పనులన్నీ చేయమని ప్రేమ సతాయించడం.. ఇద్దరూ టామ్ అండ్ జర్రీల్లా కొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్‌లో సీన్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Prema's Twist 'గోవింద చూడవయ్య వీళ్ళిద్దరి మాయ గోల.. ఇద్దరి మధ్య హేట్ యూ.. అంటూ హ్యాపీ మూవీలో జెనీలియా, అల్లుఅర్జున్‌ ఒకర్ని ఒకరు ఇరిటేట్ చేసుకున్నట్లు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో జరుగుతోంది. ఇంతకీ ఎవరు ఎవర్ని ఇరిటేట్ చేస్తున్నారో తెలుసా.. అదేనండీ మన పెద్ద రాయుడు రామరాజు ఇంట్లో ప్రేమ ధీరజ్‌ని తెగ ఇరిటేట్ చేసేస్తోంది. ఈ మధ్య ధీరజ్‌ని వెంట పడి మరీ లవ్‌ చేసేస్తున్న ప్రేమ సడెన్‌గా మళ్లీ పాత ప్రేమలా మారిపోయి ధీరజ్‌ని టార్చర్‌ చేయడానికి కారణమేంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. 

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ధీరజ్, ప్రేమల జంట భలే క్యూట్‌గా ఉంటుంది. వరసకు బావమరదళ్లు అయిన వీళ్లు ఇంటి గొడవల కారణంగా టామ్ అండ్ జర్రీల్లా ఉంటారు. అనుకోకుండా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకురావడంతో అందరూ ఈ ఇద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. ప్రేమ, ధీరజ్‌ల పెళ్లితో ప్రేమ, వేదవతిల పుట్టిళ్లు రామరాజుని మరింత దారుణంగా చూస్తున్నారు. అయితే మొదటి నుంచి గిల్లిగజ్జాలు ఆడుకునే ధీరజ్, ప్రేమల్లో ధీరజ్ తనకోసం చదువుకుంటూ పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడటం చూసిన ప్రేమకు భర్త ధీరజ్ మీద ప్రేమ మొదలవుతుంది. భర్తకి ఆర్థిక సాయం  చేయాలని నిర్ణయించుకున్న ప్రేమ ఇంట్లో ఎవరికీ తెలీకుండా డ్యాన్స్ క్లాస్‌లు చెప్తుంది. ఆ విషయం ప్రేమ పుట్టింట్లో తెలిసి రచ్చ చేస్తారు. రామరాజుని నడిరోడ్డు మీద నిలబెట్టి బట్టలు చింపేసి దారుణంగా అవమానిస్తారు. ఈ టైంలో ధీరజ్.. తండ్రి అవమానానికి ప్రేమ కారణం అని ప్రేమ మీద కోపం పెంచుకుంటాడు. 

ఒక టైంలో ప్రేమతో గొడవ పడి నిన్ను నేను భార్యగా కాదు కదా మనిషిలా కూడా చూడటం లేదు.. ఇంట్లో వస్తువులు ఎలాగో నువ్వు నాకు అలాగే నా దృష్టిలో నువ్వు ఓ వస్తువువే.. కేవలం నీ మెడలో తాళి కట్టినందుకు నీకు తిండి, నీ అవసరాలు తీర్చడం నా బాధ్యత అని అంటాడు. ధీరజ్ మాటలకు ప్రేమ గుండె ముక్కలైపోతుంది.  అప్పటి నుంచి ధీరజ్‌కి టార్చర్ మొదలవుతుంది. ధీరజ్ ఏ పని ప్రేమకు చెప్పినా నేను వస్తువుని కదా.. వస్తువులు పని చేయవు.. వస్తువులు మాట్లాడవు.. వస్తువులు తినవు అంటూ ధీరజ్ తాటతీస్తుంది. ఇవాళ్టి ఎపిసోడ్‌లో అయితే ఈ జంట మధ్య సీన్స్ సీరియల్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చాయనే చెప్పుకోవచ్చు.. 

ధీరజ్ ఉదయం నిద్ర లేచేసరికి గది మొత్తం పొగ ఉంటుంది. కంగారు పడిన ధీరజ్ ఎదురుగా చూసేసరికి ప్రేమ చేతబడి చేసినట్లు ధీరజ్ ఫొటో చుట్టూ చేతబడి ముగ్గు వేసి ఆ ఫొటోకి ధూపం వేసి గంట కొట్టి తెగ హడావుడి చేస్తేంది. చేతబడి చేస్తున్నావానే అని ధీరజ్ అడిగితే కాదు లేరా కంగారు పడకు.. నా మెడలో తాళి కట్టినందుకు నన్ను చూసుకోవడం నా అవసరాలు తీర్చడం నీ బాధ్యత అన్నావు కాబట్టి నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని పూజ చేస్తున్నా అంటుంది. ధీరజ్ షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ ధీరజ్‌కి కాఫీ పెట్టి ఇవ్వమని చెప్తుంది. నీకు పిచ్చా నాకు చెప్తున్నావ్ అని ధీరజ్ అంటే నన్ను చూసుకోవడం నీ బాధ్యత అన్నావు కదా నాకు సంబంధించి ప్రతీ పని నువ్వే చేస్తా అన్నావు కదా ఇప్పుడు తీసుకురా అంటుంది.

ధీరజ్ కిచెన్‌లోకి వెళ్లి తిప్పలు పడి కాఫీ తెస్తాడు. ప్రేమ చక్కగా రాళ్లతో ఆడుకుంటూ కాఫీ తాగుతుంది. తర్వాత ఆకలేస్తుంది అంటుంది. ఇప్పుడే కదే గేదె కుడితి తాగినట్లు కాఫీ తాగావ్ అంటాడు. ముందు నేను చెప్పినట్లు పుల్లట్ల పుల్లాయమ్మా హోటల్‌కి వెళ్లి నాలుగు పుల్లట్లు తీసుకురా అంటుంది. ఓసేయ్ అది నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉందే నా దగ్గర బైక్ కూడా లేదు అని ధీరజ్ అంటే నాకు అదంతా తెలీదు.. నన్ను చూసుకోవడం నీ బాధ్యత వెళ్లి తీసుకురా అంటుంది. నేను తీసుకురాను అని ధీరజ్ అంటే బాధ్యత అని రాసిన స్లోగన్ చూపించి ధీరజ్‌ని పంపిస్తుంది. ధీరజ్ తిట్టుకుంటూ వెళ్తాడు. ప్రేమ ఓరేయ్ ధీరజ్ అంటూ పెద్ద కుండ పగలగొడుతుంది. ఇక ధీరజ్ టిఫెన్ తీసుకురాగానే మొత్తం లాగించేస్తుంది. ఓసేయ్ నాలుగు కిలోమీటర్లు సైకిల్ తొక్కి తీసుకొచ్చానే మాట వరసకు అయినా ముక్క తింటావా అని అడగవేంటే అని అంటే వస్తువులు అడగవు అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ ఈ టార్చర్ నావల్ల కాదు బాబోయ్ అంటాడు. ఇప్పుడే ఏంట్రా ముందుంది నీకు ముసళ్ల పండగ అని ప్రేమ అనగానే ధీరజ్ నా వల్ల కాదు అంటూ పడిపోతాడు. ఈ సీన్‌ మొత్తానికి హ్యాపీ మూవీలోని గోవిందా చూడవయ్యా వీళ్లిద్దరి వింత గోల సాంగ్ రావడంతో ఈ రోజు ఎపిసోడ్‌లో ఈ సీన్ చూసే వారికి భలే ఎంటర్‌టైన్‌గా ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరికి నువ్వు కన్నతల్లివేనా? సహస్ర మీద విహారి ఫైర్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరికి నువ్వు కన్నతల్లివేనా? సహస్ర మీద విహారి ఫైర్!
Godavari Serial Today November 4th: 'గోదావరి' సీరియల్: నందు ఆకర్ష్‌కి దగ్గరైపోతుందా! గౌతమి బాధని జాను తీర్చుతుందా!
'గోదావరి' సీరియల్: నందు ఆకర్ష్‌కి దగ్గరైపోతుందా! గౌతమి బాధని జాను తీర్చుతుందా!
Nindu Manasulu Serial Today November 4th: నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
నిండు మనసులు: మళ్లీ నా మీద ప్రేమ మొదలైందా: సిద్ధూ ప్రశ్నకి ప్రేరణ షాక్! తీర్థయాత్రలకు ఫ్యామిలీ!
Illu Illalu Pillalu Serial Today November 4th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విడాకుల విషయంలో తండ్రికి ఎదురు తిరిగిన చందు! అందరి కాళ్ల మీద పడుతున్న వల్లీ!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget