అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today August 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: తప్ప తాగేసిన దేవా.. మిథున ప్రేమని కోల్పోతాడా? త్రిపుర, ఆదిత్యల కుట్రలో ఇరుక్కున్నాడా?

Nuvvunte Naa Jathaga Today Episode August 1st ఆదిత్య దేవాతో మిథున నీకు సరిపోదు నువ్వు ప్రేమించడానికి పనికి రావు అని దేవా తాగేలా చేయడం ఇంట్లో గొడవ జరగడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మందు తాగకపోవడంతో పిచ్చి పిచ్చి అయిపోతుంటాడు. కళ్లు మూస్తే చాలు గ్లాస్‌లో మందు పోస్తున్న సౌండే వస్తుంది. కొంచెం అయినా తాగాల్సిందే.. అని అనుకుంటాడు. అంతలోనే మిథున తాగొద్దని చెప్పిన మాట గుర్తొచ్చి ఆగిపోతాడు. బయట తిరగాడనికి వెళ్తాడు.

మరోవైపు త్రిపుర రాహుల్‌తో తన తమ్ముడి బాధ చూసి గుండె తరుక్కుపోతుందని.. మిథున మిథున అంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు.. అని బాధ పడుతుంది. రాహుల్ త్రిపురని బాధపడొద్దని ఆ రౌడీని మా నాన్న అల్లుడిగా అంగీకరించే ప్రసక్తే లేదు.. వాడి వరస్ట్‌ బిహేవియర్ నచ్చక వారంలో పంపేస్తారు చూస్తుండు అని చెప్తాడు. మిథునని తక్కువ అంచనా వేయడానికి వీళ్లేదు ఆ రౌడీ గాడిని కడిగిన ముత్యంలా  మీ నాన్నకి చూపిస్తుంది. అలా ఎప్పటికీ జరగకూడదు అలా ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పు అని అడుగుతాడు. మామయ్య గారి ముందు వాడిని ఇరికించాలి.. వాడి వీక్‌నెస్ మీద కొట్టి నట్టింట్లో బీభత్సం సృష్టించేలా చేద్దాం.. వాడిని గెంటేసేలా చేయాలి అని అంటుంది.

దేవా బయట నిల్చొని ఉంటే ఆదిత్య మందు బాటిల్ తీసుకొని వెళ్తాడు. దేవా చూడకుండా మందు బాటిల్ పక్కన పెట్టి దేవా దగ్గరకు వెళ్లి ఏంటి బ్రో ఇలా ఇక్కడ ఉన్నావ్ అని అడుగుతాడు. దానికి దేవా నిద్ర పట్టక ఇక్కడున్నానని అంటాడు. దానికి ఆదిత్య బాడీలో మందు పడక ఇలా అయిపోతున్నావా అని అంటాడు. దానికి అవును అని దేవా అంటాడు. ఎవరితోనో తెప్పించుకోవచ్చు కదా అంటాడు. మిథునకు మాటిచ్చానని దేవా అంటే భయ్యా నువ్వు మిథునని లవ్ చేస్తున్నావా.. ఒకప్పుడు తనని తీసుకెళ్లిపో అని నాతో చెప్పి అంత ద్వేషించే నువ్వు ఇలా మారిపోవడం షాకింగ్‌గా ఉంది.. నువ్వు నిజంగా మిథునని ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు. 

దేవా అవును అని చెప్పేలోపు లేదు భయ్యా నువ్వు ప్రేమించవు నాకు తెలుసు. తన రేంజ్ ఏంటి నీ స్థాయి ఏంటి.. తనది ఫారిన్ లైఫ్ నీది బస్తీ లైఫ్.. తను విమానాల్లో తిరిగితే నువ్వు పాత డొక్కు బండిలో తిరుగుతావు.. మిథున ఒక్కోసారి లక్షల్లో ఉన్న చెప్పులు వేసుకుంటుంది. నువ్వు తెగిన చెప్పులు మళ్లీ మళ్లీ కుట్టుకునే వేసుకునే టైప్.. చందమామ అంత ఎత్తులో ఉన్న మిథునని అందుకోలేమని నీకు తెలిసినప్పుడు తనని ప్రేమిస్తున్నానని నువ్వు ఎందుకు అనుకుంటావ్‌లే.. నీ స్థాయి తన కారు డోర్ తీసే స్థాయి.. నేను ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడను సారీ భయ్యా కానీ నీది మిథునని లవ్ చేసే స్థాయి నీది కాదని చెప్పడానికి ఇలా అన్నాను.. మిథున నీడ పక్కన నడిచే స్థాయి కూడా నీది కాదు మరి అలాంటప్పుడు మిథునని ఎలా ప్రేమిస్తావు అస్సలు ప్రేమించవు అని అంటాడు.

ఆదిత్య మాటలకు రగిలిపోయిన దేవా ఏం మాట్లాడకుండా వెళ్లిపోతూ ఆదిత్య పెట్టిన మందు బాటిల్ మొత్తం తాగేస్తాడు. నేను నీకు కరెక్ట్ కాదు మిథున కరెక్ట్ కాదు.. నువ్వు ప్రిన్సెస్‌వి నేను ఫ్లాట్‌ఫాంని నేను నీకు కరెక్ట్ కాదు అని మత్తులో బాధగా మాట్లాడుతూ మందు తాగుతాడు. అది చూసిన త్రిపుర కరెక్ట్‌గా దొరికావురా అని అంటుంది. మరోవైపు సత్యమూర్తి సూర్యకాంతం మాటలు తలచుకొని చాలా బాధ పడతాడు. మామయ్య చచ్చిపోయే వరకు మనకు ఈ ఇళ్లు అమ్మే అవకాశం లేదు ఆయన చచ్చిపోయే వరకు మనం ఈ ఇంట్లో చచ్చినట్లు ఉండాల్సిందే అని అన్న మాటలు తలచుకొని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. శారద చూసి ఏడుస్తూ చేతిలో పాల గ్లాస్ పడేస్తుంది. నేను చచ్చే వరకు చూడకూడదు అన్నది చూశాను వినకూడని మాట విన్నాను అని అంటుంది. ఏంటి శారద అని సత్యమూర్తి అడిగితే నా భర్త కన్నీరు చూశాను.. నా కొడుకు ఇళ్లు అమ్మాలి అనుకోవడం అనే మాట విన్నాను అంటుంది.

సత్యమూర్తి ఏడుస్తూ నా ప్రాణమైన ఇళ్లుని నా కొడుకు అమ్మాలి అనుకున్నాడు నా ప్రాణం భాగాలు చేసుకోవాలి అనుకున్నాడు అని ఏడుస్తాడు. బాధ పడొద్దండీ నేను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా అని శ్రీరంగం మాత్రమే ఇలా అనుకున్నాడు ఇప్పుడు ఆనంద్, ప్రమోదిని అడ్డుకున్నారు. దేవా మిథున కూడా ఒప్పుకోరు. పిల్లలు ఎప్పటికీ విడిపోరు అని అంటుంది. ద

దేవా మత్తులో లోపలికి వస్తుంటే త్రిపుర ఫ్లవర్ వాష్ పడేస్తుంది. అందరూ వస్తారు. దేవా త్రిపుర దగ్గరకు వెళ్లి గుడ్ మార్నింగ్ అండీ అక్కయ్యగారు.. టీ తాగారా టిఫిన్ చేశారా మాట్లాడరా ఓకే అని తూగుతూ అంటాడు. ఏమైందమ్మా త్రిపుర అని హరివర్ధన్ అడిగితే మీరు అంగీకరించాలి అనుకున్న మీ అల్లుడిని చూడండి పీకల వరకు తాగేసున్నాడు.. పద్ధతులకు మారుపేరన ఈ ఇంట్లో మందు తాగుతూ తూలుతున్నాడు చూడండి.. ఇది గౌరవ ప్రధమైన జడ్జి గారి ఇల్లా వీడు ఉండే రౌడీ ఏరియానా.. వీడు ఈ ఇంటిని ఎలా తయారు చేశాడో చూడండి.. ఈ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు.. పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది.. ఇలా అర్థరాత్రి తాగి రావడం వల్ల ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి అని అంటుంది. దానికి మిథున దేవా వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అంటుంది. పరాయి వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా అని అంటుంది.

మిథున దేవా దగ్గరకు వెళ్లి నీ అంతట నువ్వు తాగావా.. అంటే దేవా లేదని చెప్తాడు. మరి నీతో ఎవరు తాగించారు.. నువ్వు తాగడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారని త్రిపుర అంటుంది. దానికి మిథున ఆయన అంతట ఆయన తాగరు ఎవరో తాగించారు అని అంటుంది. ఇదేనా వీడి అద్భుతమైన గుణగణాలు అని మిథునని త్రిపుర ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget