Jagadhatri Serial Today July 31st: జగద్ధాత్రి సీరియల్: అడుగడుగునా కేథార్‌కి అవమానిస్తున్న యువరాజ్.. గుడిలో అలా ఎందుకు చేశాడు?
Jagadhatri Serial Today Episode July 31st నిషిక, వైజయంతి నగలు గుడిలో దొంగలు దొంగిలించడం కేథర్, జగద్ధాత్రి వాళ్లని పట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి నిషికతో తనకి మత్తు మందు ప్లాన్ తెలిసిపోయిందని అందుకే నాటకం ఆడామని చెప్తుంది. అందులో భాగంగానే తలగడలు బెడీ మీద పెట్టి పడుకున్నట్లు నాటకం ఆడామని చెప్తుంది. నేను మత్తు మందు కలపడం ఏంటి అని నిషిక బుకాయిస్తుంది. నా గురించి తెలిసి కూడా ఇలాంటి ప్లాన్స్‌లు చేస్తావేంటి నిషి.. కేథార్‌కి ఈ ఆనందం కూడా దూరం చేయొద్దు కాదు కూడదు అంటే నీకు మరో జగద్ధాత్రిని పరిచయం చేస్తా అని వార్నింగ్ ఇస్తుంది.
కౌషికి వాళ్లు పంతులుతో పూజ చేయించమని అంటే పంతులు సుధాకర్, వైజయంతిల పేర్లు చెప్పి అన్నీ పూజలు చేసేశారని అంటారు. సుధాకర్ కేథార్, జగద్ధాత్రిలకు థ్యాంక్స్ చెప్తాడు. మీ సంతోషమే నాకు కావాలి నాన్న అని కేథార్ అంటే మీరు రానంత వరకు భాగానే ఉన్నామని వైజయంతి అంటుంది. ఇక పంతులు అందరి పేర్లు చెప్పమని అంటారు. అందరి పేర్లు చెప్తారు. వజ్రపాటి కేథార్, జగద్ధాత్రి అని పంతులు చెప్పగానే యువరాజ్ రగిలిపోతాడు.
కేథార్ పంతులుకి పల్లెం ఇస్తే యువరాజ్ వచ్చి దాన్ని విసిరేస్తాడు. నువ్వు ఎవడ్రా మా ఫ్యామిలీతో పాటు పూజలు చేయడానికి.. అని అడుగుతాడు. పూజ చేయించడం తప్పేనా అని జగద్ధాత్రి అడిగితే పూజ చేయించడం తప్పు కాదు పెద్ద కొడుకు స్థానంలో ఉండి చేయించడానికి తప్పు అని అంటాడు. వద్దన్న పని మళ్లీ మళ్లీ చేసి కోపం తెప్పించడం తప్పు కాదా అని నిషిక అంటుంది. నువ్వు చేసిన పని నేను చేయడానికి ఒక్క క్షణం చాలు కానీ నాన్న బాధ పడతారని ఆగానని కేథార్ అనగానే యువరాజ్ కేథార్‌ని లాగిపెట్టి కొడతాడు. అందరూ షాక్ అవుతారు.
యువరాజ్ కేథార్ షర్ట్ పట్టుకుంటాడు. అందరూ చూస్తున్నారు వదిలేయ్ యువరాజ్ అని కౌషికి అడుగుతుంది. కేథార్ యువరాజ్‌తో నాన్న ఈ రోజు సంతోషంగా ఉండాలి.. నా చేతి దెబ్బ రుచి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా.. అందరి ముందు కొడితే నీ పరువు పోతుంది. నీ గుట్టు మొత్తం అందరికీ చెప్పేస్తా. సైలెంట్‌గా పడేసినవన్నీ తీసి బుట్టలో పెట్టి పంతులు గారికి ఇవ్వు వార్నింగ్ ఇస్తాడు. యువరాజు మారు మాట్లాడకుండా అన్నీ తీసి బుట్టలో వేసి పంతులుకి ఇచ్చి పూజ చేయమని అంటాడు. యువరాజ్ అలా చేయడంతో నిషిక, వైజయంతిలు షాక్ అయిపోతారు. ఏం చేస్తున్నావ్‌రా వాళ్ల బుట్ట ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతాడు. అందరూ సైలెంట్‌గా ఉండండి అని కౌషికి చెప్తుంది.
పూజ పూర్తయిపోతుంది. మరోవైపు ఒక మహిళ, ఇద్దరు మగవాళ్లు గుడి లోపలికి వచ్చి దంగతనం చేయడానికి వస్తారు. ఆ మహిళ నిషిక, వైజయంతి కళ్లలో కారం పొడి వేసి ఇద్దరి నగలు తీసేసుకుంటారు. జగద్ధాత్రి, కౌషికి వాళ్లతో నిషిక కారం కొట్టి నగలు తీసుకున్నారని చెప్తారు. జగద్ధాత్రి వెంటనే గుడి తలుపులు వేసేయమని కేథార్‌కి చెప్తుంది.కౌషికి వాళ్లు నిషిక వాళ్ల కళ్లలో కారం కడుగుతుంది. ఇక జగద్ధాత్రి, కేథార్ అందరినీ చెక్ చేసి పంపిస్తారు. ఆ దొంగ తప్పించుకోవడానికి ప్రెగ్నెంట్‌లా నటిస్తుంది. తొమ్మిదో నెల నొప్పిలు మొదలయ్యాయని కంగారు పెడుతుంది. జగద్ధాత్రి తీసుకెళ్తానని అంటే బయట నా కారు ఉందని ఆమె చెప్తుంది. జగద్ధాత్రి తోడుగా వెళ్తుంది. ఆ మహిళను దగ్గరుండి ఎక్కిస్తుంది. తీరా ఎక్కాక డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతాడు.
జగద్ధాత్రికి సీన్ అర్థమైపోతుంది. ఆ మహిళ జగద్ధాత్రిని కారు డోర్‌తో తోసేస్తుంది. ఇక కేథార్ వచ్చి మగ దొంగని జగద్ధాత్రి ఆ మహిళను కొట్టడంతో నగలు బయట పడతాయి. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ వాళ్లని కొట్టి నగలు తీసుకుంటారు. దొంగలు పారిపోతే కేథార్‌కి సీసీ ఫుటేజ్ చూడమని అంటుంది. ఇక నగలు జగద్ధాత్రి అత్త, చెల్లికి ఇస్తుంది. ఇక అందరూ ఆఫీస్‌కి వెళ్తారు. సుధాకర్, వైజయంతికి విష్ చేసి వెల్ కమ్ చెప్తారు. మేనేజర్‌తో యువరాజ్ ఏదో చెప్పడం జగద్ధాత్రి, కేథార్‌లు చూస్తారు. సుధాకర్, వైజయంతిలు కేక్ కట్ చేస్తారు. కేథార్ తినిపించడానికి వస్తే వైజయంతి వెళ్లిపోతుంటే సుధాకర్ ఆపేస్తాడు. ఇక కేథార్ తినిపించే టైంకి వైజయంతి తోసేస్తుంది. కేక్ ఎలా తినిపించాలో తెలీదు అలా తెలియాలి అంటే ఫ్యామిలీ ఉండాలి కదా అని నిషిక అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















