Chinni Serial Today july 31st: చిన్ని సీరియల్: తండ్రి కోసం జైలుకు వెళ్లిన మధు.. వల్లి, దేవాలు చిన్నిని చంపేస్తారా?
Chinni Serial Today Episode july 31st చిన్ని బతికే ఉందని మహి ఇంట్లో చెప్పడం నాగవల్లి, దేవాలు చిన్నిని చంపేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మనుషులు మధుమిత తండ్రి సుబ్బుకి యాక్సిడెంట్ చేస్తారు. సుబ్బు కింద పడిపోతాడు. నాగవల్లికి పీఏ కాల్ చేసి ఫస్ట్ వికెట్ పడిందని చెప్తాడు. ఎస్ ఆ పిల్ల ఇప్పుడు బాధ పడాలి.. తనే రెండో వికెట్ ఎప్పుడు బయటకు వెళ్తుందో ఎప్పుడు వస్తుందో గమనిస్తూ ఉండు అని చెప్తుంది నాగవల్లి. దాన్ని చంపే వరకు నా పగ చల్లారదు అని అనుకుంటుంది.
చిన్ని అలియాస్ మధుమిత తన తండ్రి గురించి తెలుసుకోవడానికి సెంట్రల్ జైలుకి వెళ్తుంది. ఆ పరిసరాలు చూసి చాలా కంగారు పడుతుంది. మిగతా ఖైదీలను చూసి వాళ్లతో తన తండ్రి ఉంటాడేమో అని వెతుకుతుంది. అక్కడున్న పోలీస్‌కి తన డిటైల్స్ ఇచ్చి లోపలికి వెళ్తుంది. జైలర్ దగ్గరకు వెళ్లి కంగారు పడుతూ బాలరాజు అనే ఖైదిని కలవడానికి వచ్చానని చెప్తుంది. అతను రిజిస్టర్ చూస్తారు. నాన్న గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఎలాంటి చెడు వార్త వినకుండా చూడు స్వామి అని దేవుడిని మొక్కుకుంటుంది. జైలర్ రిజిస్టర్ మొత్తం చూసి బాలరాజు ఇప్పుడు ఇక్కడ లేడమ్మా.. అతన్ని నెలరోజుల క్రితమే రిలీజ్ అయి వెళ్లిపోయాడని చెప్తారు. మధు చాలా సంతోషపడుతుంది.
నాన్న బతికే ఉన్నాడు. మా నాన్న బతికే ఉన్నాడు అని చాలా సంతోషపడుతుంది. సుబ్బు వాళ్లు ఎందుకు తనకు తన తండ్రి అక్కడ లేడని ఎందుకు చెప్పాడా అని ఆలోచిస్తుంది. అవునో కాదో తెలుసుకోవడానికి జైలర్‌ని ఒక్క సారి అతన్ని చూపించమని అంటుంది. దాంతో ఆయన బాలరాజు ఫొటో సంతకం చూపిస్తారు. మధు ఆ ఫొటో చూసి చాలా సంతోషపడుతుంది. ఎవరమ్మా ఆయన నీకు ఆయన ఏమవుతారు అని అడిగితే ఆయన మా నాన్న అని చెప్పబోయి నాకు బాగా కావాల్సిన వాళ్లు అని అంటుంది. ఇక జైలర్‌ని అడిగి ఫొటో తీసుకుంటా అంటుంది. ఆయన సరే అంటారు.
మధు తండ్రి ఫొటో తీస్తున్న టైంకి చంటి ఫోన్ చేస్తాడు. నాన్నకి యాక్సిడెంట్ అయింది అక్క అని చెప్తాడు. మధు కంగారులో ఫొటో తీసుకోకుండా పరుగులు పెడుతుంది. మరోవైపు మహి సంతోషంగా ఇంటికి వస్తాడు. అక్కడే ఉన్న వరుణ్‌ని హగ్ చేసుకొని బావా నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అంటాడు. గుడ్ న్యూస్ బావ.. ఇంత కాలం నేను ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ తెలిసింది. నా చిన్ని గురించి న్యూస్ బావ అంటాడు. అప్పుడే వచ్చిన నాగవల్లి, దేవా షాక్ అయిపోతారు. చిన్ని ఈ ఊరిలోనే ఉంది బావ అని అంటాడు. ఎవరు చెప్పారు నాన్న అని నాగవల్లి అడిగితే చిన్ని వేసిన బొమ్మ చెప్పింది మమ్మీ అని బొమ్మ అందులో చిన్ని సంతకాన్ని చూపించిందని అంటాడు. ఇద్దరూ ఒకటే అని గ్యారెంటీ ఏంటి అని మహి అడిగితే చిన్నప్పుడు బొమ్మ కూడా చూపిస్తాడు.
దేవా షాక్ అయిపోతాడు. పదేళ్లగా చిన్ని గురించి ఆలోచించని రోజు లేదు మమ్మీ. చిన్నిని కలవకుండా చనిపోతానేమో.. చిన్నిని తలచుకొని ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపానో చిన్ని కోసం ఎన్నిదేవుళ్లకి మొక్కుకున్నానో మీకు తెలీదు మమ్మీ. ఇప్పటికి ఆ దేవుడు కరుణించాడు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు డాడీ అని అంటాడు. ఇక నుంచి నేను ప్రతీ రోజు ఇంతే సంతోషంగా ఉంటాను అని చెప్పి వరుణ్ తీసుకొని సెలబ్రేట్ చేసుకుందామని తీసుకెళ్తాడు.
నాగవల్లి, దేవాలు మహి గురించి మాట్లాడుతారు. వాడు నమ్మినంత మాత్రానా ఆ చిన్ని బతికి వస్తుందా ఏంటి అనుకుంటారు. ఇంతలో జైలు నుంచి ఓ వ్యక్తి కాల్ దేవాకి కాల్ చేసి బాలరాజు గురించి ఓ అమ్మాయి అడిగిందని చెప్తాడు. దేవా షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 20, 21ఏళ్లు ఉంటాయని చెప్తారు. ఇక సీసీ టీవీ ఫుటేజ్ చూసి ఫొటో పంపమని అంటాడు. దేవా వల్లితో విషయం చెప్తాడు. ఎవరు అని వల్లి అడిగితే తెలుస్తుంది అని అంటాడు. ఇంతలో ఫుటేజ్ వస్తుంది. వెనక నుంచి ఉండటంతో మధుమిత ముఖం కనిపించదు.. దేవా చాలా కోపంగా ఫోన్ విసిరేస్తాడు. ఇరవై ఇరవైఏళ్ల నిజం అమ్మాయి వెళ్లి బాలరాజు కోసం అడిగింది అంటే అది చిన్నినే. మహి చెప్పింది నిజమే. చిన్ని మహి కళ్లు ముందుకు వచ్చేలోపు దాన్ని మనం చంపేయాలి అని వల్లి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















