Ammayi garu Serial Today july 31st: అమ్మాయి గారు సీరియల్: ఇంట్లో అందర్ని రూపగా నమ్మించేసిందిరోయ్.. అసలైన రూప గతేంటి?
Ammayi garu Serial Today Episode july 31st రూపగా ఎంట్రీ ఇచ్చిన కొత్త అమ్మాయి ఇంట్లో అందర్ని తానే రూప అని నమ్మించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode తానే రూపను అంటూ ఇంటికి ఓ అమ్మాయి వచ్చి హల్‌చల్ చేస్తుంది. రూప, రాజుల ఫస్ట్‌నైట్ గురించి బరితెగిస్తున్నారని మాట్లాడుతుంది. నా కోసం మీరు బాధ పడుతుంటారు. తిండీ తిప్పటు మానేసుంటారు అనుకుంటే మీలో ఒక్కరికి కూడా నేను లేను అనే బాధ కనిపించడం లేదు అని ఎమోషనల్ డ్రామా మొదలు పెడుతుంది. మీ అందర్ని చూశాకా ఎందుకు బతికానా అనిపిస్తుంది. మీరందరూ నన్ను మోసం చేశారు అని ఏడుస్తుంది.
రూపతో ఏమే నీ రూపంతో నా రాజుని మాయచేస్తావా అని అంటుంది. దీపక్ తల్లితో ఇదే మనకు మంచి అవకాశం దీన్ని మనం వదులుకోకూడదు అని అంటుంది. విజయాంబిక వెళ్లి ఎవరే నువ్వు మా రూప చనిపోయింది.. ఇక్కడున్నది రుక్మిణి రాజు భర్త కూడా మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్లిపో అంటుంది. దాంతో రూపగా వచ్చిన అమ్మాయి విజయాంబికను లాగి పెట్టి కొడుతుంది. చంపేస్తా.. మా అమ్మానాన్నని దాని అమ్మానాన్న అనడానికి నువ్వు ఎవరు. నా భర్తని తన భర్త అంటున్నావ్. నా కొడుకుని తన కొడుకు అని అంటున్నావ్.. నా ఇంట్లో ఉంటాను అంటే సరే నా రాజుతో ఉంటాను అంటే మాత్రం ఒప్పుకోను అర్థమవుతుందా అత్త అని అంటుంది. అందరూ కొత్తగా వచ్చిన మాటలకు కలిపే వరసలకు షాక్ అయి చూస్తారు.
విజయాంబిక ఆ అమ్మాయిని బయటకు వెళ్లిపోమని అంటే ఇక్కడున్న అందరూ నా వాళ్ల నేను ఎక్కడికి వెళ్లిపోతాను అంటుంది. దాంతో విజయాంబిక నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటుంది. మీ నాన్నకి ఇష్టమైన స్వీట్ ఏది అని అడుగుతుంది. నేను చేసే చక్రపొంగలి అని ఆ అమ్మాయి చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మీ నాన్నకి నచ్చని రంగు అంటే నాకు ఇష్టమైన పింక్ అని చెప్తుంది. నీకు ఇష్టమైన దేవుడు అనగానే సాయి బాబా అంటుంది. అందరూ బిత్తరపోతారు. ఇంకా ఏమైనా అడగాలి అనుకుంటున్నారా. నేను రాజు ప్రేమించుకున్నాం.. అమ్మే నాకు రాజుకి పెళ్లి చేసింది.. అది నచ్చకనాన్న మమల్ని అంగీకరించలేదు తర్వాత అర్థం చేసుకున్నారు అని మొత్తం చెప్తుంది. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు మందారానికి జరిగిన గొడవతో రాజు వదిలేసి వెళ్లిపోయాడని బిడ్డ చనిపోయాడు అని నేను విదేశాలకు వెళ్లిపోయా ఇలా మొత్తం స్టోరీ చెప్తుంది. అందరూ ఆలోచనలో పడతారు.
రుక్మిణినే రూప అని నిజం తెలిసిన రాజు, విరూపాక్షి, మందారం బిత్తర పోయి ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఉంటారు. నీళ్లలో కొట్టుకు పోయిన తర్వాత తన ముఖం గుర్తు పట్టలేనట్టు మారిపోతే సర్జరీ చేసి ఈ రూపంలోకి తీసుకొచ్చారని చెప్తుంది. హాస్పిటల్‌కి కూడా రండి అని చెప్తుంది. నేను ఉండేదాన్ని అనే ఆలోచన కూడా లేకుండా మీరంతా హ్యాపీగా ఉన్నారని అంటుంది. ఏంటి రాజు శోభనానికి రెడీ అయిపోయావ్.. నాకు ప్రేమికుడు అయినా రక్షకుడు అయినా నువ్వే అన్నావ్ మరి ఇదేంటి అని కాలర్ పట్టుకొని నిలదీస్తుంది. ఇది అసలు ఎవరు అని ఆ అమ్మాయి అడిగితే తను నీ చెల్లి రుక్మిణి అని సుమ చెప్తుంది. మీ ఇద్దరూ కవల పిల్లలు రూప అని సుమ అంటుంది. బంటీకి నేను ఉన్నాను.. రాజుకి నేను ఉన్నాను అంటుంది.
విజయాంబిక రాజు, రుక్మిణిలకు పెళ్లి అయింది వాళ్లకి జరగాల్సిన తంతు జరగాలి అంటుంది. దాంతో ఆ అమ్మాయి మీరు మీ లిమిట్స్‌లో ఉండండి. మా నాన్న మిమల్ని గెంటేస్తే నేను పోనిలే అని ఉండనిచ్చా నా విషయంలో దూరితే బాగోదు చెప్తున్నా అని అంటుంది. నా భర్తకి మరో అమ్మాయిని దగ్గర చేసి ఈ ఇంట్లో నీ కన్న కూతురికి అన్యాయం చేస్తావా నాన్న అని కన్నీరు పెట్టుకొని ఏడుస్తుంది. దాంతో సూర్యప్రతాప్ రుక్మిణి వైపు చూసి కొత్తగా వచ్చిన అమ్మాయిని చూస్తాడు. అమ్మా రుక్మిణి నీ విషయంలో నేను తొందరపడ్డాను అని అంటాడు. రూప, రాజు, విరూపాక్షిలు షాక్ అయిపోతారు. నా మనసుకి ఎందుకో నా కూతురు బతికే ఉందని అనిపిస్తుంది.. ఏం చేయాలో తెలియని డౌట్‌లో ఉన్నాను ఈ అమ్మాయి మాటలు వింటుంటే రూపలా అనిపిస్తుంది. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. అప్పటి వరకు నువ్వు రాజుకి దూరంగా ఉండు అని సూర్యప్రతాప్ చెప్తాడు. రాజు, రూపలు షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















