Illu Illalu Pillalu Serial Today August 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్: వల్లికి కౌంట్‌డౌన్ స్టార్ట్.. నర్మద చిటికెల్ వేసేసిందోచ్..ప్రేమ టార్చర్ షురూ!
Illu Illalu Pillalu Today Episode August 1st సాగర్ నర్మదని కూల్ చేయడానికి మందార పువ్వుతో ట్రై చేయడం, వల్లిని టెన్షన్ పట్టాలని నర్మద, ప్రేమలు ఉప్మా నాటకం ఆడటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode చందుని సేటు ఇంటి దగ్గర నిలదీయడంతో శ్రీవల్లిని లాక్కెళ్తూ మీ ఇంటి దగ్గర తేల్చుకుందా పద అని తీసుకెళ్తాడు. బండి ఎక్కడమని చందు అంటుంటే శ్రీవల్లి బతిమాలుతుంటుంది. ఇంతలో నర్మద ఎదురుగా నిల్చొనే సరికి వల్లీ వణికి పోతుంది.
నీకు పిచ్చా అక్కా.. వల్లికి షాక్..
నర్మద చందుతో బావగారు ఏంటి సమస్య అని అడుగుతుంది. మా విషయాలు మేం చూసుకుంటాం నీకు ఎందుకు అని వల్లీ అంటుంది. దాంతో నర్మద బావగారు ఉదయం నుంచి టెన్షన్ పడుతున్నారు.. సమస్య ఏంటో తెలిస్తే అందరూ పరిష్కరించుకోవచ్చు కదా అని అంటుంది. దానికి వల్లీ వణికిపోతూ మా మొగుడు పెళ్లాల విషయంలో నువ్వు ఎందుకు పానకంలో పుడకలా దూరుతున్నావ్ అని వల్లి అంటుంది. నీకు పిచ్చా అక్కా.. మన ఇంటి మనిషి టెన్షన్ పడుతుంటే ఎలా పట్టించుకోకుండా ఉండగలం అని నర్మద అంటుంది. నువ్వేం మా మధ్య రానక్కర్లేదు.. మీ మొగుడు పెళ్లాల మధ్య మేం దూరడం లేదు కదా నువ్వు మా మధ్యలోకి రాకు అంటుంది.
బా.. నాకు టైం ఇవ్వు..
వల్లీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ అని చందు అడిగితే వల్లీ చందుని పక్కకి తీసుకెళ్లి నర్మదకి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మనం దాని ఎదురుగా టెన్షన్ పడినా.. గొడవ పడినా తనకు అనుమానం ఇంకా పెరిగిపోతుంది.. అందుకే బా తన ముందు ఏం మాట్లాడొద్దు.. నాకు రేపటి వరకు టైం ఇవ్వు బా.. నేను మా నాన్నతో మాట్లాడి డబ్బు వచ్చేలా చేస్తా ఈ ఒక్క సారికి నన్ను నమ్ము బా.. రేపటికల్లా డబ్బు వచ్చేలా నేను చేస్తా ప్లీజ్ బా అని అంటుంది. రేపటికల్లా డబ్బు రాకపోతే అప్పుడు చెప్తా అని చందు వెళ్లిపోతాడు.
నీ కౌంట్ డౌన్ స్టార్ట్..
నర్మదతో వల్లి నీ పరిధిలో నువ్వు ఉండు.. మా విషయాల్లో జోక్యం చేసుకుంటే బాగోదు.. ఇది బెదిరింపు అనుకో వార్నింగ్ అనుకో అని వల్లి అంటుంది. దాంతో నర్మద నా తోడికోడలు సమస్యలో ఉందేమో సాయం చేద్దామని అడిగాను. కానీ నువ్వు నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా చాలా ఎక్స్ ట్రా చేస్తున్నావ్. ఈ క్షణం నుంచి నీకు కౌంట్ డౌన్ మొదలైంది. ఉదయం అతను ఎందుకు వచ్చారో.. బావ కాలర్ ఎందుకు పట్టుకున్నాడో.. బావని నువ్వెందుకు బ్రతిమిలాడుతున్నావో మొత్తం బయటకు లాగుతా. అంతేకాదు.. మీ కుటుంబం గురించి మీ అమ్మనాన్నల గురించి మొత్తం తెలుసుకుంటాను.. ఎక్కడ ఆపానో అక్కడే మొదలుపెడతా.. ఈ లెక్కలన్నింటితో పాటు.. నీ లెక్కలన్నీ తేల్చుతా.. నాటకాలు ఆడి మామయ్య దగ్గర తాళాలు తీసుకొని నీకు పెత్తనం వచ్చిందని ఎగిరెగిరి పడుతున్నావ్ కదా.. నీ టైం అయిపోయింది.. ఇక నుంచి ప్రతీ క్షణం భయపడుతూ బతుకు.. ఇది బెదిరింపు కాదు నేను చేయబోయేది. అంటూ నర్మద చిటెకలు వేసి తోడికోడల్ని వణికించేస్తుంది.
ఆపవే నీ టార్చర్..
ధీరజ్ పడుకొని ఉంటే ప్రేమ గది మొత్తం ధూపం వేసి గంట కొట్టి ధీరజ్‌ని లేపేస్తుంది. ఏంటి ఈ పొగ అంటూ ధీరజ్ అనుకుంటాడు. తీరా చూసే సరికి ప్రేమ గోడ మీద ధీరజ్ ఫొటో పెట్టి చుట్టూ క్షుద్రపూజలు చేసినట్లు ముగ్గు వేసి పూజ చేస్తుంది. ధీరజ్ చూసి బిత్తరపోతాడు. ఏంటే ఇదంతా అంటే నువ్వు నాకు అన్నీ పనులు చేస్తానన్నావు కదా అందుకే పూజ చేస్తున్నా అంటుంది. ఇక కాఫీ చేసి ఇవ్వమని ధీరజ్‌ని అడుగుతుంది. నేను ఇవ్వును అంటే నన్ను చూసుకోవడం నీ బాధ్యత అన్నావు కదా తీసుకురా అంటుంది. ఇదేం టార్చర్‌రా బాబు అనుకుంటూ ధీరజ్ కుస్తీలు పడి కాఫీ ఇస్తాడు. తర్వాత ప్రేమ టిఫెన్ తీసుకురమ్మని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటల్ పేరు చెప్తుంది. చాలా దూరం కదే బైక్ కూడా లేదు అని ధీరజ్ అంటే సైకిల్ తొక్కుతావో.. పరుగెడతావోనీ ఇష్టం వెళ్లు అంటుంది. ధీరజ్ వెళ్లను అంటే బాధ్యత అనే ఓ పేపర్ చూపిస్తుంది. దాంతో ధీరజ్ వెళ్లి నానా తిప్పలు పడి తీసుకొస్తాడు. ప్రేమ తింటుంటే కరువు ప్రాంతంలో వచ్చిన దానిలా ఎలా తింటున్నావే అనుకుంటాడు. అంత దూరం సైకిల్ తొక్కుంటూ తీసుకొచ్చానే కనీసం తింటావా అని అడగవా అంటే వస్తువులు అడగవు అంటుంది. ఓసేయ్ టార్చర్ ఆపవే అని పడిపోతాడు. బట్టలు ఇస్త్రీ చేయించడం ఇలా అన్ని పనులు చేయిస్తుంది.
ఫోన్ విసిరికొట్టిన నర్మద..
సాగర్ నర్మద కోసం ఓ మందార పువ్వు తీసుకొచ్చి జాబిలమ్మ నీకు అంత కోపమా అనే సాంగ్ వేసుకుంటూ నర్మదని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. నర్మద నవ్వుతూ పువ్వు తీసుకొని నలిపి పడేస్తుంది. నర్మద అద్దం దగ్గర నుంచి కోపంగా చూస్తుంది. ఆ చూపునకు సాగర్ అమ్మో అనుకుంటాడు. ఇక నర్మద చుట్టూ తిరుగుతూ బిస్కెట్లు వేస్తాడు. నీ అందం చందమామ అసూయ పడేలా ఎంత అందంగా ఉందో అని ఫోన్లో సెల్ఫీలు తీస్తాడు. నర్మద నవ్వి ఒకసారి ఫోన్ ఇవ్వవా అని కింద విసిరికొడుతుంది. నా ఫోన్ అని సాగర్ గుండె పట్టుకుంటాడు. నర్మద కోపంగా చూసి వెళ్లిపోతుంది.
ఉప్మా ప్లాన్ వర్కౌట్ అవుతుందా..
శ్రీవల్లి పది లక్షలు తన ప్రాణాల మీదకు తీసుకొచ్చిందని నర్మద, ప్రేమలు తన ఫ్యామిలీ గురించి తెలుసుకునే వరకు వదిలేలా లేరని చాలా టెన్షన్ పడుతుంది. ఇక నర్మద, ప్రేమలు ఉప్మా వండి అది వల్లి తినేలా చేసి తన కోసం వాళ్ల అమ్మానాన్నలు వస్తే వాళ్లని ఫాలో అవ్వాలి అనుకుంటారు. ఇక కావాలనే వల్లి ముందుకు వెళ్లి జీడిపప్పూ ఉప్మా సూపర్ మొత్తం తినేద్దాం అని వల్లి నోరూరిస్తారు. దాంతో వల్లీ ఆ ప్లేట్ తీసుకొని ఇదేమైనా మీ పుట్టిళ్లా ఇష్టం వచ్చినట్లు చేసుకోవాడినికి.. ఇక్కడ ఏమైనా నా ఇష్ట ప్రకారమే జరగాలి నేనే తింటాను అని మొత్తం లాగించేస్తుంది. నర్మద, ప్రేమలు తమ ప్లాన్ సక్సెస్ అనుకుంటారు. ఉప్మా సూపర్ ఎవరు చేశారో కానీ పని మనిషిగా మీకు మంచి భవిష్యత్ ఉంది అంటుంది. ప్రేమ నర్మదతో అక్క వల్లి అక్క ఉంటుంది అంటావా పోతుంది అంటావా అని అంటుంది. వల్లి అక్క బతకడం కష్టమే ప్రేమ ఈ పాటికి పైకి టికెట్ ఫిక్స్ అంటుంది. వల్లీ ఏంటి నేను పైకి వెళ్లిపోవడం ఏంటి అని నోరెళ్ల బెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















