Chinni Serial Today April 7th: చిన్ని సీరియల్: ఒకే గదిలో కావేరి, రాజులు.. తనతో సారీ చెప్పించుకున్న రాజుని నాగవల్లి ఏం చేయనుంది?
Chinni Today Episode కావేరి అన్న ఫ్యామిలీని తీసుకొని షాపింగ్‌కి వెళ్లడం రాజుని చిన్ని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజు చిన్నికి గిఫ్ట్‌గా ఓ బంగారం చైన్ కొంటాడు. చిన్నికి ఎప్పుడో ఇవ్వాల్సింది కానీ ఇవ్వలేకపోయానురా. ఏసీపీ చిన్నికి చైన్ గిఫ్ట్‌గా ఇస్తుంటే చాలా ఫీలయ్యానురా అని అంటాడు. ఇంతలో పార్కింగ్ దగ్గర బైక్ మీద కూర్చొన్న బాలరాజుని నాగవల్లి కారు రివర్స్ చేస్తూ గుద్దేస్తుంది.
బాలరాజు, నాగవల్లిల గొడవ..
నాగవల్లి రాజుని చూసి నిన్ను ఎక్కడో చూశానని అని చిన్నికి తనకు గొడవ అయినప్పుడు రాజు వచ్చి తనతో గొడవ పడటం గుర్తు చేసుకుంటుంది. కారు బైక్‌కి ఢీ కొట్టినందుకు డబ్బు ముఖాన విసిరేస్తా అంటుంది. దానికి రాజు నేను నీ కారు అద్దాలు పగలగొట్టి డబ్బు ముఖాన విసరనా అని అడుగుతాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరుగుతుంది. దాంతో రాజు నాగవల్లితో ఎక్ట్రాలు చేస్తే కారుని నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను అని తాళాలు తీసుకుంటాడు. నాగవల్లి ఫ్రెండ్ నాగవల్లికి సర్దిచెప్పి సెటిల్ చేసుకొని వెళ్లిపోదాం అంటుంది. దాంతో నాగవల్లి డబ్బు తీసి బాలరాజుకి ఇస్తుంది. సారీ కూడా చెప్తేనే కీస్ ఇస్తానని రాజు అనడంతో వల్లి రాజుకి సారీ చెప్తుంది. నిన్ను వదిలిపెట్టను అని వెళ్లిపోతుంది.
కావేరితో ఫ్యామిలీ షాపింగ్..
సత్యం బాబు తన ఫ్యామిలీ మొత్తంతో పాటు కావేరిని కూడా తీసుకొని షాపింగ్‌కి వెళ్తాడు. పిల్లలు ఎగ్జిబిషన్‌కి కూడా వెళ్దామని అంటారు. అందరూ సరదాగా ఆటోలో వెళ్తుంటారు. అందరూ మాల్‌లోకి వెళ్తారు. చిన్ని నాన్న ఎక్కడ ఉన్నారు అని అనుకుంటుంది. రాజు కోసం మొత్తం చూస్తుంది. రాజు కూడా మాల్‌లోనే ఉంటాడు. రాజు వాళ్లని చూసి దాక్కుంటాడు. చిన్న, చందులు చూసి రాజుని తమకు ఫాలో అవ్వమని అంటాడు. పిల్లల్ని ఒక వైపు పంపి కావేరి, సరళలు చీరలు చూస్తారు. కావేరి సరళకు చీరలు సెలక్ట్ చేసుకోమని డ్రస్‌లు తీసుకుంటా అని వెళ్తుంది.
నాన్న నేనే సెలక్ట్ చేస్తా..
చిన్ని రాజుని కలుస్తుంది. రాజు చిన్నితో నీకు ఓ గిఫ్ట్ తీసుకొచ్చా అంటే తర్వాత గిఫ్ట్ ఇద్దువులే కానీ ముందు నేను నీ కోసం ఒక డ్రస్ సెలక్ట్ చేస్తా ఎవరూ చూడకుండా నువ్వు టైల్ వేసుకో అని అంటుంది. మామయ్య, అమ్మ చూడకుండా రాజు కోసం షాపింగ్ చేయడానికి వెళ్తుంది. నాగవల్లి తన ఫ్రెండ్‌తో అదే మాల్‌లో ఉంటుంది. చిన్ని డ్రస్ సెలక్ట్ చేసి రాజుకి ఇస్తుంది. నాగవల్లి ఇద్దరినీ చూసి నా శత్రువులు ఇక్కడే ఉన్నారు వీళ్లిద్దరి పని చెప్పాలి అనుకుంటుంది. రాజు ట్రయల్ రూమ్‌కి వెళ్తాడు.
ట్రయల్ రూమ్‌లో రాజు, కావేరిలు..
ఉష అలియాస్ కావేరి డ్రస్‌లు తీసుకొని ట్రయల్ రూమ్‌కి వెళ్తుంది. రాజు కూడా చిన్ని ఇచ్చిన బట్టలు తీసుకొని వెళ్తాడు. కావేరి ఉన్న గది డోర్ తోస్తాడు. దాంతో వెళ్లి కావేరి మీద పడిపోతాడు. కావేరి రాజుతో ఏంటి అలా చూస్తున్నావ్ అని అడుగుతుంది. మీరు అలా చూస్తున్నారు కాబట్టే నేను ఇలా చూస్తున్నాను అంటాడు. ఏడ్చావులే అని తిడుతుంది. రాజు బయటకు వెళ్తూ సత్యంబాబుని చూసి ఇద్దరినీ చూశాడంటే కొంప మునుగుతుందని మళ్లీ లోపలికి వెళ్లి డోర్ వేస్తాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా అని బయటకు వెళ్తుంది. సత్యం బాబు దగ్గరే సరళని చూసి మనసులో వదినన మా ఇద్దరినీ చూస్తే అంతే సంగతి అని మళ్లీ లోపలికి వెళ్లి డోర్ వేస్తుంది. ఇద్దరూ గదిలో ఒకర్ని ఒకరు మాటలు అనుకుంటారు. మీరు దగ్గరకు రాగానే మంచి గుమగుమలు వస్తున్నాయ్ ఏం సెంట్ వాడుతారని అడుగుతుంది. మీరు కోపంలో కూడా అందంగా లేరు అని అంటాడు. అన్నావదినలు వెళ్లిపోవడంతో కావేరి రాజుని బయటకు తోసేస్తుంది.
చిన్ని కోసం రాజు సెలక్షన్..
రాజు చిన్ని దగ్గరకు వచ్చి డ్రస్ చాలా బాగుందని అంటాడు. తర్వాత తన కోసం చిన్ని సెలక్ట్ చేయమని అంటుంది. రాజు ఓ మంచి లంగాజాకెట్ సెలక్ట్ చేస్తాడు. సత్యంబాబుని చూసి రాజు వాళ్లు దాక్కుంటారు. కావేరి కూడా చూసి సెలక్షన్ బాగుంది అనుకుంటుంది. సత్యం బాబు ఓ చీర చూసి కావేరికి తీసుకోమంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















