Brahmamudi January 1st Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్య ఫ్యామిలీని బండబూతులు తిట్టిన ధాన్యలక్ష్మీ - కొత్తజంట మధ్య మొదలైన రగడ
Brahmamudi Serial Today Episode: కొత్తజంటకు హారతి ఇచ్చే విషయంలో కావ్యను అవమానిస్తాడు సుబ్రమణ్యం. దీంతో కళ్యాణ్, అనామికల మధ్య గొడవ జరగుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Telugu Serial Today Episode: కళ్యాణ్, అనామికల పెళ్లిలో తన తల్లిదండ్రులకు అవమానం జరగడం కావ్య తట్టుకోలేకపోతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు ఇలా మనసు కష్టపెట్టుకొని పెళ్లి వేడుక నుంచి వెళ్లిపోవడం తనకు బాధను కలిగిస్తోందని అంటుంది కావ్య.
కనకం: నా వల్ల నీకు అవమానం జరిగింది. అది తమను బాధపెట్టింది ఇక నుంచి నీ కాపురం సంగతి మాత్రమే చూసుకో. మమ్మల్ని వదిలేయ్. నా దరిద్రం మీకు అంటకూడదు
అంటూ కన్నీళ్లతో కావ్యకు వీడ్కోలు చెప్పి పెళ్లి వేడుక నుంచి కనకం, కృష్ణమూర్తి, అప్పు వెళ్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యలక్ష్మి కనకం, కృష్ణమూర్తిలపై ఫైర్ అవుతుంది.
ధాన్యలక్ష్మీ: ఇప్పటివరకు మా పక్కనే ఉంటూ మమ్మల్ని నమ్మించి అవకాశం దొరికితే నీ కూతురిని నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. మీ అందరి అసలు స్వరూపం బయటపడింది. ఇంక మిమ్మల్ని మా ఇంట్లో వాళ్లు బంధువులుగా గుర్తించరు. మిమ్మల్ని ఏ వేడుకకు పిలవరు. మీరు మళ్లీ మా గడప తొక్కడానికి వీలులేదు.
అంటూ వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మీ. చిన్నత్తయ్య అంటూ ధాన్యలక్ష్మికి కావ్య సర్ధిచెప్పబోతుంటే..అలా పిలిచే అర్హత నీకు లేదని కావ్యపై కోప్పడుతుంది ధాన్యలక్ష్మి. ఇందులో కావ్య తప్పు లేదని కనకం, అప్పు ధాన్యలక్ష్మితో అంటారు. మా అందరిని అనండి. కానీ మా అక్కను మాత్రం నమ్మండి అంటూ చేతులు జోడించి ధాన్యలక్ష్మిని వేడుకుంటుంది అప్పు. మాది మోసం స్వార్థం కావచ్చు కానీ ఇందులో కావ్య మాత్రం నిరపరాధి అని కృష్ణమూర్తి అంటాడు. అందరూ కలిసి చేసిన కుట్ర అని అర్థమైంది. కళ్యాణ్ మీతో మాట్లాడాలని ప్రయత్నించిన అతడితో మీరు మాట్లాడొద్దని, మీ హద్దుల్లో మీరు ఉండాలని, ముఖ్యంగా మీ చిన్న కూతురుకు చెప్పండని కృష్ణమూర్తి, కనకంలకు ధాన్యలక్ష్మీ వార్నింగ్ ఇస్తుంది. కొత్తగా పెళ్లైనా కళ్యాణ్, అనామికలకు హారతి ఇవ్వమని కావ్యకు చెప్తుంది ఇందిరాదేవి. అనామిక ఫ్యామిలీ అందుకు ఒప్పుకోరు. నా కూతురు పెళ్లిని చెడగొట్టడానికి కావ్య ప్రయత్నించిందని..అలాంటి తనతో నా కూతురికి హారతి ఇప్పిస్తారా...అంటూ అనామిక తండ్రి కావ్య మనసును బాధపెట్టాలని చూస్తాడు.
అనామిక కూడా తన తండ్రి మాటలను సమర్థిస్తుంది.
అనామిక: కావ్య ఎలాంటిదో మన పెళ్లిలోనే అర్థం చేసుకున్నాను. తను మంచిది అన్నట్లు మనల్ని నమ్మించి మోసం చేయాలనుకుంది. తన చెల్లిలి కోసం సాటి ఆడపిల్ల పెళ్లి ఆగిపోయేలా చేయాలనుకుంది. కొత్తగా పెళ్లైన దంపతులు ఆత్తగారింట్లో అడుగుపెట్టేటప్పుడు మంచి మనసుతో హారితి ఇచ్చే వాళ్లు ఎదురు రావాలి. అంత మంచి మనసు కావ్యకే ఉంటే నా పెళ్లి ఎందుకు ఆపాలనుకుంది.?
ఆ గొడవ అక్కడే వదిలేయమని చెప్పానుగా...పుట్టింటి సారే మోసుకొచ్చినట్లు ఇక్కడి వరకు ఎందుకు తీసుకొచ్చావని అనామికకు క్లాస్ ఇస్తుంది ఇందిరాదేవి. కానీ అనామికకు సపోర్ట్‌గా రుద్రాణి, అపర్ణ రంగంలోకి దిగుతారు. కళ్యాణ్ పెళ్లిని ఆపేందుకు అప్పు చేసిన కుట్రలో కావ్యకు పాత్ర ఉందని తెలిసిన తర్వాత కూడా ఆమెకు గౌరవం ఇవ్వాలా అంటూ ధాన్యలక్ష్మి కూడా కావ్యనే తప్పు పడుతుంది. ఇక వదిన చేత హారతి తీసుకోకపోతే తను తప్పు చేసినట్లు అవుతుంది. అది నాకు ఇష్టం లేదని కళ్యాణ్ అంటాడు. వదిన వల్లే నేను అనామిక కలిశాం. వదిన వల్లే మా పెళ్లి జరిగింది. వదిన హారతి ఇస్తేనే నేను లోపలికి వస్తానని కళ్యాణ్ అంటాడు.
అనామిక: అదే నీ నిర్ణయమైతే నేను అసలు అత్తింట్లో అడుగుపెట్టను. ఇక్కడి నుంచి ఇటే పుట్టింటికి వెళ్లిపోతాను
కావ్య: ఇలాంటి విషయాల్లో పట్టుదలకుపోవద్దు కవిగారు. అనామికకు ఇష్టంలేని పని చేయోద్దు. హారతి ఎవరు ఇస్తే ఏంటి
రాజ్: కళ్యాణ్, అనామిక పెళ్లి కావ్య సంకల్పం వల్లే జరిగింది. ఈరోజు మీ కూతురు మా ఇంట్లో కోడలిగా అడుగుపెడుతుందంటే అది కావ్య వల్లే అది మీరు మీ అమ్మాయి గుర్తిస్తే మంచిది సుబ్రమణ్యంగారు.
అని రాజ్ చెప్పగానే.. రాజ్‌కు ఎదురుతిరిగితే అతడు ఇస్తానని చెప్పిన రెండు కోట్లు ఇవ్వడని అనామిక తండ్రి సుబ్రమణ్యం భయపడతాడు.
సుబ్రమణ్యం: అనామిక ఇప్పుడేం గొడవ చేయోద్దు. రాజ్ మనకు హెల్ప్ చేస్తున్నాడు. తన భార్యని ఇన్‌సల్ట్ చేశామని ఆ డబ్బు ఇవ్వకపోతే రోడ్డున పడతాం. సైలెంట్‌గా ఉండు.
అంటూ రాజ్ ను చూస్తూ మీరు చెప్పిన తర్వాతే కావ్య గొప్పతనం గురించి తెలిసిందని, కావ్య హారతి ఇవ్వాలని నాటకం ఆడుతాడు సుబ్రమణ్యం. కావ్య హారతి తీసుకొచ్చి కొత్తజంటకు ఇస్తుంది. తర్వాత కళ్యాణ్ కూడా కావ్యకు సపోర్ట్ చేయడం అనామిక సహించలేకపోతుంది. కావ్యతో గొడవలు పడకుండా ఆమెపై ప్రేమ ఉన్నట్లుగా నటించమని ఆమె తల్లిదండ్రులు చెబుతారు. ఆమె తప్పులను టైమ్ చూసి బయటపెట్టి కళ్యాణ్‌ను నీ కంట్రోల్‌లోకి తెచ్చుకోమని సలహా ఇస్తారు. తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని అనామిక ఫిక్సవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.