అన్వేషించండి

Brahmamudi Serial Today March 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : జైలుకెళ్లిన అనామిక – ఇంటికెళ్లిన రాజ్‌ – బాంబు పేల్చిన రుద్రాణి

Brahmamudi Today Episode: ఈ సమస్య తీరిందని సంతోషం ఎందుకు రేపు ఇంతకన్నా పెద్ద సమస్య రావొచ్చు కదా అంటూ రుద్రాణి బాంబు పేల్చడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.      

Brahmamudi Serial Today Episode:  సామంత్‌, అనామిక మధ్య గొడవ జరగడంతో తానే రాడ్‌ తో సామంత్‌ను చంపినట్టు తర్వాత శవాన్ని రాజ్‌ కారులో పెట్టినట్టు ఒప్పుకుంటుంది అనామిక. దీంతో అందరూ షాక్‌ అవుతారు. జడ్జి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తల వంచుకుంటారు.

రాజ్‌ లాయర్‌: యువరానర్‌ హత్య అనామిక చేసి ఆ నేరం రాజ్‌ మీదకు నెట్టడానికి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని ఫ్యాక్టరీలో వేయించింది. శవాన్ని రాజ్‌ కారులో పెట్టించింది. మళ్లీ ఏమీ ఎరగనట్టు సామంత్‌ మిస్సయ్యాడు అని కేసు పెట్టి.. సెర్చ్‌ చేయించింది యువరానర్‌. మొదటి భర్తను వేధించిన ఈమె సామంత్ ను కూడా హత్య చేసింది యువరానర్‌.. ఇలాంటి వ్యక్తి బయటి ప్రపంచంలో ఉండకూడదు ఈమెకు కఠిన కారాగారా శిక్ష వేయాలని కోరుతున్నాను.

జడ్జి: కేసు పూర్తి వివరాలు తెలుసుకన్న తర్వాత అనామికే ఈ హత్య చేసిందని కోర్టు నిర్దారించడమైంది.  హత్య చేయడమే కాకుండా ఒక నిరపరాధి మీదకు ఈ కేసును మళ్లించినందుకు కోర్టును, పోలీసులను పక్కదారి పట్టించినందుకు అనామికకు 14 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అలాగే రాజ్‌ను ఈ కోర్టు నిరపరాధిగా విడుదల చేయడమైనది.

అంటూ జడ్జి తీర్పు ఇవ్వగానే.. అపర్ణ, కావ్య, అప్పు, సుభాష్‌, కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతారు. అందరూ కలిసి కోర్టు బయటకు వెళ్తారు. బయట రాజ్‌ను చూసిన అపర్ణ ఎమోషనల్‌గా ఏడుస్తుంది.

రాజ్: మమ్మీ ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు..నాకు శిక్ష పడలేదు కదా..?

అపర్ణ: నిన్ను అరెస్ట్‌ చేసి ఈ రెండు రోజులు స్టేషన్‌కు కోర్టుకు తిప్పుతుంటే.. అదే పెద్ద శిక్షలా అనిపించింది తెలుసా..? ఎంతో మందికి అన్నం పెట్టిన చేతులు ఇవి. నేరానికి అర్థం కూడా తెలియని నీ మీద ఆ అనామికకు అసలు కేసు ఎలా  పెట్టాలనిపించిందిరా..?

సుభాష్‌: హత్య తనే చూసి దాన్ని మన రాజ్‌ మీదకు తోసేయాలని చూసినందుకే కదా కోర్టు శిక్ష వేసింది.

అపర్ణ: చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అంటారు. కళ్లు నెత్తికెక్కి.. ఒళ్లు కొవ్వెక్కి.. నేరం చేసి ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తుంది ఆ పాపత్మురాలు.

కళ్యాణ్‌:  కంగ్రాట్స్‌ అన్నయ్యా..

రాజ్‌: అవన్నీ అప్పుకు కళావతికి చెప్పాలి నాకోసం చాలా కష్టపడ్డారు

అని రాజ్‌ చెప్పగానే అందరూ కలిసి అప్పు, కావ్యను మెచ్చుకుంటారు. పోలీసులు అనామికను తీసుకెళ్తుంటే సుభాష్‌ ఆపి తిడతాడు. నిన్నే చెప్పాను కదా నా కొడుకు గర్వంగా బయటకు వస్తాడని అంటాడు. దీంతో అనామిక కోపంగా అందరినీ తిడుతుంది.

అనామిక: మీరు విజయ గర్వంతో మాట్లాడుతున్నారని తెలుసు కానీ..

రాజ్‌: అరెస్ట్‌ అయిన వాళ్లు ఎక్కువ మాట్లాడితే శిక్ష ఎక్కువ అవుతుంది అనామిక ఇది నా టైం

అపర్ణ: నువ్వు ఎవరి పెంపకంలో పెరిగావో కానీ నీ ముఖంలో కుళ్లు కుతంత్రాలు తాండవిస్తున్నాయి. ముందు అవి తగ్గించుకో

సుభాష్‌: 14 సంవత్పరాలు జైళ్లో ఉంటుందిగా అన్ని తగ్గించుకుని మార్పు చెందిన మనిషిలా మళ్లీ వస్తుందిలే

కళ్యాణ్‌: డబ్బు డబ్బు అంటూ వాటి వెంట పడ్డావు అవి నీ వెంట రాలేదు. పగ పగ అంటూ వాటి వెంట పడ్డావు చివరికి అవి నిన్ను ఒంటరిదాన్ని చేసేశాయి. కనీసం ఇప్పటికైనా మనిషిలా మారు

కావ్య: ఆలస్యం అవుతున్నట్టుంది. అక్కడ నీకోసం జైలు ఎదురుచూస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వెళ్లు..

అనామిక: వెళ్తాను.. కానీ అక్కడే ఉండను. పద్నాలుగేల్లు జైళ్లో ఉండటానికి నేను అనామకురాలిని కాదు.. అనామికను నేను అనుభవించిన దానికి అంతకు అంత మీరందరూ అనుభవించేలా చేస్తాను.

అప్పు: పాపం జైళ్లుకు వెళ్తున్నానన్న బాధలో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. తీసుకెళ్లండి.

అంటూ కోపంగా అప్పు చెప్పగానే అనామికను పోలీసులు జైలుకు తీసుకెళ్తారు. అనామికను తీసుకెళ్లిన తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తుంటే.. కోర్టు ఆవరణలో రాజ్‌కు ఎవరో అమ్మాయి కనబడుతుంది. దీంతో రాజ్‌ కంగారుగా భయంతో ఆ అమ్మాయిని వెతుకుతాడు. కావ్య ఏమైందని అడగ్గానే ఏం లేదు వెళ్దాం పద అంటాడు. అందరూ ఇంటకి వెళ్లాక రాజ్‌కు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తారు. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో రుద్రాణి వెళ్లి మరీ ఇంత సంతోషం పనికిరాదు. రేపు ఏదైనా మరో సమస్య రావొచ్చు అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Kohli World Record: కోహ్లీ న‌యా రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక ప్లేయ‌ర్.. అరుదైన క్ల‌బ్ లో ఎంట్రీ
కోహ్లీ న‌యా రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక ప్లేయ‌ర్.. అరుదైన క్ల‌బ్ లో ఎంట్రీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ind vs NZ Match Highlights | Champions Trophy 2025 లో కివీస్ ను కొట్టేసిన భారత్ | ABP DesamTrump vs Zelensky | రష్యాను రెచ్చగొట్టారు..ఉక్రెయిన్ చేయి వదిలేశారు..పాపంరా రేయ్ | ABP DesamKoganti Sathyam Sensational Comments | రాహుల్ హత్య కేసులో పెద్దిరెడ్డి.? | ABP DesamIndian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీలో జాప్యం, ఎలక్షన్ కోడ్ లేని జిల్లాల్లోనూ నిరాశే
MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం- మొత్తం 6 స్థానాలకు కౌంటింగ్
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Kohli World Record: కోహ్లీ న‌యా రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక ప్లేయ‌ర్.. అరుదైన క్ల‌బ్ లో ఎంట్రీ
కోహ్లీ న‌యా రికార్డు.. ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక ప్లేయ‌ర్.. అరుదైన క్ల‌బ్ లో ఎంట్రీ
Andhra Pradesh: పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
పులివెందుల యువరైతు ఆనందం చూశారా! సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు థ్యాంక్స్ చెబుతూ వీడియో
Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Telugu TV Movies Today: చిరంజీవి ‘అన్నయ్య’, పవన్ ‘తమ్ముడు’ to మహేష్ ‘నిజం’, రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ వరకు - ఈ సోమవారం (మార్చి 3) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘అన్నయ్య’, పవన్ ‘తమ్ముడు’ to మహేష్ ‘నిజం’, రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ వరకు - ఈ సోమవారం (మార్చి 3) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Thandel OTT Release Date: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget