Brahmamudi Serial Today February 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్ : మింగలేక కక్కలేక అన్నట్లుగా రాజ్ పరిస్థితి - తమ నాటకంలో డోస్ పెంచిన కావ్య
Brahmamudi Today Episode: ఇంట్లో ఎప్పటికైనా నేనే కింగ్ మేకర్ ను అవుతానని అందుకోసం కొత్త నాటకం ఆడబోతున్నట్లు అనామిక వాళ్ల అమ్మకు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Brahmamudi Serial Today Episode: గార్డెన్‌లో కావ్య, వాళ్ల బావ మాట్లాడుకోవడం చూసిన రాజ్ కోపంగా గార్డెన్‌లోకి వెళ్లి ఇంత రాత్రి పూట ఇక్కడే చేస్తున్నారని అడుగుతాడు. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం. రెండు చితికిన బతుకుల గురించి, మోడుబారిన జీవితాల గురించి మాట్లడుకుంటున్నాం అని చెప్పగానే సరే కానీ నాకు స్ట్రాంగ్ కాఫీ తీసుకుని రా అని రాజ్, కావ్యకు చెప్పగానే ఈ టైంలో పాలు లేవని కాఫీ పెట్టడం కుదరదని చెప్పి పద బావ మనం వెళ్దాం అని లోపలికి వెళ్తుంది. మరోవైపు అప్పు గ్రౌండ్ లో రన్నింగ్ చేస్తూ ఒక దగ్గర వచ్చి కూర్చుంటుంది. ఇంతలో ఒక రిటైర్డ్ ఎస్సై వచ్చి అప్పుకు ఎస్సై సెలెక్షన్‌కు ఎలా ప్రిపేర్ కావాలి. ఎలా వర్కవుట్ చేయాలి అని సజేషన్స్ ఇస్తాడు. దీంతో అప్పు ఇప్పటి నుంచి మీరే నాకు గురూజి అని చెప్తుంది. మీరు చెప్పినట్లే చేస్తానని అంటుంది అప్పు. మరోవైపు రాజ్ నిద్రలేచి కిందకు వస్తుంటాడు.
రాజ్: ఈ కళావతి ఏది బ్లాక్ కాఫీ తీసుకురాలేదు.
అనుకంటుండగానే కావ్య కాఫీ కప్పుతో పరుగెత్తుకొస్తుంది.
రాజ్: ఏయ్ ఆగు ఏంటా స్పీడు. తొక్కలో కాఫీ ఇవ్వడానికి ఏదో పెళ్లిలో పనిపాటా లేకపోయినా అటు ఇటు తిరుగుతుంటారు కదా అలా వస్తున్నావు. అయినా కాఫీని ఇంత పెద్ద గ్లాసులో తీసుకొచ్చి..
కావ్య: ఇది మీకు కాదు.
రాజ్: మరి ఎవరికి?
కావ్య: మా బావ కూడా మీలాగే పొద్దునే లేచి ఎక్సర్‌సైజులు చేస్తున్నారండి. ఆయన కోసం చేసిన స్పెషల్ కాఫీ.
రాజ్: మరి నాకు
కావ్య: మీరు నిద్ర లేచారన్న సంగతి నాకు ఇప్పుడే కదా తెల్సింది.
అని మీకు మా బావకు పోలికేంటి? మీరు ఈ మధ్యనే వచ్చారు. మా బావ నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము అంటూ కావ్య చెప్పడంతో రాజ్ ఇరిటేట్‌గా ఫీలవుతాడు. మరోవైపు అనామికకు వాళ్ల అమ్మ ఫోన్ చేసి ఇంటి పెత్తనం నీ చేతుల్లోకి తీసుకుంటానన్నావుగా వచ్చిందా? అని అడగ్గానే రాలేదని వచ్చినట్లే వచ్చి ఆ కావ్య చేతిలోకి వెళ్లిందని చెప్తుంది. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది కానీ ప్లాన్ బీ మొదలుపెట్టాను మా ఆయన్ను ఆఫీసుకు పంపిస్తున్నాను అని చెప్తుంది. అనామిక ఫోన్‌లో మాట్లాడటాన్ని రుద్రాణి వింటుంది. నువ్వేదో అమాయకురాలివి అనుకున్నాను నాకన్నా కంత్రి దానివే అని మనసులో అనుకుంటుంది రుద్రాణి. త్వరలోనే నా మొగుణ్ని ఆఫీసులో కింగ్ ను చేస్తాను. ఈ ఇంటిని మొత్తాన్ని నా గుప్పిట్లో పెట్టుకుంటాను అని అనామిక చెప్పడాన్ని రుద్రాణి వింటుంది.
రుద్రాణి: ప్లాన్ అదిరిపోయింది. అనామిక ఆఫీసులో రాజ్ ను తప్పించేంత వరకు నేను నీకు హెల్ఫ్ చేస్తాను. కళ్యాణ్‌కు బాధ్యతలు అప్పగించే టైంలో నా కొడుకును కింగ్ ను చేస్తాను. అప్పుడు కింగ్ మేకర్ ను నేను అవుతాను.
అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. మరోవైపు కావ్య, రాజ్ దగ్గరకు వెళ్లి మీరు నన్ను వదిలేస్తారని తెలిస్తే మా బావ వెంటనే మా అమ్మా నాన్నల దగ్గరకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటా అని అడుగుతాడు. అని చెప్పడంతో..
రాజ్: ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నేను చెప్పే వరకు ఇంట్లో ఎవ్వరికీ చెప్పొద్దు.
కావ్య: కానీ మా బావకు ఒక్కడికే చెప్తాను.
రాజ్: వాడికి మాత్రం అసలు చెప్పొద్దు వాడి వాలకం చూస్తుంటే ఆంజనేయుడి తోకకు నిప్పంటిచినట్టే అందరితో చెప్పేశాలా ఉన్నాడు. చూడు వాడు ఏదేదో చేసి మా నాన్నమ్మను అమెరికా పట్టుకెళ్లేలా ఉన్నాడు.
అని ఇందిరాదేవికి స్పాండిలైటిస్ మసాజ్ చేస్తున్న కావ్య వాళ్ల బావ దగ్గరకు వెళ్లి నువ్వేం చేయొద్దు నేను చేస్తాను అని రాజ్ ఏదో చేయబోతుంటే ఇందిరాదేవి ఏం వద్దని పిచ్చిపిచ్చిగా చేయకు నేను హాస్పిటల్‌కు వెళ్తానని చెప్పడంతో రాజ్ ఏవేవో ఆసనాలు వేసి నడుం పట్టేసిందని లోపలికి వెళ్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: బరాత్‌లో చిందులు వేస్తున్న రాశి ఖన్నా.. పెళ్లి ఎవరిదంటే