అన్వేషించండి

Brahmamudi Serial Today December 10th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:  రుద్రాణికి బుద్ది చెప్పిన రాహుల్‌ – బెడ్‌ రూంలో గీత గీసిన రాజ్‌

Brahmamudi Today Episode:  ఎప్పుడూ ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టడమేనా మమ్మీ అంటూ రాహుల్‌, రుద్రాణిని తిట్టడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Brahmamudi Serial Today Episode:  కిచెన్‌లో పడుకున్న కావ్యను చూసిన అపర్ణ, రాజ్‌ను పిలిచి తిడుతుంది. నీ భార్య ఎక్కడికి వెళ్లింది ఏం చేస్తుంది అని కనీసం ఆరా తీయవా అంటూ ప్రశ్నిస్తుంది. ఎవరైనా చూస్తే ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా..? మీ తాతయ్య నాన్నమ్మ కావ్యకు మాటిచ్చి తీసుకొచ్చారు. నువ్వెంత అవమానించినా.. ఆ పెద్ద వాళ్ల మాట కాదనలేక తిరిగి వచ్చింది అంటూ అపర్ణ తిట్టడంతో రాజ్‌ కోపంగా కావ్యను తిడతాడు.

రాజ్‌: ఏయ్‌ నేను నిన్ను రూంలోకి రావొద్దన్నానా..?

కావ్య: రమ్మని కూడా చెప్పలేదు కదా..?

రాజ్‌: వస్తే వద్దంటానని ఎలా అనుకున్నావు.

కావ్య: రాకపోతే రమ్మంటారని కూడా ఆశపడలేదు.

రాజ్‌: రాకపోతే రమ్మని అనను.. వస్తే పొమ్మని అనను. ఇది తాతయ్య నిర్ణయం కాదని అనలేను.

అపర్ణ: ఒరేయ్‌ ఇలా వంకరటింకరగా మాట్లాడకు నీ గదికి తీసుకెళ్లు

రాజ్‌: ఆవిడ గారు చిన్నపిల్లేం కాదు తనను ఎత్తుకుని తీసుకెళ్లడానికి.. చేయి పట్టి నడిపించుకు వెళ్లడానికి రమ్మను.

అపర్ణ: రమ్మని చెప్పాడు కదా ఇక వెళ్లు..

అని అపర్ణ చెప్పగానే కావ్య రూంలోకి  వెళ్తుంది. రూంలో రాజ్‌ బెడ్‌  మధ్యలో  గీత గీసి రెండ్ ప్లాస్టర్‌ వేస్తాడు. ఏంటని కావ్య అడగ్గానే బెడ్‌ మీద ఆ సగం నీకు ఈ సగం నాకు నా భాగంలోకి నువ్వు రావొద్దు.. నీ సగంలోకి నేను రాను అని చెప్తాడు రాజ్‌.  ప్రపంచంలో  పడకగదిని సగం సగం పంచుకున్న ఘనత మీదే అంటుంది కావ్య. మీ అంతట మీరు పిలిస్తే కానీ  నేను ఈ బెడ్‌ ను ముట్టుకోను అంటూ కావ్య చాలెంజ్‌ చేస్తుంది. రుద్రాణి ఒంటరిగా టెన్షన్‌ పడుతుంద.

రాహుల్‌: ఏంటి మమ్మీ ఇంకా పడుకోలేదా.?

రుద్రాణి: ఈ ఇంట్లో నేను ఎప్పుడు సంతోషంగా పడుకున్నాను.

రాహుల్‌: అవునులే పొద్దున్నే ఎవరినో ఒకరిని టార్చర్‌ చేయాలి కదా..? అయినా తాతయ్య మనకు కూడా ఆస్థిలో వాటా ఇస్తానన్నాడు కదా..? ఇంకా ఆలోచించడం దేనికి మమ్మీ.

రుద్రాణి: మీ తాతయ్య ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. ఆయన బతికి వస్తే ప్లాన్‌ ఏ అమలు చేస్తాను. రాలేదంటే ప్లాన్‌ బీ అమలు చేస్తాను. రేపు చెక్‌ తీసుకుని రాజ్‌ దగ్గరకు వెళ్లి నువ్వు కొత్తగా బిజినెస్‌ చేయాలనకుంటున్నట్టు చెప్పి రెండు కోట్ల రూపాయలు ఇవ్వని అడుగు.

రాహుల్‌: రాజ్‌ నాకు రెండు కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాడు మమ్మీ

రుద్రాణి: ఇవ్వడని నాకు తెలుసు కానీ ఆ ఇవ్వని చెక్‌ తీసుకెళ్లి ధాన్యలక్ష్మీ దగ్గర మంట పెట్టొచ్చు

అంటూ రుద్రాణి తన ప్లాన్‌ మొత్తం రాహుల్‌కు చెప్తుంది. ప్లాన్‌ విన్న రాహుల్‌ నీ బుర్ర మామూలుగా లేదు కదా మమ్మీ అంటాడు. అనుకున్నట్లుగానే రాహుల్‌  మరుసటి రోజు  దగ్గరకు వెళ్లి డైమండ్స్‌ బిజినెస్‌ చేయాలని అందుకోసం రెండు కోట్లు ఇవ్వమని అడుగుతాడు. పక్కనే  ప్రకాష్‌ తిడతాడు. నీకు లక్ష రూపాయలు ఇవ్వడం కూడా దండగే అంటాడు. రాజ్‌ ఇస్తానన్నా నేను ఇవ్వనివ్వను అంటాడు. ఇంతలో రుద్రాణి వచ్చి ప్రకాష్‌ను తిడుతుంది. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడ తేల్చుకుంటానని రాహుల్‌ను తీసుకుని ధాన్యలక్ష్మీ దగ్గరకు వెళ్తుంది రుద్రాణి. డబ్బుల విషయంలో జరిగిన విషయం చెప్పి.. నువ్వే ఎలాగైనా ఆ రెండు కోట్లు ఇప్పించాలని రుద్రాణి, రాహుల్‌ అమాయకంగా నటిస్తారు. ఈ పరిస్థితుల్లో డబ్బులు అడిగితే ఎలా అని ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే.. రాహుల్‌, రుద్రాణి తమ మాటలతో ధాన్యలక్ష్మీని రెచ్చగొడతారు. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Upcoming Telugu Movies: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడాRohit Sharma Champions Trophy 2025 | 9నెలల్లో రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ రోహిత్ శర్మInd vs Nz Champions Trophy 2025 Final | ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా టీమిండియా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Somu Veerraju: బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజు... జగన్ అనుకూలుడు అనే ముద్ర..! బీజేపీ స్టాండ్ క్లియర్
Hyderabad News: హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్‌లో క్రికెట్ ప్రేమికులపై లాఠీఛార్జ్, తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
CM Revanth Reddy: SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
SLBC టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత, రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Upcoming Telugu Movies: క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
క్రైమ్ థ్రిల్లర్స్ నుంచి లవ్, కోర్ట్ డ్రామా వరకూ.. ఈ వారం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే మూవీస్, సిరీస్‌లు ఇవే!
Rohit Sharma Latest News: మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
మా గురించి దుష్ప్రచారం చేయొద్దు, ఫైనల్ అనంతరం రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
TDP MLC Candidates: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే.. వారికే అవకాశం ఎందుకంటే ?
Rohit Sharma Records: 37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
37 ఏళ్ల కరువు తీర్చేసిన రోహిత్ శర్మ, అరుదైన భారత కెప్టెన్‌గా నిలిచిన హిట్ మ్యాన్
Viveka Murder: ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
ఒక హత్య.. ఆరు మరణాలు.. అంతుచిక్కని ఈ మిస్టరీకి అంతం ఎప్పుడు.. ?
Embed widget