అన్వేషించండి

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజ్‌ - రాజ్‌ కోసం వెతికిన యామిని

Brahmamudi serial today episode August 6th: కళావతికి ఇష్టం లేనప్పుడు తాను ఇంట్లో ఉండటం కరెక్టు కాదని రాజ్‌ వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది

Brahmamudi Serial Today Episode:  కావ్య పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో రాజ్‌ బాధపడుతూ గార్డెన్‌ ఉంటాడు. రాజ్‌ను ఓదార్చేందుకు అపర్ణ, ఇందిరాదేవి వెళ్తారు.

రాజ్‌: నా లాగే మీరు కూడా మోసపోయారు కదా..? అయినా ఎవరితో బతకాలనేది తన ఇష్టం. తను ముందు నుంచి క్లారిటీగానే ఉంది. నేనే ఊహల్లో బతికేశాను. నా రాతలోనే ప్రేమకు చోటు లేదనుకుంటాను నాన్నమ్మ.. అందుకే ఆ దేవుడు యాక్సిడెంట్‌ రూపంలో నా గతంలో ఉన్న ప్రేమను చెరిపేసి నాకు గతమే లేకుండా చేసేశాడు. ఇప్పుడు యామిని చూపించే ప్రేమ నాక కనిపించదు.. నేను చూపించే ప్రేమ కళావతి గారికి కనిపించదు.

ఇందిరాదేవి: అలా బాధపడకు మనవడా..? మేమందరం ఉన్నాం కదా..? దానితో మేము మాట్లాడతాం. ఇలా ఎందుకు చేసిందో కనుక్కుంటాం

అపర్ణ: నాలుగు తగిలించైనా పెళ్లికి ఒప్పిస్తాం

రాజ్‌: రికమండ్‌ చేస్తే ఆఫీసులో స్థానం దొరకొచ్చేమో కానీ మనసులో స్థానం దొరకదు కదా అమ్మా.. అయినా ఇష్టం లేని షర్టే వేసుకోం అలాంటిది.. ఇష్టం లేని మనిషితో జీవితాంతం కలిసి ఉండాలంటే ఎలా కుదురుతుందమ్మా..? అలా చేసి తనను బాధపెటలేను అమ్మా..! ఇప్పటి వరకు నాకు గతమే లేదనుకున్నాను. భవిష్యత్తు కూడా లేదని ఇప్పుడే తెలిసింది. తనకు ఇష్టం లేదన్నాక ఇక నేను ఇక్కడ ఉండను

అని చెప్పి రాజ్‌ వెళ్లిపోతాడు. అపర్ణ, ఇందిరాదేవి కోపంగా కావ్య దగ్గరకు వెళ్తారు. కావ్య ఏడుస్తూ ఉంటుంది.

అపర్ణ: ఎందుకే ఇలా చేశావు

కావ్య: నా కారణాలు నాకు ఉన్నాయి అత్తయ్యా

ఇందిరాదేవి: ఏం కారణాలు ఉన్నాయే..?

కావ్య: చెప్పేవే అయితే అక్కడే చెప్పే దాన్ని కదా అమ్మమ్మ..

అపర్ణ: అసలు మాకు చెప్పలేనంత కష్టం నీకు ఏమి వచ్చింది.

ఇందిరాదేవి: నువ్వు చెప్పేంత వరకు ఇక్కడి నుంచి కదలం

అపర్ణ: వాడిని వద్దూ అనడానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి..?

ఇందిరాదేవి: వాడి కోసమే బతుకుతున్న నువ్వు ఈరోజు వాడిని అంతలా అవమానించడానికి కారణం ఏంటి..?

కావ్య:  అయ్యో ఈ విషయం నేను చెప్పలేను అమ్మమ్మ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి.

అపర్ణ:  సరే అయితే నువ్వే అంత మొండిగా ఉంటే.. ఇక నేనెంత మొండిగా ఉంటానో నువ్వు చూస్తావు. ఇప్పటి వరకు ఆడిన నాటకాలు, డ్రామాలు చాలు. ఇక వాడే దూరం అవుతాడని తెలిశాక నిజాలు దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏం జరిగితే అది జరుగుతుంది. ఇప్పుడే వెళ్లి వాడికి అన్ని నిజాలు చెప్పేస్తాను. వాడు మర్చిపోయిన గతాన్ని గుర్తు చేసి తిరిగి ఇంటికి తీసుకొస్తాను. వాడికి ప్రాణం పోసిన తల్లిని నేను నిజంగా వాడికి ఏమైనా జరిగితే నా ప్రాణం పెట్టైనా సరే నేను కాపాడుకుంటాను.

అని అపర్ణ వెళ్లిపోతుంటే..

కావ్య: నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య

అపర్ణ: ఏమంటున్నావే నువ్వు

కావ్య: అవును అత్తయ్యా నేను తల్లిని కాబోతున్నాను..

ఇందిరాదేవి: ఒసేయ్‌ పిచ్చి ముఖం దానా..? ఇంత మంచి శుభవార్తని ఎవరైనా ఇలా చెప్తారా..?

అపర్ణ: అసలు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు..? ముందే చెప్పి ఉంటే.. అందరికి చెప్పి ఒక పండగలాగా జరిపించేవాళ్లం

కావ్య:  ఆయనతో చెప్పేవారా..? నేను కడుపుతో ఉన్నానని ఆయనకు ఎలా చెప్తారు అత్తయ్యా.. దానికి కారణం ఎవరు అంటే ఎవరిని చూపిస్తారు. అందుకే ఈ నిజాన్ని ఆయనకు ఎప్పటికీ చెప్పను.. చెప్పకూడదు అంటే ఆయనకు ఎప్పటికీ ఎదురుపడను. ఆయనకు గతం గుర్తు చేయాలని చూస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అన్నారు డాక్టర్‌ గారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను.

అని కావ్య చెప్పగానే.. అపర్ణ, ఇందిరాదేవి బాధపడతారు. కావ్యను తిట్టినందుకు క్షమించమని అడుగుతారు. ఆ దేవుడు నీకు ఎంత పెద్ద మనసు ఇచ్చాడు అంటూ ఎమోషనల్‌ అవుతారు. తర్వాత రాజ్ ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటాడు. వెనక నుంచి వెహికిల్‌ వస్తుంది. కట్‌ చేస్తే యామిని రాజ్‌ కు ఫోన్‌ చేస్తుంది ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తుంది. యామిని కంగారు పడితే వైదేహి వచ్చి ఓదారుస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ కావ్యను అవైడ్‌ చేస్తుంటారు. అది చూసిన అపర్ణ, ఇందిరాదేవి బాధపడతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Advertisement

వీడియోలు

Who is Senuran Muthusamy | ఎవరి సెనూరన్ ముత్తుసామి ? | ABP Desam
Blind T20 Women World Cup | చారిత్రాత్మక విజయం సాధించిన అంధుల మహిళ క్రికెట్ టీమ్ | ABP Desam
India vs South Africa Second Test Match Highlights | భారీ స్కోరుకు సఫారీల ఆలౌట్ | ABP Desam
India vs South Africa ODI | టీమిండియా ODI స్క్వాడ్ పై ట్రోల్స్ | ABP Desam
Bollywood legend Dharmendra Passed Away | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర అస్తమయం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad- Tirupati Vande Bharat Express: తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
తిరుపతి వందే భారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రేపటి నుండి కొత్త మార్పు
IBOMMA Ravi Custudy: ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
ఐబొమ్మ రవి సంపాదన వంద కోట్లపైనే - కస్టడీలో కీలక వివరాలు రాబట్టిన పోలీసులు
Kokapet land auction: కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
కోకాపేటలో ఎకరం 137 కోట్లు - రికార్డు స్థాయి ధర పలికిన మరో వేలం
Dharmendra : బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి - అభిమానుల కన్నీటి వీడ్కోలు
Pawan Kalyan: నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే  !
నాడు ఆలయానికి ఇచ్చిన మాట నేడు నెరవేర్చిన పవన్ - జగన్నాథపురం గుడి దశ తిరిగినట్లే !
India vs South Africa: గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
గువాహటి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌పై కరుణ్ నాయర్ సెటైర్లు? నవ్వు ఆపుకోలేకపోయిన అశ్విన్!
Smriti Mandhana: స్మృతి మంధాన పలాష్ ముచ్చల్‌తో పెళ్లి బంధం తెంచుకున్నారా? ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు తొలగించారా?
స్మృతి మంధాన పలాష్ ముచ్చల్‌తో పెళ్లి బంధం తెంచుకున్నారా? ఇన్‌స్టాలో ఫోటోలు, వీడియోలు తొలగించారా?
Cheating bride: పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
పెళ్లి కాగానే డబ్బు, బంగారంతో పెళ్లికూతురు జంప్ - వరంగల్ పెళ్లికొడుక్కి షాక్ !
Embed widget