Brahmamudi Serial Today April 16th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : భార్యపై ప్రేమను వ్యక్తం చేసిన రాజ్ - కావ్య ఆనందానికి అవధుల్లేవు
Brahmamudi Today Episode: ఇద్దరి అభిప్రాయాలు , ఆలోచనలు మంచివే కానవారి మధ్య ఉన్నది అతి పెద్ద అగాధం. తన గురించి రాజ్ మాట్లాడిన మాటలి విని నిజమో, అబద్ధమో తెలుసుకోలేని కావ్య వేదనే ఇవాళ్టీ ఎపిసోడ్
Brahmamudi Today Episode: ఓల్డ్ స్టూడెంట్ పార్టీలో తన గురించి రాజ్ అద్భుతంగా మాట్లాడిన మాటలని, తన మీద చూపించిన ప్రేమని అంగీకరించదు కావ్య. లేని ప్రేమని చూపించడానికి ఎందుకు చూపించడానికి ప్రయత్నించారు అని ఆవేదనతో ప్రశ్నిస్తుంది. మీరు చేసిన పని మీకు బాధగా అనిపించట్లేదా అని అడుగుతుంది కావ్య. నేను మోసం చేశాను నిన్ను అని అంగీకరిస్తాడు రాజ్.
కానీ రాజ్ కి తన మీద ఉన్న ప్రేమ నిజమో కాదో తెలుసుకోలేని స్థితిలో రాజ్ తనని మోసం చేస్తున్నాడో, నిజంగా ప్రేమ చూపిస్తున్నాడా అన్న విషయం తెలుసుకోలేక ఆ విషయాలన్నీ కావ్య, రాజ్ నే ప్రశ్నిస్తుంది. మరోసారి పిల్లడి గురించి అడుగుతుంది. కానీ రాజ్ అక్కడ అందరూ మన కోసం ఎదురుచూస్తున్నారు అంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ కళ్యాణ్ డాక్యుమెంట్ల గురించి ఆలోచనలో ఉంటాడు. తల్లితో కూర్చుని తరువాత ఏం ప్లాన్ చేద్దామా అని మాట్లాడుతూ ఉండగానే స్వప్న వస్తుంది. తనకి తినడానికి కావాలని అడుగుతుంది.. పనిలో పని కళ్యాణ్ వేరే అమ్మాయిని ట్రై చెయ్యడానికి ప్రయత్నిస్తే ఆ అమ్మాయి ఛీకొట్టిన విషయం విషయం తనకి తెలుసు అంటూ ధూంధాంలాడుతుంది. అత్తగారు ఇద్దరికీ సర్ది చెబుతుంది.
మరోవైపు ఇక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ ఫంక్షన్ ఉత్సాహంగా సాగుతోంది. అందరూ తమ తమ హస్బెండ్ ల గురించి మాట్లాడుతూ ఉంటారు. అందరూ ఈసారి కావ్యని అడుగుతారు. కావ్య కుటుంబ బాంధవ్యాలు అనే విషయం గురించి అందరికీ నచ్చచెప్పుతుంది. భర్త అన్నదమ్ములతోటి, తల్లిదండ్రులతో మంచిగా ఉండటం మంచిదే కదా అని ప్రశ్నిస్తుంది. భర్తని, భర్త కుటుంబాన్ని ప్రేమగా, గౌరవంగా చూసుకోవటమే మనకి గౌరవమని చెబుతుంది. దీంతో అందరూ ఒక్కసారిగా డల్ అయిపోతారు. అప్పటి వరకు తమ భర్త గురించి అత్త వారి గురించి అవమానకారంగా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు.
ఇక్కడ అబ్బాయిల టేబుల్ దగ్గర కూడా అదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలి అవమానించాలి అన్న స్నేహితుల మాటలకు రాజ్ చాలా బాధపడతాడు. నిన్ను నమ్మి తన కుటుంబాన్ని వదిలిన భార్యలకి ఇచ్చే విలువ ఇది కాదు అంటూ చెప్తాడు. మీకోసం వచ్చిన అమ్మాయి మీ నుంచి కోరుకున్న దానిని మీరు ఇస్తే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తాడు.
ఇద్దరి మాటలను విన్న ఒకే ఒక వ్యక్తి శ్వేత. ఇద్దరూ మంచి వాళ్ళు ఈ రోజు తర్వాత వీళ్ళ బంధం ఏం కానుందో అని బాధపడుతుంది. మరోవైపు బాబు ఏడుస్తున్నాడు అంటూ ఆయా పిల్లాడిని తీసుకు వస్తుంది. బాబు ఏడుపు విన్న ఓఅమ్మాయి వచ్చి వాడిని ఎత్తుకుంటుంది. రాజ్ ని నానా మాటలు అంటుంది. తనే బిడ్డ సొంత తల్లి లాగా ప్రవర్తిస్తుంది. ఆమె వెన్నెలేమో అని అనుమానపడుతుంది కావ్య. అవునా కాదా తెలిసే లోపే వచ్చిన అమ్మాయి తను వాళ్ల పాత ఫ్రెండ్ అని చెబుతుంది. అందరూ నువ్వు ఇంకా ఆ మారలేదా తల్లి అని సరదాగా దెబ్బలాడతారు.
వెన్నెల శ్వేతకి ఫోన్ చేస్తుంది.. ఇంకో 20 నిమిషాల్లో పార్టీ జరిగే ప్లేస్ కి చేరుతాను అంటుంది వెన్నెల. రాజ్ వచ్చాడా అని అడుగుతుంది. ఏం చెప్పాలో తెలియక వద్దామనుకున్నాడు కానీ రాలేకపోయాడు అని చెబుతుంది శ్వేత. ఈలోపు కావ్యకి కూడా విషయం చెబుతుంది. నాకు ఏదో అనుమానంగా ఉంది వెన్నెల రాజ్ గురించి మాత్రమే అడగడంతో అంటుంది శ్వేత. వారిద్దరూ అసలు కాంటాక్ట్ లో లేరు అంటావా అని శ్వేత ప్రశ్నించగా రాజ్ కొత్తగా ఎవరితోని మాట్లాడలేదని గత కొంతకాలంగా రాజ్ మొబైల్ తాను పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నానని వెన్నెల చెప్తుంది.
తరువాయి భాగంలో..
శ్వేతని ఇంకాఆ ఎవరికోసం అంత ఎదురుచూస్తున్నావు అని అడుగుతాడు రాజ్. వెన్నెల కోసం అని చెబుతుంది శ్వేత.. షాక్ అవుతాడు రాజ్.. పక్కనే ఉన్న కావ్య వెన్నెలపై ఆసక్తి చూపుతుంది. రాజ్ చాలా టెన్షన్ పడతాడు. వెన్నెల వస్తే నిజం బయటపడుతుంది కదా అని ఆలోచిస్తుంటాడు. ఈలోపు కార్ అక్కడికి చేరుకుంటుంది.
Also Read: ఏకంగా హీరోనే మార్చేసిందిగా... ఎన్టీఆర్ సెల్ఫీతో ఊర్వశి బండారం బయట పడిందిగా!