అన్వేషించండి

Brahmamudi September 4th: సీతారామయ్య ఆరోగ్య పరిస్థితి విషమం- కావ్యని భార్యగా అంగీకరించిన రాజ్

సీతారామయ్య కోసం రాజ్ కావ్యని భార్యగా అంగీకరించడంలో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

వరలక్ష్మీ వ్రతం చేసుకున్న కావ్యని రాజ్ ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతాడు. ఎందుకు అలా చేశారని కావ్య నిలదీస్తుంది. ఇదేమీ తన ఇష్టంతో జరిగిన పెళ్లి కాదని, తనని భార్యగా అంగీకరించేది లేదని చెప్తాడు. మన ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్తాడు.

కావ్య: సంబంధం లేదని అంటున్నా సావాసం చేస్తున్నా. సహనంతో సహజీవనం చేస్తున్నా ఎందుకు? అంటూ తాళి చూపించి ఇందుకు అంటుంది. ఈ శతమానంతో నన్ను కట్టేశారు. పెళ్లి పేరుతో నన్ను ఇక్కడ కట్టి పడేశారు

రాజ్: నేనేమీ నిన్ను కష్టపెట్టడం లేదు

కావ్య: ఇష్టం కూడా చూపించలేదు. ఈ సమస్య నా జీవితానికి సంబంధించినది

రాజ్: ఇది ఏది నేను కోరుకున్నది కాదు ఇష్టపడింది కాదు

కావ్య: అయినా సరే సర్దుకుపోవాలి. వివాహాన్ని గౌరవించాలి. ప్రపంచంలో ఎన్నో పెళ్ళిళ్ళు ఇష్టం లేకుండానే జరుగుతున్నాయి. వాళ్ళు సర్దుకుపోయి కుటుంబాన్ని చూసుకోవడం లేదా

రాజ్: అందరు వేరు నేను వేరు నా వల్ల కాదు

Also Read: ముకుంద ప్లాన్ తిప్పికొట్టిన మధుకర్, కృష్ణకి ప్రేమ సంగతి చెప్పాలని సైకో ప్రేయసి ప్రయత్నం

కావ్య: నా అభిప్రాయాలు, కోరికలతో సంబంధం లేదా?

రాజ్: నీకు ఇక్కడ ఏం తక్కువైంది

కావ్య: ప్రేమ, గౌరవం తక్కువైంది. ఇది జీవితం కలిసే ఉండాలి కలిసే బతకాలి

రాజ్: నాకు ఈ ప్రయాణం వద్దు నా గమ్యం ఇది కాదు

కావ్య: అప్పుడు నేను మధ్యలోనే దిగిపోవాలి అంతేనా. మీరు మారతారని అర్థం చేసుకుంటారని భార్యగా స్వీకరిస్తారని ఎదురుచూశాను. ఇవాల్టితో నా కళ్ళకి కమ్మేసిన మాయ పొర తొలగిపోయింది. ఇంక నేను ఎందుకు ఇక్కడ ఉండాలి. బ్రహ్మముడిని కూడా ఎదిరించే సాహసం మీకు ఉందని అర్థం అయ్యింది. ఏం చేసినా మీ మనసు మారాదని అర్థం అయ్యింది. మీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయలేనప్పుడు నా ప్రయాణం ఆపేయాలని నేను తెలుసుకున్నా. అందుకే ఈరోజు నేను మీ నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నా

సీతారామయ్య రాజ్, కావ్య మాటలు విని దాని గురించి ఆలోచిస్తూ మెట్లు దిగుతూ కళ్ళు తిరిగి పడిపోతాడు. అందరూ సీతారామయ్యకి ఏమైందోనని కంగారు పడతారు. నీళ్ళు తాగించి కూర్చోబెడతారు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం ఎందుకో మంచిగా అనిపించడం లేదని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లమని కావ్య శుభాష్ తో చెప్తుంది. రాజ్, శుభాష్ పెద్దాయన్ని హాస్పిటల్ కి తీసుకుని వెళతారు. కావ్య వస్తానని అంటే అక్కర్లేదని కోపంగా అంటాడు. తండ్రికి ఏమౌవుతుందోనని శుభాష్ కంగారుపడతాడు.

డాక్టర్: సీతారామయ్యకి బ్లడ్ క్యాన్సర్. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియకుండా ఎలా ఉందో అర్థం కావడం లేదు. మీ తాతయ్యని కూడా ఎప్పుడైనా నీరసంగా ఉందని అడిగాను ఎప్పుడు తనకి అలా అనిపించలేదని అన్నారు

రాజ్: క్యూర్ చేయవచ్చు కదా

డాక్టర్: ఆయనకి క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ట్రీట్మెంట్ ఉంది కానీ మేమిచ్చే ట్రీట్మెంట్ కి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పలేను. అసలు మెడిసిన్ కూడా తగ్గుతుందని చెప్పలేము. మీ తాతయ్య ఉన్న కండిషన్ కి మూడు నెలలు మాత్రమే బతుకుతారు. మీరు తనని ఎంత సంతోషంగా చూసుకుంటే ఆయన ఆయుష్హుని అంతగా పెంచుతారు

రాజ్: మా తాతయ్యకి ఈ విషయం చెప్పొద్దు. ఆయన సంతోషంగా ఉండాలంటే ఈ విషయం ఇంట్లో కూడా ఎవరికీ తెలియకూడదు. ఇంట్లో తెలిస్తే అందరూ తన మీద జాలి చూపిస్తారు. ఆయనకి కావలసింది సంతోషం అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు

Also Read: వావ్ ఇది కదా సీన్ అంటే.. లాస్యని గెంటేసిన రాజ్యలక్ష్మి- ఏడిపించేసిన లక్కీ

పెద్దాయన్ని ఇంటికి తీసుకురాగానే డాక్టర్ ఏమన్నారని అడుగుతారు. తాతయ్య ఆరోగ్యానికి ఏం ఢోకా లేదని బలానికి ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుందని రాజ్ అబద్దం చెప్తాడు. దీంతో ఇంట్లో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ శుభాష్ మాత్రం మొహం డల్ గా పెట్టుకుంటాడు. కావ్య గదిలోకి రాగానే వెళ్లిపోయావని అనుకున్నా ఇంకా ఉన్నావా అంటాడు. ఈ సమయంలో వెళ్ళిపోయి పెద్దాయన్ని మరింత టెన్షన్ పెట్టడం ఎందుకని ఆగిపోయానని చెప్తుంది. కానీ రాజ్ మాత్రం దెప్పి పొడుపు మాటలు మాట్లాడతాడు.

రాజ్: నా నిజ స్వరూపం కనిపించిందని అన్నావ్ కదా. మళ్ళీ పొరలు కమ్మేశాయా

కావ్య: ఈ పరిస్థితిలో ఇంటి కోడలు వెళ్లిపోతే అందరూ ఏమనుకుంటారోనని ఆగిపోయాను కానీ ఇంకా వెళ్లిపోలేదా అని మీరు అడిగిన తర్వాత ఇంకా ఉండిపోవాలా అని నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది. నేను వెళ్లిపోతాను మీరు ఇక సంతోషంగా ఒంటరిగా ఉండండి

రాజ్ ని సీతారామయ్య పిలుస్తాడు.

సీతారామయ్య: నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానని చెప్పారు. డాక్టర్ నీతో మాట్లాడటం నేను విన్నాను అనగానే రాజ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మీ నానమ్మకి నా పరిస్థితి తెలిస్తే ప్రాణాలతో ఉండదు. నువ్వు నాకొక మాట ఇవ్వాలి. నువ్వు కావ్య సంతోషంగా కలిసి ఉండాలి. నువ్వు కావ్య మెడలో తాళి కట్టావు. తనని నువ్వు జీవితాంతం ఏలుకోవాల్సిందే. నేను జీవితంలో ఎన్నో చూశాను కానీ మీ దాంపత్యం విషయం భయంగా ఉంది. మీరిద్దరూ కళకళలాడుతూ కాపురం చేస్తుంటే సంతోషంగా కన్ను మూయాలని ఉంది. కావ్యని ప్రేమగా చూసుకుంటానని మాట ఇవ్వు

రాజ్: తాతయ్య ఉన్నంత కాలం తృప్తిగా ఉంటే చాలు. మీరున్నంత కాలం కావ్యతో సంతోషంగా ఉన్నట్టు నటిస్తాను అని మనసులో అనుకుని మీరు చెప్పినట్టే చేస్తానని మాట ఇస్తాడు

సీతారామయ్య: ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది

తరువాయి భాగంలో..

కావ్య వెళ్లిపోవాలని నిర్ణయించుకునేసరికి రాజ్ వచ్చి ఇప్పటి వరకు ఆగావు కదా మరో మూడు నెలలు ఓపిక పట్టమని అడుగుతాడు. కావ్య సంతోషంగా కృష్ణయ్య దగ్గరకి వెళ్ళి తన భర్త మారడానికి మూడు నెలలు గడువు అడిగాడని మారితే తన జీవితం సంతోషంగా ఉంటుందని అనుకుంటుంది. తాతయ్య ఉన్నంత వరకు నేను ఆయన మాట ప్రకారం కళావతిని ప్రేమగా చూసుకుంటున్నట్టు నటించాలని అనుకుంటాడు. భర్త మనసులో స్థానం కావాలని కావ్య ఆశపడుతుంది. కానీ రాజ్ మాత్రం తన మనసులో ఎప్పటికీ కళావతికి స్థానం లేదని తేల్చి చెప్పేస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget