అన్వేషించండి

Krishna Mukunda Murari September 2nd: ముకుంద ప్లాన్ తిప్పికొట్టిన మధుకర్, కృష్ణకి ప్రేమ సంగతి చెప్పాలని సైకో ప్రేయసి ప్రయత్నం

మురారీ తనని ప్రేమిస్తున్నాడని కృష్ణకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

Krishna Mukunda Murari September 2nd: ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేయాలని చెప్పిన భవానీ వ్రతం విశిష్టత గురించి కృష్ణ చక్కగా వివరిస్తుంది.  తింగరి పిల్ల అనుకున్నా చాలా బాగా చెప్పిందని మెచ్చుకుంటారంతా. ఇలాంటివి చేసి కృష్ణ అందరినీ మాయ చేస్తుంది. అసలు మా ప్రేమ విషయం అత్తయ్యకి తెలియాలని అనుకుంటున్నా కానీ తెలియాల్సింది ముందు కృష్ణకి. తను మా ప్రేమని అర్థం చేసుకుంటుంది. కృష్ణ నోరు మూయించాలంటే మా ప్రేమ విషయం తనకే చెప్పాలని ముకుంద మనసులో అనుకుంటుంది. సూపర్ గా చెప్పావ్ కృష్ణ రేపు పూజ సామాగ్రి తీసుకురావడానికి మనమే వెళ్దామని ముకుంద అంటుంది. తను కావాలనే కృష్ణతో వెళ్తుందని ఎలాగైనా ఆపాలని రేవతి అనుకుంటుంది. కృష్ణని షాపింగ్ కి తీసుకెళ్ళి ఒకప్పటి మా ప్రేమ విషయం చెప్తే ఏమౌవుతుందోనని మురారీ టెన్షన్ పడుతూ ఉంటాడు. తెలిసో తెలియకో కృష్ణ ముకుందని ప్రేమించిన వాడిని మర్చిపొమ్మని చెప్పింది. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఏంటి పరిస్థితి? అసలు అమ్మ కృష్ణకి ఏం చెప్పి తీసుకొచ్చిందని ఆలోచిస్తూ ఉండగా మధుకర్ వచ్చి ఏమైందని అడుగుతాడు. మురారీ మూడ్ మార్చడం కోసం ఒక పెగ్ వేద్దాం రమ్మని పిలుస్తాడు. దీంతో తను చిరాకుగా రీల్స్, మందు కొట్టడం తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు అని అరుస్తాడు. అప్పుడు మధుకర్ అసలు నిజం బయట పెడతాడు.

Also Read: కృష్ణతో మురారీ రొమాంటిక్ మూమెంట్స్, కుళ్లుకుంటున్న ముకుంద!

మధుకర్: మన కుటుంబంలో  అందరూ బాగుండాలి. ముఖ్యంగా నువ్వు కృష్ణ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. మీ జీవితం బాగుండాలని ఆలోచించాను కాబట్టే ముకుంద లవ్స్ మురారీ డెకరేషన్ మార్చేసి వెల్ కమ్ కృష్ణ అని పెట్టాను

మురారీ: అది మార్చింది నువ్వా? ఎప్పుడు ఎలా మార్చావ్

మధుకర్: ఆరోజు ముకుంద నీ గదిలో నుంచి బయటకి వచ్చి పెద్దమ్మ దగ్గరకి వెళ్ళడం చూశాను. వెంటనే వాటిని మార్చేశాను అని జరిగింది మొత్తం చెప్తాడు

మురారీ: ముకుందతో నా లవ్ మ్యాటర్ ఎలా తెలుసు

మధుకర్: మీ లవ్ మ్యాటర్ ముకుంద చెప్పింది. ఈ విషయం పెద్దమ్మకి తెలియాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది

మురారీ: నేను ముకుందని మోసం చేయలేదు

మధుకర్: నువ్వేం చెప్పాల్సిన పని లేదు. మన ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది కుటుంబం బాగుండటం కోసమే అని నాకు తెలుసు. నిన్ను, కృష్ణని ఎవరూ విడదీయలేరు. ఇక ముకుంద సంగతి అంటావా? ఆదర్శ్ వస్తే తనే సెట్ అవుతుంది

మధుకర్ మాట్లాడి వెళ్లిపోగానే ముకుంద వస్తుంది. తనని గౌరవిస్తూ మురారీ పలకరిస్తే చిరాకు పడి ఆ గౌరవం పరాయిదైన కృష్ణకి ఇవ్వమని చెప్తుంది.

ముకుంద: కృష్ణని రేపు షాపింగ్ కి తీసుకెళ్ళి మన ప్రేమ విషయం చెప్పేస్తాను

మురారీ: నేను చెప్పనివ్వను కదా నేను కూడా మీతో వస్తాను

Also Read: వావ్ ఇది కదా సీన్ అంటే.. లాస్యని గెంటేసిన రాజ్యలక్ష్మి- ఏడిపించేసిన లక్కీ

ముకుంద: సూపర్ నువ్వు కూడా నాతో ఉంటే మన ప్రేమ విషయం హ్యాపీగా చెప్పొచ్చు. అంటే ఇన్ డైరెక్ట్ గా కృష్ణని సైడ్ అయిపొమ్మన్నట్టే కదా తనకి క్లియర్ గా అర్థం అవుతుంది. కాబట్టి మనం ముగ్గురం కలిసి వెళ్ళి నిజం చెప్పేస్తాము ఇది ఫిక్స్

మురారీ: అయ్యయ్యో కృష్ణ చాప మీద పడుకుంటుంది నేను వెళ్ళి దాన్ని దాచేయాలి అప్పుడే కదా తను నా పక్కన బెడ్ మీద పడుకునేది బై అనేసి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడాడో అర్థం కాక ముకుంద బిక్క మొహం వేస్తుంది. గదిలోకి వెళ్ళి వెంటనే కృష్ణ పడుకునే చాప తనకి అందకుండా కబోర్డు మీద పెడతాడు. తర్వాత ఏం తెలియనట్టు నటిస్తాడు. కృష్ణ వచ్చి చాప కోసం వెతుకుతుంటే తనకేమి తెలియదని బిల్డప్ ఇస్తాడు. అది తీసుకోవడానికి ట్రై చేస్తూ కృష్ణ జారి పడిపోతుంటే మురారీ పట్టుకుంటాడు. భర్త పట్టుకునేసరికి కృష్ణ మురిసిపోతుంది. మీ ప్రేమ నాతో నేరుగా చెప్పినప్పుడు మీ గుండెల మీద పడుకుని బోలెడు కబుర్లు చెప్తూ నిద్ర పుచ్చుతానని కృష్ణ మనసులో అనుకుంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పరిస్తాంఎన్డీఆర్‌ఎఫ్‌ ను తెచ్చింది టీడీపీ  ప్రభుత్వమేరైతు బంధుపై ఎవరిదీ రాజకీయం?Priest Touches Hydraa Commissioner Feet | కన్నీళ్లతో హైడ్రా కమిషనర్ కాళ్లు పట్టుకున్న పూజారి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
Donald Trump: అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే Elon Muskకు కీలక బాధ్యతలు అప్పగించిన డొనాల్డ్ ట్రంప్
CM Chandrababu: దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
దావోస్ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు - 'బ్రాండ్ ఏపీ ప్రమోషన్' పేరుతో 5 రోజుల పర్యటన
Neeraj Chopra Marriage: ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
ప్రేమించి, పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా.. వధువెవరో తెలుసా..! వివాహాన్ని రహస్యంగా ఉంచిన స్టార్ అథ్లెట్
CapitaLand Investment: హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
హైదరాబాద్​లో మరో ఐటీ పార్క్​.. రూ.450 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన క్యాపిటల్యాండ్​
Anil Ravipudi: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్‌పై డైరెక్టర్‌ అప్‌డేట్‌ - పెద్ద ప్లానే వేసిన అనిల్‌ రావిపూడి, ఏం చెప్పారంటే?
SVSN Varma: 'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
'నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలి' - మీడియా ఛానళ్లు వక్రభాష్యం చేయడం సరికాదన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ
Anchor Suma: మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
మరోసారి వెండితెరపై అలరించబోతోన్న యాంకర్‌ సుమ - ప్రియదర్శి హీరోగా ఆమె కీలక పాత్రలో 'ప్రేమంటే' చిత్రం
Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం -  భయంతో పరుగులు తీసిన భక్తులు
ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు
Embed widget