News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi September 26th Episode: రాజ్‌ ని ఓడించిన కళావతి - కళ్యాణ్ ని చితక్కొట్టిన అప్పు- స్వప్న కిడ్నాప్!

రాజ్, కావ్య సంతోషంగా ఉండటం చూసి రుద్రాణి రగిలిపోతూ వాళ్ళని విడగొట్టేందుకు చూస్తుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

Brahmamudi September 26th Episode:  తాను చాలా ధైర్యవంతులని గొప్పలు చెప్పుకుంటాడు రాజ్. కానీ చిన్న బొద్దింకని చూసి వణికిపోతాడు. దీంతో కావ్య ఆట పట్టిస్తుంది. అలా అయితే పది నిమిషాల పాటు తనని ఎత్తుకోమని అంటుంది. రాజ్ కావ్యని ఎత్తుకుని అలాగే నిలబడతాడు. మీరు చాలా మొండి వాళ్ళు అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరని అంటుంది. మీరు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టారు కానీ అది చెప్పడానికి మీకు మనసు రావడం లేదు. మీరు అడిగిన మూడు నెలల్లోనే మీ ప్రేమని బయట పెట్టిస్తానని కావ్య మనసులో అనుకుంటుంది.

కలుస్తానని చెప్పి రాలేదని కళ్యాణ్ మీద అప్పు పీకల దాకా కోపం మీద ఉంటాడు. కాల్ చేస్తే అనామికతో మాట్లాడుతూ అప్పు ఫోన్ పట్టించుకోడు.

రాజ్ పొద్దున్నే స్కిప్పింగ్ చేస్తూ ఉంటాడు. కాస్త దూరంలో సీతారామయ్య వాళ్ళు కూర్చుని ఉంటారు. కావ్య వెళ్ళి రాజ్ ని పలకరిస్తుంది. చాలా రోజుల తర్వాత ఎక్సర్ సైజ్ చేస్తున్నారనుకుంట అంటుంది. నువ్వు పెట్టె ఆయిల్ ఫుడ్ తిని బరువు పెరిగాను అది తగ్గించుకోవాలని అంటాడు.

కావ్య: ఏం కాదులే మీరు రాత్రి నన్ను ఎత్తుకున్నప్పుడు ఆయాస పడ్డారు అది తగ్గించుకోవడానికి స్కిప్పింగ్ చేస్తున్నారు కదా

రాజ్: ఆపకుండా 100 చేశా నువ్వు కనీసం 20 అయినా చేస్తావా?

Also Read: హాస్పిటల్లో జగతి - తల్లడిల్లిన రిషి, విడిపోతున్న చిక్కుముడులు - త్వరలోనే శుభం!

తనతో ఎవరు పోటీ పడలేరని కావ్య రాజ్ ని రెచ్చగొడుతుంది. ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు విన్న సీతారామయ్య ఓటమి ఒప్పుకుంటావా? అని అంటాడు. ఇద్దరం కలిసి స్కిప్పింగ్ చేద్దామని కావ్య సవాల్ విసురుతుంది. దీంతో ఇద్దరూ స్కిప్పింగ్ చేస్తూ ఉండటం చూసి రుద్రాణి, అపర్ణ రగిలిపోతారు. కాంట్రాక్ట్ పూర్తి అయిందని సంతోషపడుతూ మొగుడితో కలిసి గంతులు వేస్తున్నావా? ఒక్కసారి స్వప్న కనిపించడం లేదని తెలిస్తే అప్పుడు ఎలా గెంతుతావో నేను చూస్తానని అంటుంది. గెలిచే వరకు ఆపేదె లేదని అంటుంది. రాజ్ స్కిప్పింగ్ చేయలేక ఆగిపోతాడు. తానే గెలిచానని కావ్య సంతోషంగా అరుస్తుంది. మనవరాలి చేతిలో ఒడిపోయావా? అని ఇంద్రాదేవి అనేసరికి రాజ్ బుంగమూతి పెట్టుకుంటాడు. మొగుడిని వెనకేసుకొస్తుంది.

అప్పుని కలవడానికి కళ్యాణ్ వస్తాడు. అప్పు వస్తూ వస్తూ కర్ర పట్టుకుని వస్తుంది. ఏంటి బ్రో ఈసారి ఎవరు కొట్టడానికి వస్తున్నావ్ అనేసరికి అప్పు కళ్యాణ్ ని చితకబాదేస్తుంది. కలవడానికి వస్తానని ఎందుకు రాలేదని కోపంగా మళ్ళీ కొడుతుంది. వెంటనే ఐలవ్యూ అనేస్తాడు. దీంతో షాక్ అవుతుంది. ఇలాగే షాక్ అయ్యావా? అనామిక ఇలా చెప్పకుండా నేరుగా పెళ్లి పత్రిక తీసుకొచ్చి పెళ్లి చేసుకుందామని అడిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఈ విషయం చెప్దామని వచ్చానని అంటాడు.

కళ్యాణ్: అనామిక ప్రపోజ్ చేస్తే హ్యాపీగా ఉంటావ్ అనుకుంటే ఇలా డిసప్పాయింట్ చేస్తావా?

అప్పు: నువ్వు ఎవరితో అయినా వెళ్ళు కానీ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నీతో మాట్లాడను అనేసి వెళ్ళిపోతుంది.

చంపక్ లాల్ ఇంటికి వచ్చి వడ్డీ డబ్బులు ఇవ్వమని కృష్ణమూర్తితో గొడవ పడతాడు. అది చూసి కనకం కోపంగా వాడి మీద గొడవకు దిగుతుంది. డబ్బులు ఇవ్వనని చెప్పి కనకం చంపక్ లా గొంతు పట్టుకుంటుంది. వినాయక చవితి అయిపోగానే మొత్తం డబ్బులు ఇస్తానని అనేసరికి చంపక్ లాల్ వెళ్ళిపోతాడు. డబ్బులు ఇవ్వకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డుకి ఈడ్చి ఇల్లు ఖాళీ చేసి అందరినీ రోడ్డున పడేస్తానని, ఎంతగా అరిచినా కూడ ఇల్లు సొంతం చేసుకోకుండా వదలిపెట్టనని  వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. రాహుల్ స్వప్నని ఒక రిసార్ట్ కి తీసుకొస్తాడు.

Also Read: అదిరిందయ్యా మురారీ- ఓ వైపు ప్రియురాలితో డాన్స్, పెళ్ళాంతో ప్రేమ కబుర్లు

రాహుల్: ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాను. రాజ్, కావ్యని చూసుకుంటున్నట్టు నిన్ను చూసుకోలేదని చాలా బాధపడ్డావ్ కదా ఇక నుంచి నిన్ను సంతోషంగా చూసుకుంటాను అనేసి మోకాళ్ళ మీద నిలబడి రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి తెగ సంతోషపడుతుంది. రింగ్ తీసుకునే టైమ్ కి మైఖేల్ వచ్చి స్వప్న తలకి గన్ గురి పెడతాడు. రాహుల్ ని కొట్టేసి స్వప్నని కిడ్నాప్ చేస్తారు.  

Published at : 26 Sep 2023 09:14 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial September 26th Episode

ఇవి కూడా చూడండి

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Shobha Shetty: బిగ్ బాస్: 14 వారాలకు శోభా శెట్టి అందుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే?

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Krishna Mukunda Murari Serial December 11th Episode నా భర్త ఇక్కడే, నా పక్కనే ఉన్నారు.. మురారికి హింట్‌ ఇచ్చిన కృష్ణ!

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్, అలా అడిగేశావ్ ఏమిటీ? నాగార్జున ధరించిన ఆ స్వెటర్ ధర ఎంతో తెలుసా?

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్ - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Bigg Boss 7 Telugu: అమర్‌కు ‘బిగ్ బాస్’ సర్‌ప్రైజ్  - చూస్తుంటే బాధగా ఉందంటూ వ్యాఖ్యలు

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు