Brahmamudi October 18th: పోలీసులకి దొరికిపోయిన రాజ్, కావ్య- దొంగతనం చేస్తూ అడ్డంగా బుక్కైన రాహుల్!
రాజ్ నాటకం గురించి కావ్యకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Brahmamudi October 18th: కావ్య కిళ్ళీ తినాలని అనిపిస్తుందని అనేసరికి అర్థరాత్రి దొంగతనంగా కావ్యని తీసుకుని మెల్లగా ఇంట్లో నుంచి బయటకి జారుకుంటారు. బైక్ మీద వెళ్తున్నామని రాజ్ చెప్పేసరికి కావ్య అందంగా డ్రెస్ వేసుకుంటుంది. ఎవరైన నిద్రలేస్తారు ఏమోనని రాజ్ బైక్ ఇంట్లో స్టార్ట్ చేయకుండా గేట్ దాకా తోసుకుని వెళతాడు. బైక్ మీద రాజ్ ని గట్టిగా హగ్ చేసుకుని కూర్చుంటుంది. ఎన్నాళ్ళకి తన కల నిజమైందోనని కావ్య సంతోషంగా ఉంటుంది. షాపులు అన్నీ మూసేసి ఉండటం చూసి సిటీ ఎంత బాగుపడిందో అనుకుంటాడు. పాన్ షాపు అతను అప్పుడే షటర్ వేసి బయటకి వెళ్ళగానే రాజ్ వాళ్ళు వస్తారు. లైట్ వేసి ఉండటం చూసి తాళం వేయడం మర్చిపోయారని అనుకుంటారు. బయట నిలబడితే దొంగలు అనుకుంటారు లోపలికి వెళ్దామని చెప్తాడు. అలా చేస్తే దొంగతనం అవుతుందని కావ్య అంటే రాజ్ మాత్రం కిళ్ళీ కావాలంటే తప్పదని అనేసరికి ఇద్దరూ కలిసి పాన్ షాపులోకి వెళతారు.
కావ్య స్వీట్ కిళ్ళీ అడిగిందని రాజ్ స్వయంగా తయారు చేస్తాడు. అక్కడ ఉన్న జరదా వాసన చూసిన కావ్య ఛీ చండాలంగా ఉందని అంటుంది. జరదా ఆడవాళ్ళు వేసుకుంటే తట్టుకోలేరని అంటాడు. పాన్ రెడీ చేసి ఇవ్వగానే కావ్య ఆత్రంగా తినేస్తుంది. బయటకి వెళ్ళిన పాన్ షాపు ఓనర్ వస్తాడు. లోపల రాజ్ తమలపాకులు లెక్కబెడుతుంటే డబ్బులు లెక్కబెడుతున్నాడు ఎవరో దొంగలు తన షాపు దోచుకుంటున్నారని అనుకుని వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు. మొగుడు, పెళ్ళాలు మాదిరిగా ఉన్నారు షాపులో దొంగలు పడ్డారని చెప్తాడు. షాపుకి తాళం వేశానని అడ్రస్ చెప్తాడు.
Also Read: శైలేంద్ర మాటలు వినేసి రివర్సైన రిషి, వసు సేవలో తరిస్తోన్న ఈగోమాస్టర్!
రాజ్: పానీ పూరి వల్ల మాత్రమే కాదు పాన్ వల్ల కూడ ఆడవాళ్ళ నోరు మూయించివచ్చని అర్థం అయ్యింది
కావ్య: మీరు నాకు మంచి పాన్ కట్టించారు కదా మీకోసం నేను కూడా ఒక అద్భుతమైన మసాలా పాన్ కట్టిస్తాను అని పాన్ రెడీ చేస్తుంది. అందులో రాజ్ చూడకుండా కాస్త జరదా వేస్తుంది. లోపల పాటలు పెట్టుకుని రాజ్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది తినేసరికి రాజ్ కి తల తిరుగుతుంది. ఏంటి పాన్ ఇలా ఉంది ఏం వేశావని డౌట్ గా అడుగుతాడు. ఏం వేస్తే ఏముంది నమిలేయండి అని ఎంకరేజ్ చేస్తుంది. ఇద్దరూ కలిసి పాటలు పెట్టుకుని ఫుల్ గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడే పోలీసులు షాపు దగ్గరకి వస్తారు. షటర్ ఓపెన్ చేయగానే రాజ్ వాళ్ళు పోలీసులని చూసి షాక్ అవుతారు.
రాజ్: మేం దొంగలం కాదు అని చెప్తున్నా పోలీసులకి అర్థం కాదు
కావ్య: జరదా పాన్ తినేసరికి నాలుక మందం అయ్యింది మేం దొంగలం కాదు
ఓనర్: లోపల ఒకటి రెండు అని డబ్బులు లెక్కపెడుతున్నారు
రాజ్ నాలుక మందంతో మాట్లాడుతూ ఉండేసరికి అది తగ్గడం కోసం ఏదో ఒకటి చేయమని ఎస్సై అంటాడు. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఫుల్ కామెడీగా ఉంటుంది. ఈయన ఎవరో తెలుసా అని కావ్య చెప్పబోతుంటే ప్లీజ్ నా చరిత్ర చెప్పకు ఇంట్లో తెలిస్తే చండాలంగా ఉంటుందని ఆపుతాడు.
ఎస్సై: మరి ఎవరు మీరు నాటకాలు ఆడుతున్నారా?
Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!
కావ్య: నాకు కిళ్ళీ కావాలని అడిగితే మా ఆయన తీసుకొచ్చారు షాపులోకి వచ్చి కిళ్ళీ కట్టుకుని తిన్నాం
తరువాయి భాగంలో..
రాహుల్ లాయర్ కి ఫోన్ చేసి వెంటనే మైఖేల్ కి ఎలాగైనా బెయిల్ రావాలని డబ్బులు ఇస్తానని అంటాడు. వెంటనే గదిలోకి వచ్చి కొన్ని నగలు తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని కిందకి వస్తాడు. రాహుల్ చేతిలో బ్యాగ్ చూసి ఏంటి అదని రాజ్ అడుగుతాడు. అందులో ఏముందో చూడటం కోసం ప్రకాశం దాన్ని ఓపెన్ చేయబోతుంటే పొరపాటున చెయ్యి జారీ అందులో ఉన్న నగలన్నీ కిందపడిపోతాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇవన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావని రాజ్ నిలదీస్తాడు.