అన్వేషించండి

Guppedantha Manasu october 18th: శైలేంద్ర మాటలు వినేసి రివర్సైన రిషి, వసు సేవలో తరిస్తోన్న ఈగోమాస్టర్!

Guppedantha Manasu Today Episode: కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు కొనసాగుతున్నాయి. జగతి చనిపోయిన తర్వాత మహేంద్రతో కలసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు రిషి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంతమనసు అక్టోబరు 18 ఎపిసోడ్
వసుధారకి ఎండీ సీటు అప్పగించేసి రిషి వెళ్లిపోతాడు.. ఆ తర్వాత అక్కడున్న హార్ట్ బొమ్మని తీసి ఎండీ సీట్లో పెట్టి ఆ పక్కనే మరో ఛైర్ వేసుకుని కూర్చుంటుంది. నేను మీ స్థానంలో కూర్చోలేను..మీ పక్కనే కూర్చుంటాను అనుకుంటుంది...

దేవయాని-శైలేంద్ర రగిలిపోతుంటారు. దేవయాని మరింత ఫైర్ అవుతుంటే..శైలేంద్ర మాత్రం ధీమాగా ఉంటాడు. కచ్చితంగా మనం అనుకున్నవి జరుగుతుందని చెబుతాడు.. 
దేవయాని: జగతిని చంపేసినా సీటు దక్కలేదు..నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ లో వసుధార కూర్చుంటే కడుపు రగిలిపోతోంది
శైలేంద్ర: నేను చేయాల్సింది చేస్తాను... తొందర్లోనే తాను ఎండీ సీటుకి అర్హురాలు కాదని తేలిపోతుందని అంటాడు
ఇంతలో అక్కడకు వచ్చిన రిషి..ఎవరు అన్నయ్యా అంటూ ఎంట్రీ ఇస్తాడు..నువ్వు వసుధార గురించే కదా మాట్లాడేది అని అంటాడు..
శైలేంద్ర: వసుధారకి తెలివితేటలు ఉండొచ్చు కానీ సహనం ఉండాలి, కష్టాన్ని ఎదుర్కొనే తత్వం ఉండాలి..ఇప్పుడు వసుధార తట్టుకోగలదా. నీకు పిన్నికి ఉన్న సమర్థత తనకి ఎక్కడుంది..తను పొరపాటు చేస్తే కాలేజీ పతనం అవుతుందేమో అని..ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పతనం అవుతుందనే ఆలోచిస్తున్నాను కానీ ఇంకే ఉద్దేశం లేదు
రిషి:తను వయసులో చిన్నది కావొచ్చు కానీ ఇలాంటివి హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంది.. వయసుని బట్టి కెపాసిటీని అంచనా వేయలేం. నైనా జైశ్వాల్, కోనేరు హంపి..ఇలా ఎంతోమంది అమ్మాయిలు చిన్న వయసులోనే మంచి విజయాలు సాధించారు. ఓ టీచర్ కి తన స్టూడెంట్ కెపాసిటీ తెలుస్తుంది..ఓ లెక్చరర్ కి తన స్టూడెంట్ గురించి తెలుస్తుంది, తనతో కలసి పనిచేసిన లెక్చరర్ గా చెబుతున్నాను.. తను వందశాతం పర్ ఫెక్ట్ ఎండీ సీటుకి..
దేవయాని: రిషికి అంత నమ్మకం ఉన్నప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడతావు. కొన్నాళ్లు గడిస్తే తన గురించి తెలిసి పోతుంది కదా 
శైలేంద్ర: నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతానని తెలుసుకదా..
రిషి: ఓపెన్ గా మాట్లాడుతానని ఇక్కడికి వచ్చి ఎందుకు అక్కడే మాట్లాడి ఉండాల్సింది. అయినా వసుధార నా భార్య, ఇంటి కోడలు అని అక్కడ కూర్చోబెట్టలేదు.. ఈ విషయం మినిస్టర్ గారికి చెప్పాను ఆయన కూడా వసుధారే సమర్థురాలని చెప్పారు అందుకే అక్కడ కూర్చోబెట్టాను.. తనని సపోర్ట్ చేద్దాం
అలాగే రిషి అంటారు శైలేంద్ర, దేవయాని... రిషి వెళ్లిపోతాడు...

Also Read: కిచెన్లో ముచ్చట్లు, కాలేజీలో బాధ్యతలు - బలపడిన రిషిధార బంధం!

వసుధార రూమ్ లోకి వస్తాడు శైలేంద్ర, దేవయాని... వాళ్లని పట్టించుకోకుండా ఫైల్ చూసుకుంటూ ఉంటుంది..
దేవయాని: కూర్చోమని కూడా అనవా..మేం నీ క్యాబిన్లోకి రాకూడదా
వసు: ఏం పనిమీద వచ్చారు..
దేవయాని: చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు 
శైలేంద్ర: ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కాలేజీని చూసుకోగలవా, చాలా బాధ్యతలు ఉంటాయి.నీకు కష్టంగా అనిపించినప్పుడు కచ్చితంగా నా హెల్ప్ అడగొచ్చు
దేవయాని: నువ్వు ఒక్కదానివే చూసుకుంటావా మా హెల్ప్ కావాలా
వసు: రిషి సార్ దీన్ని యజ్ఞం అన్నారు.యజ్ఞం అనేది దుష్ట శక్తులను దూరం చేయడానికి చేస్తారు..అలాంటి దుష్ట శక్తుల హెల్ప్ ఎలా తీసుకుంటాం
దేవయాని: నువ్వు ప్రతీది రెండు రకాలుగా మాట్లాడుతున్నావ్
వసు: మీరు రెండో రకంగా కనిపిస్తోంది...అయినా మీరు ఎందుకు వచ్చావ్...నేను ఎండీ బాధ్యతలు చేపడుతున్నానని వచ్చారు సైన్ చేశారు.. ఆ పని అయింది కదా వెళ్లండి...వెళ్లి ఇల్లు చూసుకోండి... రిలాక్స్ అవండి..మీకు ఏజ్ కూడా అయిపోతోంది కదా..మీరిక్కడకు రావాల్సిన అవసరం లేదు.. సార్ మేడంగారు ఇల్లు చూసుకుంటారు..మీరేమో మేడంగారిని చూసుకోండి..మీరిక్కడ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు
శైలేంద్ర: తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా
వసు: మీ అంతరంగం తెలిసి మాట్లాడుతున్నాను..రిషి సార్ నాపై ఉంచిన నమ్మకమే ఈ సీట్లో కూర్చోబెట్టింది..
శైలేంద్ర: నిన్ను ఆపడం కష్టం కాదు..
వసు: ఏం చేస్తారో చేసుకోండి..రోడ్డు మీద జులాయిగా తిరిగే పోకిరీలు కూడా మీలాగే వార్నింగ్ లు ఇస్తుంటారు..వాళ్లకి ఎలా బుధ్ది చెప్పాలో నాకు తెలుసు
శైలేంద్ర: జింక కథ చెప్పి వసుధారని బెదిరించాలి చూస్తాడు...జింక ఏ కొమ్ములు చూసుకుని మురిసిపోయిందో ఆ కొమ్ములే ప్రాణాలు తీసేందుకు కారణం అయ్యాయి.. నీ పరిస్థితి  కూడా అంతే..
వసు: కొమ్ములు చూసుకుని మురిసిపోయే జింకకి..పంజా పవర్ చూసుకునే పులికి తేడా ఉంది అది తెలసుకోండి
ఎండీగారూ అని శైలేంద్ర అనడంతో..మీరు అలా పిలవకండి కంపరంగా ఉంది అంటుంది.. ఇక్కడి నుంచి వెళ్లండని చెప్పేస్తుంది..

Also Read: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషి కుటుంబం - దేవయాని మీద శైలేంద్ర ఫైర్

వసుధార ఇంట్లో సోఫాలో నిద్రపోతుంది..చలికి వణుకుతుంటుంది. నిద్రలేపేందుకు వెళతాడు రిషి. చేయి పట్టుకుని నిద్రపోతుంటుంది. అప్పుడు రిషి ఎత్తుకుని తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెడతాడు...(బ్యాంగ్రౌండ్లో ఉప్పెనలో జలజలపాతం నువ్వు సాంగ్)... బెడ్ పై పడుకోగానే ఠక్కున లేచి కూర్చుంటుంది...ఇక్కడికి వచ్చానేంటని అడుగుతుంది. సోఫాలో నిద్రపోయావు చలిగా ఉందని ఇక్కడికి తీసుకొచ్చానని చెబుతాడు
వసు: మీరు నాకు సేవ చేయడం నచ్చదు
రిషి: అనాధిగా భార్యలే సేవలు చేస్తున్నారు.. ఇప్పుడు భర్తలకు ఆ అవకాశం ఇవ్వండి
వసు: మీరిలా చేస్తే నాకు కోపంగా ఉంటుంది
రిషి: కోప్పడు..కోపంలో కూడా అందంగానే ఉంటారు
ఇద్దరూ అందంగా పోట్లాడుకుంటూ ఉంటారు.. ఇంతలో మహేంద్ర గట్టిగా అరుస్తాడు.. వెళ్లి చూస్తే మంచంపైనుంచి పడిపోయి ఉంటాడు..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Tadipatri: తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
తాడిపత్రిలో తగ్గిన పొలిటికల్ హీట్- తొలిసారి ఇవాళ నియోజకవర్గానికి రానున్న ఎమ్మెల్యే
Inter First Year Supplementary Results: నేడే ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయం ఇదే
నేడే ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయం ఇదే
Agricultural Loan: రైతులకు పావలా వడ్డీకే రుణం - లక్షల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
రైతులకు పావలా వడ్డీకే రుణం - లక్షల రూపాయలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం
Embed widget