అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 19th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ అరెస్ట్! భద్రావతి వర్సెస్ వేదవతి! రాజీకి వస్తారా!

Illu Illalu Pillalu Serial Today Episode March 19th విశ్వక్‌ని పోలీసులు అరెస్ట్ చేయడం, భద్రావతి వేదవతి గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode: రామరాజు, వేదవతిలు నర్మద, ప్రేమల్ని తిట్టి వల్లీని పొగడటంతో వల్లీ పొంగిపోతుంది. ప్రేమ గదిలోకి వెళ్లి  బాధ పడితే నర్మద పండగ పూట ఎందుకు ఇలా ఉన్నావ్ అని సంతోషంగా ఉండాలి అంటుంది. నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. అబద్ధాలు తీపిగా ఉంటాయి.. నిజాలు తెలిసినప్పుడు ఎవరు ఏంటో తెలుస్తుంది అని అంటుంది. ఇంతో వల్లీ వచ్చి ఇక నుంచి అయినా పద్ధతిగా ఉండు ప్రేమ అని అంటుంది. 

ప్రేమ కోపంగా దాని సంగతి చెప్తా ఎగిరెగిరి పడుతుందని అంటే నర్మద ఆపి సాగర్ ఉద్యోగం విషయం.. ఇప్పుడు ఈ విషయం ఎలా బయట పడ్డాయో అన్నీ తెలుస్తాయి. అప్పుడు ఎగిరెగిరి పడిన వాళ్ల సంగతి అయిపోతుందని అంటుంది. ఇక రేవతి అందరికీ ఉగాది పచ్చడి పంచుతుంది. శారద కూడా వస్తుందని బామ్మ చెప్పడంతో అమ్మ వస్తుందా అని భద్రావతి చాలా సంబర పడిపోతుంది. ఇంతలో విశ్వక్‌ని తన స్నేహితులు మోసుకుంటూ వెళ్లడం వల్లీ చూసి ఏమైందని అనుకుంటుంది. భద్రావతి వాళ్లు చూసి షాక్ అయి ఏమైందని అడుగుతారు. ఎవర్నా నా కొడుకు మీద చేయి వేసింది అని సేనాపతి అడిగితే రామరాజు కొట్టాడని విశ్వక్ మొత్తం చెప్తాడు.

భద్రావతి ఫుల్ కోపంతో నా మేనల్లుడి మీద చేయి వేయడానికి వాడికి ఎంత ధైర్యంరా అని విశ్వక్‌ని తీసుకెళ్తుంది. రామరాజు ఇంటి గేట్ తన్ని రామరాజుని కేకలేసి పిలుస్తుంది. రామరాజు బయటకు వచ్చి ఏంటి పండగ పూట ఇంటి ముందు అడుక్కునేవాడిలా ఇలా అరుస్తున్నావ్ అంటాడు. నా మేనల్లుడినే కొడతావా అంటే ఏమైందని వేదవతి అడిగితే తిరుపతి మొత్తం చెప్తాడు. రామరాజు సేనాపతితో రాత్రి నా కొడుకు నన్ను ఆపకపోయి ఉంటే నువ్వు ఈ పాటికి నీ కొడుకు పాడె మోసేవాడివిరా.. ఇంకాసేపు వాడు ఇక్కడే ఉంటే అదే అవుతుంది తీసుకుపోరా అంటాడు. భద్రావతి కోపంగా ఏంట్రా నువ్వు కొడితే కొట్టించుకోవడానికి.. చెప్తే వినడానికి ఇక్కడ ఎవరూ లేరు.. పోలీసులకు ఫోన్ చేయరా సేనా విశ్వకి పడిన దెబ్బలకు మరో నాలుగు ఎక్కువ ఈ రామరాజుకి పడాలి అని భద్రావతి అంటుంది. 

ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు. భద్రావతి, సేనాపతిలు రామరాజుని అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ చేయండి అని అంటుంది. ఎస్‌ఐ మాకు అంతా తెలుసు అని విశ్వక్‌ని అరెస్ట్ చేయమని చెప్తాడు. అదేంటి అని భద్రావతి అడిగితే మీ మేనల్లుడి మీద కేసు పెట్టారని అంటారు. ఎవరు పెట్టారు అని అడిగితే అప్పుడే అమూల్య, ధీరజ్ అక్కడికి వస్తారు. ధీరజ్ వచ్చి భద్రావతి బాధితురాలే కేసు పెట్టింది.. ఎస్‌ఐ గారు ఈ బండోడిని తీసుకెళ్లి బండకేసి బాధండి.. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లాలి అన్నా భయపడాలి అని అంటాడు. విశ్వక్ అమూల్య దగ్గరకు వచ్చి ఏయ్ అమూల్య నా మీదే కేసు పెడతావా నీ అంతు చూస్తా అని అంటే ఏంట్రా నువ్వు చూసేది అని వేదవతి విశ్వక్‌ని లాగిపెట్టి కొడుతుంది. దాంతో భద్రావతి వచ్చి ఏయ్ వేదవతి అని అరుస్తుంది. దాంతో వేదవతి అక్కని ఏయ్ భద్రావతి అక్కడితో ఆగు.. నా కూతురి జోలికి వస్తే అక్కవి అని కూడా చూడను అని అంటుంది. 

పోలీసులు విశ్వక్‌ని తీసుకెళ్తారు. భద్రావతి, రేవతి వాళ్లు విశ్వక్ విశ్వక్ అని వెంట పడతారు. రేవతి ప్రేమ దగ్గరకు వెళ్లి ఏదో ఒకటి చేయవే అని అంటుంది. దానికి ప్రేమ నా చేతిలో ఏం ఉంది అమ్మ.. వాడు చేతులారా చేసిన దానికే కదా సంకెళ్లు పడ్డాయి అని అంటుంది. నా కొడుకుని అరెస్ట్ చేయించావ్ కదా నిన్ను వదలను రామరాజు అని సేనాపతి అంటే.. చెడిపోయిన కొడుకునే దారిలో పెట్టుకోలేవు నువ్వేంట్రా నాకు చెప్తావ్ అని రామరాజు అంటాడు. భద్రావతి రామరాజుతో నీ అంతు చూస్తారా అని అంటే ధీరజ్ వచ్చి మా నాన్నని డైరెక్ట్‌గా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేశారు..ఇప్పుడు మా నాన్నకి తోడుగా కొడుకులు మేం ఉన్నాం.. ఏం చేసుకుంటారో చేసుకో అని అంటాడు. భద్రావతి వాళ్లు వెళ్లిపోతుంటే పిలిచి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్తాడు. 

విశ్వక్ పోలీస్ స్టేషన్‌లో తన పేరు చెప్తే నా పని అయిపోతుందని శ్రీవల్లి కంగారు పడి తల్లికి విషయం చెప్పాలి అనుకుంటుంది. ఇక విశ్వక్‌ని పోలీసులు జైలులో వేస్తే నేనేం తప్పు చేయలేదు అని విశ్వక్ అరుస్తాడు. భద్రావతి పోలీస్ స్టేషన్‌కి వెళ్లి మాకు వాళ్లకి గొడవలు ఉన్నాయని ఊరంతా తెలుసు.. మేం ఏంటో మా స్థాయి ఏంటో తెలిసి కూడా ఇలా అరెస్ట్ చేస్తారా అని అడుగుతుంది. బాధితురాలే స్వయంగా వచ్చి కేసు పెట్టింది.. ఇది మామూలు కేసు కాదు.. కిడ్నాప్ కేసు మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కోర్టులో మాట్లాడుకోండి అని అంటారు. లాయర్ బెయిల్ కోసం వచ్చి కేసు గురించి తెలుసుకొని ఎస్‌ఐతో మాట్లాడి.. బెయిల్ రావడం కష్టం అని భద్రావతి వాళ్లతో చెప్తారు. కేవలం రామరాజు వాళ్లతో రాజీ పడితే విశ్వక్‌ని వదిలేస్తారు అని అంటాడు. పనోడితో ఈ భద్రావతి రాజీ పడటం ఏంటి.. అది జరగదు అని భద్రావతి అంటుంది. విశ్వక్‌ దగ్గరకు వెళ్లి నిన్ను నేను బయటకు తీసుకొస్తా అని చెప్పి వెళ్లిపోతుంది. 

విశ్వక్ కోపంగా ఓసేయ్ అమూల్య నీ సంగతి బయటకు వచ్చాక చెప్తా అని అనుకుంటాడు. ఇంటి ఆడపిల్లని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తావా అని ధీరజ్‌ని వేదవతి అడుగుతుంది. నా చెల్లి జీవితం నాశనం చేయాలి అనుకున్న వాడిని ఊరికే వదిలేయాలా.. మామూలుగా అయితే వాడిని చంపేయాలి కానీ ఈ శిక్ష కరెక్టే అనిపించింది అంటాడు. వేదవతి ధీరజ్‌ని తిడితే రామరాజు ఆపి చెల్లి విషయంలో వాడు చేసింది కరెక్టే. వాడు తీసుకున్న నిర్ణయం నూటికి నూరు పాళ్లు కరెక్ట్ అని అంటుంది. ఇంతలో శారద వచ్చి కరెక్ట్ కాదు అల్లుడు గారు అని అంటుంది. చందు వచ్చి ఏంటండి మీ మనవడని సమర్దిస్తున్నారా.. అని అడుగుతాడు. నేను మీ నాన్నతో మాట్లాడటానికి వచ్చా కాసేపు మీరు ఎవరూ మాట్లాడొద్దు అని శారద అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget