Brahmamudi November 3rd : కావ్యపై ద్వేషం పెంచుకున్న రాజ్ - స్వప్నకు వార్నింగ్ ఇచ్చిన కావ్య
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్వప్న కోర్టుకు పోతానంటే తనకు వ్యతిరేకంగా కావ్య కోర్టులో సాక్ష్యం చెప్తానని బెదిరిస్తుంది.
Brahmamudi November 3rd Episode :బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారుతోంది. స్వప్న కోర్టుకు పోతానంటే తనకు వ్యతిరేకంగా కావ్య కోర్టులో సాక్ష్యం చెబుతాననడంతో ఇవాళ్టి ఎపిసోడ్ మొదలవుతుంది.
స్వప్న : నా విశ్వరూపం ఏంటో ఇప్పటి నుంచి ఇంట్లో వాళ్లకు చూపిప్తాను.
కావ్య: మన ఇంటిపై మనం పగలు ద్వేషాలు పెంచుకోవడం కాదు ఇది మన ఇల్లు మనం జీవితాంతం బతికే ఇల్లు.. బుద్దిగా ఉండు.. కోర్టుకు పోతానని ఇంటి పరువు తీస్తే.. కోర్టులో నీకు వ్యతిరేకంగా నేనే సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది జాగ్రత్త.
అని కావ్య వెళ్లిపోతుంది. మెట్ల మీద కూర్చున్న కనకం ఆమె భర్త ఆలోచిస్తూ ఉంటారు.
కనకం : అసలు కళ్లముందు జరిగింది నిజమా? అబద్దమా? నమ్మలేకపోతున్నాను. కడుపు ఉన్నట్టు అబద్దం చెప్పడమే పెద్ద విషయం అంటే దాన్ని సీమంతం వరకు తీసుకొచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పక్కనే ఉన్న నాకే అనుమానం రానంతగా నటించింది.
కనకం భర్త: నువ్వు మాత్రం ఏం చేస్తావ్ కనకం. కూతురు మరీ ఇంత దిగజారి ప్రవర్తిస్తుందని ఏ తల్లి అనుకుంటుంది చెప్పు
కనకం: అది ఎందుకు మరీ ఇంతలా దిగజారిపోయింది. మనం దానికి ఎం తక్కువ చేశామయ్య, కావ్యని అప్పుని ఎలా పెంచామో అలానే కదా పెంచాము. మరి ఎందుకు ఇలా తయారయ్యింది. నిజం చెప్పాలంటే దాన్నే ఇంకా మంచిగా చూసుకున్నాను కదా.
కనకం భర్త: నా బాధ అది కాదు కనకం రేపు పెద్దాయన పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని కంగారుగా ఉంది. ఒకవేళ ఇంట్లో అందరూ కలిసి ఇద్దరూ వెళ్లిపోవాలని అంటే పెద్దాయన కూడా దానికి తల వంచక తప్పదు కదా
అనగానే అలా ఏం జరగదు నువ్వేం భయపడకు అంటుంది కనకం. భయం కాదు కానీ స్వప్న ఇంట్లో ఉన్నంత వరకు కావ్యను సుఖంగా ఉండనివ్వదని చెప్పి వెళ్లిపోతాడు. స్వప్నను ఇంట్లో ఉండనివ్వకూడదని కనకం డిసైడ్ అవుతుంది.
రాజ్ కావ్యను కోపంగా చూస్తూ..
రాజ్: నువ్వు అబద్దం చెప్తావని మా అత్త చెప్తే నేను నమ్మలేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అబద్దం చెప్పవని నేను బావించాను. కానీ మొట్ట మొదటిసారి నీ అసలు స్వరూపం తెలిసింది. ముసుగు వేసుకుని పెళ్లి చేసుకున్న ఓ మోసగత్తె నుంచి నేను నీతిని నిజాయితీని ఆశించడం ఎంత పెద్ద తప్పో నాకు అర్థం అయింది. నటించడం నీకు వెన్నతో పెట్టిన విద్య. నమ్మించడం నీకు పుట్టుకతో అబ్బిన నైపుణ్యం. ఇప్పుడిప్పుడే మెత్తపడుతున్న మనసుకు నువ్వు ఎంత పెద్ద గాయం చేశావో తెలుసా? ఒక అబద్దం కోసం నా కుటుంబాన్ని మోసం చేశావు. అదే అబద్దం కోసం నిన్ను నువ్వే మోసం చేసుకున్నావ్. ఈ క్షణం వరకు నీ మీద కోపం మాత్రమే ఉండేది. ఈ రోజు నుంచి అది ద్వేషంగా మారిపోయింది.
అనగానే కావ్య బాధపడుతూ నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటూ ఇక్కడే ఉండిపోయాను. చివరికి నన్ను బయటికి గెంటివేసినా ఈ గడప దాటకుండా ఉన్నానంటే కారణం నా అక్క కాపురం, నా కాపురం నిలబెట్టుకోవడానికే అని చెప్తుంది కావ్య. నువ్వెన్ని చెప్పిన నీ మాటలు నమ్మను అంటూ కరాకండిగా చెప్తేస్తాడు రాజ్. మీరు కూడా తాతయ్య కోసం నాతో ప్రేమగా ఉన్నట్లు నటించలేదా? మీరు మీ తాతయ్య కోసం నాటకం ఆడొచ్చు కానీ నేను మా అక్క కాపురం కోసం అబద్దం చెబితే తప్పా అని కావ్య నిలదీస్తుంది.
రాజ్ : నిజమే నేను తాతయ్య కోసం నాటకం ఆడాను. కానీ నీ వల్ల ఇప్పుడు పాత స్వరాజ్ గా మారిపోయాను.
అంటూ రాజ్ కోపంగా వెళ్లిపోతాడు. కావ్య ఏడుస్తూ.. పాత జ్జాపకాలను గుర్తు చేసుకుంటుంది. అపర్ణ, సుభాష్ ఆలోచిస్తూ ఉంటారు.
అపర్ణ : ఇప్పటికైనా మీకు అర్థం అయిందా ఆ కావ్య ఎలాంటిదో..? ఇన్నాళ్లు తెగ వెనకేసుకొచ్చారు కదా ఇప్పుడేమంటారు. కావ్యే కాదు ఆ కుంటుంబం మొత్తం అంతే అన్నా ఒక్కరైనా నా మాట విన్నారా? పైగా నువ్వు అత్తలా ఆలోచిస్తున్నావ్ అమ్మలా ఆలోచించమని స్టేట్‌మెంట్లు పాస్ చేశారు కదా మరిప్పుడు మీకు సమాధానం దొరికిందా? పెళ్లి దగ్గర నుంచి ఎన్ని నాటకాలు ఆడుతూ వచ్చింది. అందరి మీద ప్రేమ ఉన్నట్లు ఎంత నటించింది.
Also Read: మల్లెపూల ముచ్చట్లలో మునిగితేలిన రిషిధార , శైలేంద్రని అమాయకంగా చంపేస్తోన్న ధరణి!
సుభాష్ : అపర్ణ అవకాశం దొరికింది కదా అని మరీ అంత తక్కువ చేసి మాట్లాడకు.
అపర్ణ : ఏంటి ఇంకా మీరు కావ్యనే సపోర్టు చేస్తున్నారా?
సుభాష్ : అవును కావ్య చేసింది నాకు తప్పుగా అనిపించడం లేదు.
అపర్ణ : సరిపోయింది. గుర్రానికి కళ్లెం వేశాక చుట్టూ ఉన్న ప్రపంచం మూసుకుపోయినట్లు మీకు కావ్య కోడలుగా వచ్చిన తర్వాత ప్రపంచాన్ని చూడ్డం మానేసినట్లున్నారు.
అనగానే అక్క కోసం, అక్క భవిష్యత్తు కోసం అలా చేసిందనుకోవచ్చు కదా అంటూ సమర్థిస్తాడు సుభాష్. అయితే పెళ్లి అయిన తర్వాత నిజం చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు. మనకు చెప్పలేదు సరే కనీసం తన భర్త రాజ్‌కు అయిన నిజం చెప్పాలి కదా! ఎందుకు చెప్పలేదు. అర్థం చేసుకోండి అని అపర్ణ చెప్పగానే సుభాష్ ఆలోచనలో పడిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.