News
News
వీడియోలు ఆటలు
X

Brahmamudi May 23rd: స్వప్నని పెళ్లిచేసుకుంటానని వచ్చిన అరుణ్- రాహుల్ కి వెన్నెలనిచ్చి పెళ్లి చేస్తానన్న అరుంధతి

రాహుల్ స్వప్నని వదిలించుకుని ఆస్తిపరురాలైన వెన్నెలని పెళ్లి చేసుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.

FOLLOW US: 
Share:

రాహుల్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు తీసుకుని ఖర్చు చేశాడని రాజ్ నిలదీస్తాడు. కావ్య మాటలు విని నన్ను నిలదీస్తున్నావా అని పుల్ల పెట్టేందుకు చూస్తాడు. నువ్వు డబ్బు తీసుకున్నట్టు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అందుకే అడిగానని చెప్తాడు. నేను ఇంతక ముందు ఇంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా కానీ ఎప్పుడు అడగలేదు కానీ ఇప్పుడు ఈవిడ మాటలు విని నన్ను అనుమానిస్తున్నావ్ థాంక్స్ చాలా మారిపోయావ్ అనేసి సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. అడిగిన దానికి చెప్పిన దానికి సంబంధమే లేదని రాజ్ అనుకుంటాడు. ఉంది తప్పు చేసిన వాడు తప్పించుకున్నాడు తన తప్పుని దాచాడని కావ్య అంటుంది. ఇది మా బిజినెస్ కి సంబంధించిన విషయం జోక్యం చేసుకోవద్దని కావ్యని తిడతాడు.

Also Read: నిజం చెప్పేసిన చిత్ర- అభిమన్యు అరెస్ట్, ఆగిపోయిన మాళవిక పెళ్లి

అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. కావ్య వదిన మీ అక్క స్వప్నతో మాట్లాడాలంట ఫోన్ ఇవ్వమని చెప్తాడు. రాహుల్ నిన్ను అని కావ్య అంటుంటే చీట్ చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడా ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చి గొడవ చేయాలా? నువ్వు నాకు ఫోన్ చేసి ఇదే మాట చెప్తాడని ఇందాకే రాహుల్ ఫోన్ చేసి చెప్పాడని స్వప్న అంటుంది. అతను నిన్ను పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నాడని కావ్య అంటుంది. ఇద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. అపర్ణ స్నేహితురాలు అరుంధతి, తన కూతురు వెన్నెల ఎంట్రీ ఇస్తారు. వాళ్ళని చూసి అపర్ణ చాలా సంతోషిస్తుంది. ఇంట్లో వాళ్ళందరినీ అరుంధతికి పరిచయం చేస్తుంది. ఆ అమ్మాయిని బుట్టలో వేసుకో తను నీ సొంతం అయితే కోట్ల ఆస్తికి దొరుకుతుందని రుద్రాణి రాహుల్ కి చెప్తుంది. కావ్య టీ తీసుకొచ్చి అరుంధతి వాళ్ళకి ఇస్తుంది.

ఇండియాలో ఇంత డీసెంట్ గా ఉండే సర్వెంట్ మేడ్ దొరకడం నీ అదృష్టమని అరుంధతి అంటుంది. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు. డబ్బులు ఇవ్వబోతుంటే అవసరం లేదని ఇది తన బాధ్యతని చెప్తుంది. రాజ్, ఇంద్రాదేవి నిజం చెప్పడానికి చూస్తుంటే అపర్ణ అడ్డుపడుతుంది. కావ్య లోపలికి వెళ్తుంటే రుద్రాణి తనని ఆపి తను సర్వెంట్ కాదు రాజ్ భార్య అని నిజం చెప్తుంది. ఎంత పోరాపాటు జరిగింది నేను సర్వెంట్ గా ట్రీట్ చేస్తుంటే నువ్వు మౌనంగా ఉంటావెంటని అరుంధతి అంటుంది. కావ్యకి సోరి చెప్తుంది. భార్యని పరాయి వాళ్ళు వచ్చి ఇన్సల్ట్ చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నావ్ ఇది కరెక్ట్ కాదని రాజ్ కి బుద్ది చెప్తుంది. దీంతో రాజ్ కోపంగా కిచెన్ లోకి వెళ్ళి తనని తిడతాడు. మంచి బట్టలు వేసుకోవచ్చు కదా అంటాడు. భర్తగా బాధ్యతగా ఏమైనా కొనిచ్చారా స్టేటస్ కోసం కొనిచ్చారని కావ్య అంటుంది.

Also Read: శ్రీనివాసరావుకి చీవాట్లు పెట్టిన మురారీ- భర్త ఊహల్లో తేలిపోతున్న కృష్ణ

మా రాజ్ సార్ ఇలాంటి చీరలు కట్టుకుంటుందా అనేసరికి షాపుకి తీసుకెళ్ళి కొనిచ్చారు. పెళ్ళాం పూర్ గా కింద పడుకోవాలి భర్త అని చెప్పుకోకూడదు. మీరు ప్రేమగా కొనిచ్చిన రోజే కట్టుకుంటానని చెప్తుంది. ప్రేమ నీమీద ఈ జన్మలో జరగదని అంటాడు. కావ్య చేతిని లాగబోయే సరికి స్టవ్ అన్ లో ఉండటంతో తన చెయ్యి కాలిపోతుంది. తనతో వాదులాడటం ధాన్యలక్ష్మి చూస్తుంది. కాల్చేశాడా అని తనకి మందు రాస్తుంది. నేనేం కావాలని కాల్చా నా నిజం చెప్పవే అంటాడు. ఇప్పుడు నేను నిజం చెప్తే గదిలో నాకు టార్చర్ చూపిస్తాడని రాజ్ ని ఇరికిస్తుంది. కనకం ఇంటికి స్వప్న ఫ్రెండ్ అరుణ్ వస్తాడు. ఐదేళ్లుగా తనని ప్రేమిస్తున్నాను, మీకేవారికీ అభ్యంతరం లేదంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. తొందరపాటులో చేసిన పనిని నేను అర్థం చేసుకున్నా అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. నేను ఎప్పుడూ నిన్ను ఆ దృష్టితో చూడలేదని స్వప్న అంటుంది.

Published at : 23 May 2023 08:51 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial May 23rd Episode

సంబంధిత కథనాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

Krishna Mukunda Murari June 2nd: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'

Krishna Mukunda Murari June 2nd: తన మనసులో కృష్ణకే స్థానమని తెగేసి చెప్పిన ముకుంద- బాధలో కూరుకుపోయిన 'కృష్ణ ముకుంద మురారీ'

Gruhalakshmi June 2nd: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం

Gruhalakshmi June 2nd: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం

Ennenno Janmalabandham June 2nd: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద

Ennenno Janmalabandham June 2nd: మాళవికని ఆనందంగా ఉంచమని యష్ దగ్గర మాట తీసుకున్న వేద

Brahmamudi June 2nd: రాహుల్ సంగతి తెలిసి షాకైన కనకం కుటుంబం- స్వప్న అడ్డు తొలగించుకోవాలన్న రుద్రాణి

Brahmamudi June 2nd: రాహుల్ సంగతి తెలిసి షాకైన కనకం కుటుంబం- స్వప్న అడ్డు తొలగించుకోవాలన్న రుద్రాణి

టాప్ స్టోరీస్

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !