Ennenno Janmalabandham May 23rd: నిజం చెప్పేసిన చిత్ర- అభిమన్యు అరెస్ట్, ఆగిపోయిన మాళవిక పెళ్లి
చిత్రని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని అభిమన్యు ట్రై చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
చిత్ర పెళ్లికి వచ్చిన రాజ్, కావ్యకి వేద బట్టలు పెట్టి ఆశీర్వదిస్తుంది. మీ పెళ్లి మేము ఎటూ చూడలేకపోయాము అందుకే మళ్ళీ మా ముందు దండలు మార్చుకోమని చెప్తారు. ఇద్దరూ సంతోషంగా ఒకరికొకరు దండలు మార్చుకుంటారు. తర్వాత స్వీట్ తినిపించుకుంటారు. మీ ఇద్దరూ కూడా మా అమ్మానాన్నలాగా ఎన్నెన్నో జన్మల బంధంగా ఉండాలని ఖుషి అంటుంది. ఇక వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు. పెళ్లికొడుకులతో పూజ చేయించిన తర్వాత పెళ్లి కూతుర్లని తీసుకురమ్మని చెప్తారు. చిత్ర డల్ గా మొహం పెట్టుకుని వస్తుంది. అదంతా వేద, యష్ గమనిస్తూనే ఉంటారు. చిత్ర కాసేపు కూడా వాడు నీ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు కానీ చివరకు తాళి కట్టేది మాత్రం నేనే కాబట్టి అడ్జస్ట్ అవుతున్నానని తనని బెదిరిస్తాడు. అదంతా వేద వాళ్ళు చూస్తూ ఉంటారు. ఏదో జరుగుతుంది వెంటనే అదేంటో తెలుసుకోవాలని అనుకుంటారు.
Also Read: శ్రీనివాసరావుకి చీవాట్లు పెట్టిన మురారీ- భర్త ఊహల్లో తేలిపోతున్న కృష్ణ
పూజ పూర్తయిందని బట్టలు పెట్టమని పంతులు చెప్తే చిత్ర వాళ్ళకి సులోచన వాళ్ళు పెడతారు. మాళవికకి మాలిని వాళ్ళతో బట్టలు పెట్టిస్తుంది వేద. పట్టుబట్టలు మార్చుకుని వస్తే బ్రహ్మముహూర్తానికి పెళ్లి జరిపించవచ్చని పంతులు చెప్తాడు. చిత్ర డల్ గా కూర్చుని ఉంటే వేద వస్తుంది. నిన్ను ఒకటి అడుగుతానని చెప్పి వేద చిత్ర చేతిని తన తల మీద పెట్టుకుని అభి నిన్ను ఏమైనా అంటున్నాడా అని అడుగుతుంది. బ్యాడ్ గా బిహేవ్ చేశాడా అంటే చేశాడని చెప్పి తర్వాత ఇప్పుడేమి లేడని కవర్ చేస్తుంది. వేద వెళ్లిపోతుంటే చిత్ర ఆపి నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలని చెప్తుంది. తనతో మాట్లాడుతూనే అలాగే నిద్రపోతుంది. అలిసిపోయినట్టు ఉందనుకుని వేద వెళ్ళిపోతుంది. తను వెళ్లిపోగానే చిత్ర లేచి సులోచన వాళ్ళ ఫోటో చూస్తూ ఏడుస్తుంది. నన్ను క్షమించండి మీకు ఎంతో ఇచ్చాను కానీ నేను మాత్రం మీకు కన్నీళ్ళు మిగిల్చి వెళ్తున్నాను ఏడుస్తుంది.
చిత్ర పాయిజన్ కోసం వెతుకుతుంటే వేద తీసుకొచ్చి దీనికోసమేనా వెతుకుతుందని అంటుంది. అప్పుడు చిత్ర అసలు ఏం జరిగిందో అభి చేసిన బ్లాక్ మెయిల్ గురించి మొత్తం చెప్తుంది. పంతులు పెళ్లి కొడుకు, కూతుర్లని తీసుకురమ్మని చెప్తాడు. వసంత్, మాళవిక వచ్చి పీటల మీద కూర్చుంటారు. అభిమన్యు ఎక్కడికి వెళ్ళాడు ఫోన్ కలవడం లేడని వేదని మాళవిక వేదని అడుగుతుంది. చూడలేదని చెప్తుంది. చిత్ర కూడా కనిపించలేదని సులోచన చెప్తుంది. అప్పుడే చిత్ర అభిమన్యు గదిలోకి భయం భయంగా వస్తుంది. ఈరోజుతో అభిమన్యు ఆట కట్టించాలని ఫోన్లో వీడియో ఆన్ చేసి పెడుతుంది. అభిమన్యు కనిపించకపోవడానికి కారణం వేదనే అని మాళవిక గోల చేస్తుంది. మీ అందరినీ చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, మీలో టెన్షన్ లేదు అభిమన్యు ఏమయ్యాడని వేదని నిలదీస్తుంది. మా పెళ్లిని చెడగొట్టాలని నాటకం ఆడుతున్నారు కదా అంటుంది.
Also Read: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర
అంత అవసరం తనకి లేదని చిత్ర కనిపించడం లేదు. నువ్వు అనుకున్నట్టు అభిమన్యు మంచి వాడు కాదు. నీకు నిజం తెలియడానికి కొద్ది సమయం మాత్రమే ఉంది వెయిట్ అండ్ వాచ్ అని వేద నమ్మకంగా చెప్తుంది. అభిమన్యు తాళి పట్టుకుని చిత్ర దగ్గరకి వస్తాడు. చివరి క్షణం వరకు నువ్వు రావని అనే అనుమానం ఉంది కానీ వచ్చావ్ అని తాళి కట్టేందుకు చూస్తాడు.