Guppedanta Manasu May 22nd: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర
Guppedantha Manasu May 22nd Update: శైలేంద్ర భూషణ్ ఎంట్రీతో గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
రిషి మీద పూల కుండీ పడబోతుంటే వసు వచ్చి కాపాడుతుంది. అది తానే చేయించానని శైలేంద్ర అనేసరికి జగతి ఏడుస్తుంది. ఎందుకు నీకు నా కొడుకు మీద ఈ పగ అంటే నా కంటే గొప్పగా ఎదిగాడు అది చాలదా? నీ కొడుకు నీకు గొప్పవాడిగా ఉన్నట్టే మా అమ్మ కూడా కోరుకుంటుందని శైలేంద్ర అంటాడు. ఈ విషయం గురించి మహేంద్రకి చెప్పాలని జగతి నిర్ణయించుకుంటుంది. ఇన్నాళ్ళూ నాకు అమ్మా అనే పిలుపు దూరం చేశావ్ ఇప్పుడు నా బిడ్డని కూడా దూరం చేస్తున్నవా అని బాధపడుతుంది. వసు రిషిని రూమ్ లోకి తీసుకొస్తుంది. థాంక్స్ వసుధార నువ్వు కాపాడకపోతే నేను హాస్పిటల్ లో ఉండేవాడినని అంటాడు. అంత అజాగ్రత్తగా ఎందుకు ఉన్నారని తిడుతుంది. మిమ్మల్ని చాలా చాలా తిట్టాలని అంటుంది. జగతి టెన్షన్ గా వచ్చి నీకు ఏం కాలేదు కదా నీకు ఏమైనా అయితే తట్టుకునే శక్తి తనకి లేదని బాధపడుతుంది.
Also Read: వెన్నెల ఎంట్రీ- కావ్యని పనిమనిషన్న అరుంధతి, స్వప్న కుట్ర తెలుసుకున్న కనకం
రిషి: మేడమ్ నాకు ఏం కాలేదు. ప్రతి మనిషి లైఫ్ లో ఇలాంటివి జరుగుతాయి
జగతి: నువ్వు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావ్ నేను భరించలేకపోతున్నా ఈ టైమ్ లో మహేంద్ర లేరు ఉండి ఉంటే ఎంత కంగారు పడేవాళ్ళు
రిషి: ఈ విషయం డాడ్, ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు టెన్షన్ పడతారు
మేడమ్ లోని తల్లి మనసు చాలా కంగారుపడుతుందని వసు మనసులో అనుకుంటుంది. ఇక నుంచి మీ వెంటే ఉంటానని వసు చెప్తుంది. ఒక్కసారికే ఇలా అంటే ఎలాగా అంటాడు. రిషి కంట్లో నలక పడితే వసు కంగారుపడిపోతూ ఖర్చిఫ్ తో ఊదుతుంది. మెడికల్ కాలేజ్ పనుల్లో రిషిధార మునిగిపోతారు. పేద వాళ్ళ కోసం డాక్టర్స్ చాలా సాయం చేస్తున్నారని వాళ్ళు పంపించిన డబ్బులు వేర్వేరు అకౌంట్స్ లో వేయమని రిషి మరీ మరీ చెప్తాడు. మన మీద నమ్మకంతో డొనేట్ చేస్తున్నారు వాళ్ళ నమ్మకం మనం పోగొట్టుకోకూడదని అంటాడు. బిల్డర్ కి అడ్వాన్స్ కావాలని మేనేజర్ వస్తాడు. తర్వాత ఇస్తానని చెప్పి పంపించేస్తాడు. శైలేంద్ర వచ్చి ఏమైందని చెప్పు డబ్బు ఎంత కావాలో ఇస్తానని అంటాడు. కానీ రిషి మాత్రం వద్దని చెప్తాడు.
రిషి టేబుల్ మీద ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ చెక్ ని శైలేంద్ర వాళ్ళు చూడకుండా దొంగిలిస్తాడు. దాన్ని బిల్డర్ సారధికి ఇచ్చి చెప్పింది చెప్పినట్టు చేయమని ప్లాన్ మిస్ అవకూడదని శైలేంద్ర అంటాడు. ఈ చెక్ తో రిషి పరువు గంగలో కలిసిపోవాలని చెప్తాడు. సారధి మినిస్టర్ దగ్గరకి వస్తాడు.
సారధి: డీబీఎస్టీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడుతుంది తనేనని చెప్తాడు. రిషి వ్యక్తిత్వం ఎలాంటిది సర్
Also Read: కథని మలుపు తిప్పేసిన యష్, వేద- అభి ప్లాన్ తుస్సు, చిత్ర పెళ్లి అయిపాయే
మినిస్టర్: రిషి చాలా మంచివాడు చిన్న వయసులోనే ఎదిగాడు. తన వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం, ఇప్పటి వరకు చిన్న తప్పు కూడా చేయలేదు
సారధి: రిషి తప్పు చేశాడు
మినిస్టర్: ఇక ఆపు ఎవరి దగ్గరకి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్
సారధి: నేను నిజమే చెప్తున్నా
మినిస్టర్: ఇంకొక్క మాట రిషి గురించి తప్పుగా మాట్లాడినా క్షమించను
సారధి: శైలేంద్ర ఇచ్చిన చెక్ చూపిస్తాడు మిషన్ ఎడ్యుకేషన్ చెక్ ఇచ్చాడు. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కి అడ్వాన్స్ గా.. ఇప్పుడు చెప్పండి రిషి తప్పు చేశాడంటే నమ్ముతారా
మినిస్టర్: నో నేను నమ్మను
సారధి: తను మెడికల్ కాలేజ్ చెక్ ఇస్తే తీసుకునే వాడిని కానీ మిషన్ ఎడ్యుకేషన్ చెక్ ఇచ్చాడు అందుకే ఈ విషయం మీ దాకా తీసుకొచ్చాను
ఈ విషయం వసుధారకి ఫోన్ చేసి అడుగుతానని కాల్ చేస్తాడు. మీ మీద అభియోగం వచ్చి అది నిజమో కాదో నువ్వే చెప్పాలని అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఫండ్స్ ని దారి మళ్లించి వేరే వాటికి ఉపయోగిస్తున్నారని అభియోగమని చెప్తాడు. రిషి వేరే పనిలో ఉన్నాడని వసు చెప్పేసరికి జగతిని తీసుకుని ఆఫీసుకి రమ్మని చెప్తాడు. శైలేంద్ర వసు మాటలు విని గట్టిగా అరుస్తాడు. ఎందుకు ఇలా చేశావ్ ఏ ఉద్దేశంతో ఇలా చేశావని నిలదీస్తాడు. రిషి ఎప్పుడు ఇలా చేయడు, నువ్వే కావాలని ఇలా చేశావ్ అంటాడు.