News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Brahmamudi June 10th: సోది పెట్టిన మైఖేల్- పెళ్లి కూతురు కిడ్నాప్, స్వప్నని కావ్య కాపాడుతుందా?

స్వప్న, రాహుల్ పెళ్లి ఫిక్స్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

మీనాక్షి నగలు స్వప్న వేసుకుని దర్శనమిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఈ నగలు వేసుకున్నావాని కనకం కోపంగా అడుగుతుంది. పెళ్లి కూతుర్ని ఆ మాత్రం కూడా ఉండకపోతే ఎలా అంటుంది. అయినా ఇవి ఓల్డ్ మోడల్ నగలు పెళ్లి అయిన తర్వాత ఎక్స్ క్లూజివ్ డిజైన్స్ నగలు మాయన తీసుకొచ్చి ఇస్తాడని బింకాలు పోతుంది. ఇక అందరూ కలిసి పెళ్లి జరిగే ఇంటికి బయల్దేరతారు. స్వప్నని కిడ్నాప్ చేయడానికి వెయిటర్స్ డ్రస్లో మైఖేల్ వాళ్ళు దుగ్గిరాల ఇంటికి వస్తారు. రాజ్ వాళ్ళని ఆపి వెయిటర్స్ ఆల్రెడీ వచ్చారు మరి మిమ్మల్ని ఎవరిని పిలిచారని అనేసరికి అందులో ఒకడు రాహుల్ అని చెప్పేస్తాడు. ఈవెంట్ మేనేజర్ కిరణ్ పంపించాడని మైఖేల్ కవర్ చేస్తాడు. ఫోన్ రావడంతో రాజ్ వెళ్ళిపోతాడు. ఈ కిడ్నాప్ వెనుక తను ఉన్న విషయం బయటకి రాకుండా చూసుకోవాలని రాహుల్ చెప్తాడు.

Also Read: రాజ్యలక్ష్మి మాటకి తలొంచిన దివ్య- లాస్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన భాగ్య

స్వప్న వాళ్ళు అప్పుడే కారులో ఇంటి ముందు దిగుతారు. మీడియా వాళ్ళు స్వప్నని ప్రశ్నలు వేయబోతుంటే కనకం మాట్లాడకుండా అడ్డుపడుతుంది. మీరు చేసిన అభియోగం వల్ల రాహుల్, వెన్నెల ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యిందా అని మీడియా వాళ్ళు అడుగుతారు. అది చూసి నేను సెలబ్రెటీని అయిపోయానని స్వప్న తెగ సంబరపడుతుంది. ఇప్పుడు అక్క మాట్లాడితే దుగ్గిరాల ఇంటి పరువు పోతుందని కావ్య హడావుడిగా బయటకి వచ్చి పెళ్లి కూతుర్ని రెడీ చేయాలని లాక్కుని వెళ్తుంది. వాళ్ళు నా ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఎందుకు తీసుకెళ్తున్నారని స్వప్న కుళ్ళుకుంటుంది. ఇంటికి వచ్చిన పెళ్లికూతురికి దిష్టి తీయమని అపర్ణ వచ్చి రుద్రాణికి చెప్తుంది. నువ్వే తీయి వదిన అంటుంది. ఇప్పుడు నువ్వు దిష్టి తీయకపోతే టెంట్ వేసి ధర్నా చేస్తుందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇప్పటికిప్పుడు హారతి అంటే ఎలా అనగానే మైఖేల్ గుమ్మడికాయ తీసుకొచ్చి ఇస్తాడు.

Also Read: కావ్యకి మెహందీ పెట్టిన రాజ్- స్వప్నని కిడ్నాప్ చేసేందుకు రౌడీ ప్రయత్నాలు

రుద్రాణి తనకి ఇష్టం లేకపోయినా తప్పక కోపంగా దిష్టి తీస్తుంది. ఏదో ఘనకార్యం సాధించి వచ్చినట్టు ఈ పుణ్య స్త్రీకి దిష్టి తీయాలా అని తిట్టుకుంటుంది. రసగుల్లా ఎలా ఉందంటూ కాసేపు బుర్ర పాడు చేస్తాడు మైఖేల్. తలనొప్పి పుట్టించేలా ఉంది ఈ ఎపిసోడ్. డెకరేషన్ దగ్గర కుండలకు రంగులు వేయడానికి కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు. కావ్య తన వాళ్ళకి సంతోషంగా మర్యాదలు చేస్తుంది. పెళ్లి చీరలు చూడటానికి రమ్మని పిలుస్తుంది. పేరుకే పెళ్లి కూతుర్ని పెత్తనం అంతా ఇదే చేస్తుందని తిడుతుంది. నువ్వు పేరుకే మనిషివి, నా దృష్టిలో కాదు. కావ్య కష్టపడి సాక్ష్యాలు సంపాదించి బయట పెట్టకపోతే గుడి ముందు అడుక్కోవడానికి కూడా పనికిరావని కనకం దెప్పిపొడుస్తుంది. ఇంకొకసారి కావ్యని పల్లెత్తు మాట అంటే చెంప పగిలిపోతుందని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఈ ఇంటి కోడలిని అయ్యాక ఇక వీళ్ళతో నాకేం పని పదో పరకో అడుక్కోవడానికి వస్తారు అప్పుడు చెప్తా వీళ్ళ పని అని స్వప్న తిట్టుకుంటుంది. స్వప్న అందం ముందు కూర్చుని సింగారించుకుంటుంటే మైఖేల్ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడానికి వెళతాడు. సరిగ్గా స్వప్న దగ్గరకి వెళ్ళే టైమ్ కి మీనాక్షి వచ్చి ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది.

Published at : 10 Jun 2023 08:39 AM (IST) Tags: manas Brahmamudi Serial Brahmamudi Serial Today Episode Brahmamudi Serial Written Update Brahmamudi Serial June 10th Episode

ఇవి కూడా చూడండి

Guppedanta Manasu october 4th: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!

Guppedanta Manasu october 4th: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్

Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో

Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్‌పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో

Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ

Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ

Bigg Boss Telugu 7: పవర్ అస్త్రాలు మటాష్, కెప్టెన్సీ టాస్క్ షురూ - ‘ఏం మనుషులు అయ్యా’ అంటూ శివాజీ ఆగ్రహం

Bigg Boss Telugu 7: పవర్ అస్త్రాలు మటాష్, కెప్టెన్సీ టాస్క్ షురూ - ‘ఏం మనుషులు అయ్యా’ అంటూ శివాజీ ఆగ్రహం

టాప్ స్టోరీస్

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Bandaru Satyanarayana: బండారు సత్యనారాయణకు బిగ్ రిలీఫ్, బెయిల్ మంజూరు చేసిన కోర్టు

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'