Brahmamudi August 3rd: 'బ్రహ్మముడి' సీరియల్: వాళ్ళని బురిడీ కొట్టించిన స్వప్న- డెడ్ లైన్ పెట్టి వార్నింగ్ ఇచ్చిన కావ్య
కావ్య రాజ్ కంపెనీలో డిజైనర్ గా పని చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కళ్యాణ్ కి ఒక అభిమాని లెటర్ రాస్తుంది. దాన్ని కావ్య తీసుకుని చదివి తీరాలని ఆట పట్టిస్తుంది. వద్దని ఇచ్చేయమని కళ్యాణ్ బతిమలాడుతూ వదిన అంటూ తన వెంట పడతాడు. కావ్య ఇల్లంతా తిరుగుతూ గోల గోల చేస్తుంది. ఈ లెటర్ చదవాలా అని ఇంట్లో పోలింగ్ పెడితే అందరూ చదివి తీరాల్సిందేనని అంటారు. ఇక మాటల మధ్యలో కళ్యాణ్ కావ్య చేతిలో నుంచి లెటర్ లాగేసుకుని పారిపోతాడు. గదిలోకి వెళ్ళి లెటర్ ఓపెన్ చేసి చదువుతాడు. ‘గోంగూర పచ్చడి, సుబ్బారావు, క్రికెట్ ప్లేయర్ అని ఏదేదో రాస్తుంది. నిన్ను వదలను నీడలా వెంటాడుతూనే ఉంటాను. ఫోటోలో భలే ముద్దు వస్తున్నావ్. అనుక్షణం నీ వెంటే ఉంటాను’ అని రాస్తుంది. పేరు రాయకుండా తన పేరు ఏంటో కనిపెట్టమని పజిల్ విసురుతుంది.
Also Read: అదిరిపోయిన ఎపిసోడ్.. మాళవిక అవుట్- వేద మమ్మీ దగ్గరే ఉంటానన్న ఆదిత్య
స్వప్నకి బాగా కడుపు నొప్పి రావడంతో ట్యాబ్లెట్స్ ఆన్ లైన్ లో ఆర్డర్ పెడుతుంది. కనకం డబ్బు కోసం చిట్టీల రంగమ్మ దగ్గరకి వస్తుంది. డబ్బులు కావాలని చిట్టీ వేస్తానని మొదటిది తనే వేస్తానని కనకం అడుగుతుంది. కానీ రంగమ్మ మాత్రం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలకు అప్పు ఆవేశపడుతుంటే కనకం ఆపుతుంది. మీరు తిండికి నీటికి గతిలేక ఏడుస్తున్నారు, ఇక నువ్వు డబ్బులు ఏం కడతావ్ అనేసి అవమానిస్తుంది. అప్పుడే రంగమ్మ మొగుడు వస్తే తను ఎవడితోనే సినిమాకు వచ్చిందని ఇరికిస్తుంది. స్వప్న ఆర్డర్ పెట్టిన ట్యాబ్లెట్స్ ఇంటి దగ్గరకి వస్తాయి. వాటిని తీసుకోవడం రుద్రాణి చూస్తుంది. గదిలోకి వచ్చి వెంటనే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. కావ్య డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇస్తున్న విషయం రాజ్ కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటుంది. కానీ మళ్ళీ మీటింగ్ లో ఉంటాడేమో అనుకుని మెసేజ్ చేస్తుంది. డబ్బులు మా నాన్నకి ఇవ్వాలని అనుకుంటున్నట్టు చెప్తుంది.
రాజ్: అది నీ డబ్బు నీ ఇష్టం. ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇంకొక విషయం నీ థాంక్స్ నాకు వద్దు.. నేనేం ఫ్రీగా ఇవ్వలేదు. నీ కష్టానికి రెమ్యూనరేషన్ ఇచ్చాను అంతే
కావ్య: మంచితనంలో కూడా మూర్ఖత్వం అంటే ఇదేనేమో. ముద్దు ముచ్చట కూడా తెలియని మొగుడు దొరికాడని ముద్దుగా తిట్టుకుంటుంది.
రుద్రాణి స్వప్న తీసుకొచ్చిన కవర్ ఏంటా అని గది వెతుకుతుంది. అందులో ఉన్న ట్యాబ్లెట్స్ చూసి షాక్ అవుతుంది. ఇది తెచ్చుకుంది ఏంటి సీక్రెట్ గా అంటే దీనికి ప్రెగ్నెన్సీ లేదా వెంటనే నిలదీయాలని అనుకుంటుంది. అప్పుడే రాహుల్ వస్తాడు. ఏంటి కంగారుగా ఉన్నవాని అడుగుతాడు. కొడుక్కి ట్యాబ్లెట్స్ చూపిస్తుంది.
రుద్రాణి: లేడీస్ డేట్ వచ్చినప్పుడు కడుపు నొప్పిగా అనిపిస్తే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు. నీ పెళ్ళాం వీటిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుంది.
రాహుల్: తను కడుపుతో ఉంది కదా. మరి ఎందుకు తెప్పించుకుంది. అంటే స్వప్నకి కడుపు రాలేదా?
రుద్రాణి: అదే మనం ఇప్పుడు తెలుసుకోవాలి
స్వప్న వచ్చి బాటిల్ లాగేసుకుంటుంది.
రాహుల్: ఈ ట్యాబ్లెట్స్ నీ దగ్గర ఎందుకు ఉన్నాయి. అంటే నీకు నిజంగా కడుపు రాలేదా?
Also Read: కావ్య కష్టం తీర్చిన రాజ్, మురిసిన కళావతి- కళ్యాణ్ కి ప్రేమ లేఖ
రుద్రాణి: అడుగుతుంటే సమాధానం చెప్పవే.. నిజం చెప్పు అవి ఎందుకు తెప్పించుకున్నావ్ వాటితో నీకు ఏం పని
రాహుల్: నీకు కడుపు రాలేదా? మమ్మల్ని మోసం చేశావా?
రుద్రాణి: పెళ్లి చేసుకోవడం కోసం చేశావా? లేదంటే నా కొడుకుని మోసం చేయడం కోసం చేశావా? ఇది నీ ప్లానా మీ చెల్లి ప్లానా
అప్పుడే కావ్య వస్తే స్వప్న తనని ఇరికిస్తుంది. ఏమైందని అంటే నీ వల్ల గొడవ అయ్యిందని చెప్తుంది.
స్వప్న: కడుపు నొప్పిగా ఉంది ఆర్డర్ పెట్టమని చెప్పావ్ కదా తెప్పించినందుకు దొరికిపోయిన దొంగని ఇంటారాగేట్ చేసినట్టు చేస్తున్నారు