Brahmamudi August 11th: 'బ్రహ్మముడి' సీరియల్ - ప్రెస్ మీట్ పెట్టి కోరి కష్టాలు తెచ్చుకున్న కావ్య- కృష్ణమూర్తిని ఘోరంగా అవమానించిన అపర్ణ
పుట్టింటికి సాయం చేసి కావ్య తన కాపురాన్ని చిక్కుల్లో పడేసుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. కళావతి రాగానే ఎందుకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. కళ్యాణ్ టెన్షన్ గా హాల్లోకి వచ్చి వదిన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుందని టీవీ ఆన్ చేస్తాడు.
కావ్య: నాణేనికి రెండు వైపులా చూడాలి. మీరు సత్యాన్ని వదిలేసి అసత్యాన్ని పరిచయం చేశారు.
విలేకర్లు: మీరు పెయింటింగ్ వేయడం అబద్ధమా? విగ్రహాలు చేయడం అబద్ధమా?
కావ్య: కాదు.. కానీ మీడియాలో మీరు సృష్టించిన కథనాలు అబద్ధాలు. నేను పెయింటింగ్ చేశాను కానీ అది నా పుట్టింటి వాళ్ళకి నేను చేసిన సహాయం మాత్రమే. దానికి మా అత్తింటితో సంబంధం లేదు
Also Read: మురారీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్న కృష్ణ- సంబరపడుతున్న ముకుంద
విలేకర్లు: మీరు డబ్బున్న ఇంటి కోడలిగా అడుగుపెట్టారు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఏంటి?
కావ్య: నేను చేస్తున్న పనికి అత్తగారింటి పరువుతో ముడి పెట్టె హక్కు మీకు ఎవరు ఇచ్చారు చెప్పండి. మీరు రాసింది జనం నమ్ముతారని ఏది పడితే అది రాస్తారా? మీరు రాసిన దాని వల్ల ఉన్నత భావాలు ఉన్న కుటుంబానికి అప్రదిష్ట వచ్చింది మీ వల్లే కదా?
విలేకరి: అంత పెద్ద ఇంటి కోడలు అయి ఉండి డబ్బు కోసం వెళ్ళి పని చేయడం నిజం కాదా?
కావ్య: నిజమే.. కానీ అబద్ధం. ఆ డబ్బు నన్ను నేను పోషించుకోవడానికి, అత్తారింటికి అప్రదిష్ట తీసుకురావడం కోసమో కాదు. నేను అడిగితే నా భర్త ఎన్ని లక్షలైన ఇస్తారు. ఇది నా జీవితం, ఇవన్నీ ఎవరో చెప్పమంటే చెప్పడం లేదు. నాకు నేనుగా వచ్చాను. దుగ్గిరాల ఇంటి కోడలికి ఆ ఇంట్లో పూర్తి స్వేచ్చ ఇస్తారు అనేసి కోపంగా వెళ్ళిపోతుంది.
రుద్రాణి: చాలా బాగా మాట్లాడింది. నిన్నటి వరకు కావ్య పుట్టింటికి వెళ్ళి పని చేస్తుందని కొందరికి తెలుసు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తో అందరికీ తెలిసింది. మన కుటుంబం పరువు రోడ్డున పడేసింది
కళ్యాణ్: వదిన మాట్లాడిన దాంట్లో తప్పేముంది. మన ఫ్యామిలీ గురించి మంచిగానే చెప్పింది కదా
ప్రకాశం: కావ్య చేసిన తప్పుని సరిదిద్దుకుంది
రుద్రాణి: మీడియా మనం అనుకున్నంత మంచిగా రాయదు. బెదిరించి మాట్లాడించారని అనుకుంటుంది.
శుభాష్: కావ్య తప్పు సరి చేసుకుంటాను అనుకుంటే ఏం చేస్తుందో అనుకున్నా ఇలాంటి పిచ్చి పని చేస్తుందని అనుకోలేదు
స్వప్న: ఎలా అనుకుంటుంది. తన తల పొగరు అలానే ఉంటుంది
రుద్రాణి: అసలు వాళ్ళ అమ్మానాన్నలని అనాలి. కూతురికి పెళ్లి అయి అత్తారింటికి వచ్చినా కూడా మళ్ళీ పనికి వస్తే వద్దని చెప్పకుండా సిగ్గు లేకుండా పని చేయించుకుంటున్నారు
ఇంద్రాదేవి: అవును వాళ్ళకి సాయం వద్దని కనకం వాళ్ళు చెప్తే తప్ప ఈ గొడవకు ముగింపు తప్పదు
రాజ్ ఆఫీసులో మీటింగ్ లో ఉన్నప్పుడు మేనేజర్ వచ్చే కావ్య మీడియాలో మాట్లాడుతున్న వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి రాహుల్ మరో కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. రాహుల్ ఫ్రెండ్ కి రాజ్ కి ఫోన్ చేసి భలే చేశావ్. భార్యని బాగా కంట్రోల్ లో పెట్టావ్.. నువ్వు చెప్పడం వల్ల కావ్య మీడియా ముందు అలా మాట్లాడిందని నోటికొచ్చినట్టు వాగుతాడు. రాహుల్ వచ్చి మరింత ఎక్కించేందుకు చూస్తాడు.
Also Read: అభిమన్యు గొంతు పట్టుకున్న యష్- వేద ఇంట్లో రక్తంతో తడిచిన టీ షర్ట్
రాహుల్: మన కంపెనీ పరువు నిలబడాలి అంటే నువ్వు కావ్యని అడ్డుకోవాలి. తను ఇప్పుడు ఇంత ధైర్యంగా ఉందంటే దానికి కారణం తనకి వచ్చిన కాంట్రాక్ట్. దాన్ని అడ్డుకోగలిగితే సరిపోతుంది. నువ్వు మోసం చేయడం లేదు పరువు కోసం చేస్తున్నావ్ కాంట్రాక్ట్ దూరం అయితే డబ్బు కోసం కావ్య నిన్నే అడుగుతుంది. నువ్వు సాయం చేయాలని అనుకుంటున్నావ్ కాబట్టి తన సమస్య తీరిపోతుంది. మన ఫ్యామిలీ కూడా ఎటువంటి అవమానాలు ఫేస్ చేయాల్సిన అవసరం కూడా లేదు
రాజ్ వెంటనే ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతాడు. అపర్ణ ఆవేశంగా కృష్ణమూర్తి ఇంటికి వస్తుంది.
అపర్ణ: మా ఇంటి కోడలిగా పంపించారు. మళ్ళీ మీ ఇంటికి వచ్చి మట్టికి రంగులు వేస్తుంటే ఎంత చిన్నతనంగా ఉంటుందో ఆలోచించారా?
కృష్ణమూర్తి: మీరందరూ ఒప్పుకున్నారని చెప్పింది
అపర్ణ: మట్టికి రంగులు వేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటామని అనుకున్నారు. మీ అమ్మాయికి బుద్ధి లేదు ఇంత వయసు వచ్చింది మీకు బుద్ధి లేదా?
కనకం: వయసుకి విలువ ఇచ్చి మాట్లాడితే మర్యాదగా ఉంటుంది
అపర్ణ: ఒక్క మాటకే పౌరుషం వస్తే మా ఇంటి పరువు తీస్తే మాకు ఎలా ఉంటుంది. మీకు అవసరమైన డబ్బు ఇస్తామంటే వద్దు అంది. ఆఫీసులో పని ఇస్తే వద్దు అంది. కూతురి ఇంటికి వస్తే ఆ ఇంటి కోడలివి వద్దు అని చెప్పాలి కదా చెప్పరు. మీకు కావలసింది అదే కదా.. అలా తను పని చేస్తే మేం కరిగిపోయి డబ్బు ఇస్తామనే కదా మీ ఆలోచన. అసలు పెళ్లి రోజు నేను ఉండి ఉంటే ఈ పెళ్లి జరగనిచ్చేదాన్ని కాదు. నేను లేని సమయంలో నా కూతురి జీవితం నాశనం అవుతుందని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఒప్పించారు. ఇష్టం లేని పెళ్లి చేసి నా కొడుకు జీవితం నాశనం చేశారు.
రేపటి ఎపిసోడ్లో..
కావ్య ఇంటి కోడలిగా ఉండాలి అంటే ఇక్కడ అందరికీ నచ్చినట్టే ఉండాలని అపర్ణ కండిషన్ పెడుతుంది. ‘తప్పు చేసింది మీరు మా వాళ్ళని బెదిరించి, నా స్వేచ్చను లాక్కున్నారు. నేను మాత్రం ఈ ఇంటి పరువును కాపాడాను అనుకుంటున్నాను. అందుకే నేను నా నిర్ణయాన్ని మార్చుకోన’ని కావ్య తెగేసి చెప్తుంది. తమ మాటకి లెక్కలేకపోతే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదని, ఇకపై నీకు ఈ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని అపర్ణ కావ్యతో ఖరాఖండీగా చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు.