Ennenno Janmalabandham August 10th: ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్: అభిమన్యు గొంతు పట్టుకున్న యష్- వేద ఇంట్లో రక్తంతో తడిచిన టీ షర్ట్
మాళవికని యష్ హత్య చేశాడని అరెస్ట్ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వేద యష్ కోసం భోజనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వస్తుంది. భర్తకి ప్రేమగా తినిపిస్తుంది. యష్ కూడా వేదకి అన్నం తినిపిస్తాడు. అప్పుడే ఏసీపీ దుర్గ వచ్చి వేద వాళ్ళని చూస్తుంది. అక్కడ ఉన్న కానిస్టేబుల్ రాజు మీద సీరియస్ అవుతుంది. లోపల ఉన్న వాళ్ళు బయటకి వస్తే ఏం జరుగుతుందో తెలియదా అని నిలదీస్తుంది. స్టేషన్ ని హోటల్ గానో, రెస్టారెంట్ గానో మార్చేస్తుంటే చూస్తూ ఉన్నారా? ప్రేమలు ఎక్కువ అవుతున్నాయి తగ్గించుకోమని ఇన్ డైరెక్ట్ గా వేద వాళ్ళని తిట్టేసి వెళ్ళిపోతుంది. స్టేషన్ నుంచి బయటకి వచ్చిన వేదకి అభిమన్యు ఎదురుపడతాడు.
అభిమన్యు: జరిగింది విన్నాను చాలా బాధేసింది. తెల్ల కోటు వేసుకుని హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన మీరు స్టేషన్, కోర్టు చుట్టు తిరుగుతున్నారు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. యష్ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. తను నా దగ్గర ఉద్యోగిగా పని చేసినప్పుడే అనవసరపు ఆలోచనలకి పోయి గొంతు మీదకి తెచ్చుకుంటాడు. ఇక పాయింట్ కి వస్తాను. యష్ బయట పడతాడా? ఒక విషయంలో చాలా బాధగా ఉంది. మాళవిక చంపబడినందుకు ఎంతైనా ఒకప్పటి నా సోల్ మెట్ కదా. అయినా మీరు చాలా పొరపాటు చేశారు. సవతిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం ఏంటి వేద. గొర్రెని తీసుకెళ్ళి కసాయి వాడి ముందు పెట్టినట్టు యష్ ముందు పెట్టారు చంపేశాడు. మీకు నా ప్రగాఢ సానుభూతి
Also Read: నందుకి ప్రేమ పాఠాలు నేర్పిస్తున్న పరంధామయ్య- రాజ్యలక్ష్మి కోటలోకి తులసి అడుగుపెట్టగలుగుతుందా?
వేద: ప్రతి కథలో మంచిదే ముగింపు ఉంటుంది అనేసి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక అభిమన్యు స్టేషన్ లోకి వచ్చి యష్ తో మాట్లాడతాడు.
అభి: ఇలాంటి పని చేశావ్ ఏంటి బ్రో.. నీ మొదటి భార్య నిన్ను వదిలేసి నా దగ్గరకి వచ్చి కాపురం చేసింది కదా అందుకే నిన్ను బ్రో అంటున్నా. అయినా ఇలాంటి చెత్త పని చేశావ్ ఏంటి? పోయి పోయి ఒక ఆడదాన్ని చంపేశావ్
యష్: అసలు ఎందుకు వచ్చావ్
అభి: మాళవికని చంపే వరకు ఎందుకు వెళ్లావ్
యష్: నేను చంపలేదు ఆ హత్యకి నాకు సంబంధం లేదు
అభి: జస్ట్ ఇప్పుడే లోపలికి వస్తుంటే మీ ఆవిడ కనిపించింది. తనది నీది ఒకటే మాట. అవన్నీ ఈ కాలంలో పని చెయ్యవు. నువ్వు స్టేషన్ లో ఉంటే జైలు చుట్టు ప్రదక్షిణలు చేస్తూ ఉంది. నీకు మాళవికకి పడకపోతే నా దగ్గరకి పంపించొచ్చు కదా చంపడం ఎందుకు? ఇదేమైన నీ ఇల్లు అనుకుంటున్నావా నా మీద రెచ్చిపోతున్నావ్. నువ్వు ఒకప్పుడు నా దగ్గర ఎంప్లాయ్ వి నామీద ఎదురుతిరిగావ్. ఎదిగావ్ బెస్ట్ సీఈవో అని విర్రవీగావ్. చిత్ర మీద మనసు పడితే జైలుకి పంపించావ్. బయటకి వచ్చేశాను. నువ్వు ఇప్పుడు జైల్లో ఉన్నావ్. నీ అదృష్టం బాగుంటే ఉరి శిక్ష పడి పైకి పోతావ్. నీ భార్యాపిల్లలకి దిక్కు ఎవరు? పోనీ నేను.. అనేసరికి యష్ తన గొంతు పట్టుకుంటాడు. హెల్ప్ హెల్ప్ అని అరవడంతో దుర్గ వచ్చి యష్ నుంచి విడిపిస్తుంది.
దుర్గ: ఏంఅనుకుంటున్నావ్ నువ్వు పోలీస్ స్టేషన్ కస్టడీలో ఉన్నావని మర్చిపోయావా? ఇతను చాలా డేంజరస్ పర్సన్ లాగా ఉన్నాడు సెక్యూరిటీ పెంచండి. ఏ మాత్రం హద్దు మీరినా మన ట్రీట్మెంట్ అప్లై చేయండి
Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్
వేద స్టేషన్ నుంచి ఇంటికి వస్తుంది. తనతో ఒక విషయం చెప్పాలని వేద తండ్రి ఎదురుచూస్తూ ఉంటారు. మాళవిక హత్య జరిగిన రోజు అల్లుడు గారు ఆవేశంగా బయటకి వెళ్ళడం నేను కళ్ళారా చూశానని శర్మ చెప్పడంతో వేద షాక్ అవుతుంది.
రేపటి ఎపిసోడ్లో..
ఏసీపీ దుర్గ వేద ఇంటికి వచ్చి సెర్చ్ చేయాలని చెప్తుంది. పోలీసులు ఇల్లంతా గాలించగా కబోర్డ్ లో రక్తంతో తడిచిన టీ షర్ట్ దొరుకుతుంది. అది చూసి ఇంట్లో అందరూ షాక్ అవుతారు.