Krishna Mukunda Murari August 10th: 'కృష్ణ ముకుంద మురారీ' సీరియల్: మురారీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతున్న కృష్ణ- సంబరపడుతున్న ముకుంద
కృష్ణ, మురారీకి భవానీ దేవి మళ్ళీ పెళ్లి చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ముత్తైదువులతో కలిసి తాళికి పూసలు గుచ్చినందుకు భవానీ ముకుందని మెచ్చుకుంటుంది. కృష్ణని దగ్గరకి పిలిచి ఇప్పటికైనా భయాలన్నీ తొలగిపోయాయా అని అడుగుతుంది. ఊ అని తల ఊపుతుంది. ఇలాంటివి ఇంకెప్పుడు చేయవద్దని గలగలా మాట్లాడుతూ ఉండమని చెప్తుంది. మురారీ డల్ గా ఫేస్ పెట్టేసరికి ఏమైందని భవానీ అడుగుతుంది. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని నందు అంటుంది. ఇంకొన్ని రోజుల్లో వెళ్లిపోయే నేను ఈ గ్రూప్ ఫోటోలో ఉంటే నేను వెళ్ళిన తర్వాత దాన్ని చూసుకుని అందరూ బాధపడతారని అనుకుని కృష్ణ మెల్లగా పక్కకి వెళ్ళిపోతుంది. సరిగా ఫోటో తీసే టైమ్ కి కృష్ణ లేదని మధుకర్ అనేసరికి అందరూ తన కోసం వెతుకుతారు. రేవతి వెళ్ళి కృష్ణని తీసుకొస్తుంది. గ్రూప్ ఫోటో దిగిన తర్వాత జంటలుగా ఫోటోలు దిగుతుంటే కృష్ణ ఎవరికీ దొరకకూడదని అనుకుని వెళ్ళిపోతుంది.
Also Read: కావ్య వీడియో వైరల్, మండిపడ్డ అపర్ణ- కళావతి కాంట్రాక్ట్ పోయేలా చేసిన రాజ్
కృష్ణ: తండ్రి ఫోటో పట్టుకుని చూస్తూ ఏడుస్తుంది. చాలా బాధగా ఉంది నాన్న. మీ ఫోటో శాశ్వతంగా ఈ ఇంట్లో ఉండిపోతుంది అనుకున్నా కానీ ఇలా తీసేయాల్సి వస్తుందని అనుకోలేదు. నేను ఈ ఇంట్లోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది. ఇన్నాళ్లలో నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవలేదు. ఎందుకంటే ఏసీపీ సర్ అండగా ఉండే వారు. నా పక్కన లేకపోయినా నాకోసం ఉన్నారనే ధీమా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఈ ఫ్యామిలిలో అందరూ మంచోళ్ళు. నువ్వు చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. నాకు ఇంతకంటే గొప్ప ఫ్యామిలీ నాకు దొరకదు. ఆయనతో నా పరిచయం చాలా ఆలస్యంగా అయ్యింది. ఎంత ఆలస్యం అంటే ఆయన ప్రేమకి నోచుకోవాలంటే ఇంకొక జన్మ ఎత్తాలి ఏమో
ముకుంద, అలేఖ్య మాట్లాడుకుంటారు. అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి చెప్తానని అన్నావ్ అదీ జరగలేదు, మాంగల్యధారణ ఆపేస్తానని అన్నావ్ అదీ జరగలేదు. నీ ప్రేమ ఎప్పటికీ గెలవదు ఏమోనని అలేఖ్య అనేసరికి ముకుంద కోపంగా అరుస్తుంది.
ముకుంద: వాళ్లిద్దరికీ జరిగిన పెళ్లి ఇష్టంతో జరిగింది కాదని నాకు అనిపిస్తుంది. అయితే ఇప్పుడు చెప్పు నా ప్రేమ గెలుస్తుందా ఒడిపోతుందా?
అలేఖ్య: గెలుస్తుంది
ముకుంద: ఇంకొకసారి నా ప్రేమ ఒడిపోతుందని అంటే ఊరుకునేది లేదు వెళ్లిపో. అయినా నా ప్రేమ ఓడిపోవడం ఏంటి?
కృష్ణ బాధగా బట్టలు సర్దుకుంటూ ఉంటే మురారీకి తను గిఫ్ట్ గా ఇచ్చిన కన్నయ్య బొమ్మ కనిపిస్తుంది. అప్పుడే మురారీ వస్తాడు. ఇద్దరూ కాసేపు కళ్ళతో బాధపడతారు.
కృష్ణ: మీకు అసలు విషయం చెప్పలేదు ఏసీపీ సర్. ఒక విలేజ్ లో విష జ్వరాలు వస్తున్నాయంట. అక్కడికి రమ్మని కాల్ వచ్చింది వెళ్తున్నాను
మురారీ: ఎన్ని రోజులు రెండు రోజుల్లో వచ్చేస్తావ్ కదా
Also Read: యష్ ని ఇంటరాగేట్ చేసిన దుర్గ - భర్తతో గడిపిన క్షణాలు తలుచుకుని ఎమోషనలైన వేద
కృష్ణ: రావడానికి అవకాశం లేదు. అప్పటికి మన అగ్రిమెంట్ పూర్తవుతుంది. రావడానికి ఎలా కుదురుతుంది. ఈ ఇంటి కోడలిగా రావాలా? కుదరదు కదా.. మీ భార్యగా రావాలా? అది ఎలాగూ కుదరదు. ఇక ఈ ఇంటితోనూ, ఇంట్లో వాళ్ళతో సంబంధం తెగిపోయింది
రేపటి ఎపిసోడ్లో..
వెళ్లిపోతున్నాను ఇక తిరిగి రావడం లేదని ముకుందకి కృష్ణ చెప్తుంది. ఆ మాట విని లోలోపల సంతోషపడుతూనే బయటకి మాత్రం అదేంటి నువ్వు ఈ ఇంటి కోడలివి పెద్దత్తయ్య నిన్ను ఎంత గొప్పగా సత్కరించిందని అంటుంది. ఏసీపీ సర్ మనసులో నేను లేనప్పుడు ఆయన భార్య ఎలా అవుతాను. ఎలా ఈ ఇంటి కోడలిగా బాధ్యత తీసుకొను అని కృష్ణ తన మనసులో బాధ ముకుందకి చెప్పుకుంటుంది.