Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం - సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
Anchor Rashmi Gautam: యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుంది.
![Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం - సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ Anchor Rashmi Gautam Grand Father Passed Away Anchor Rashmi: యాంకర్ రష్మీ ఇంట విషాదం - సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/21/968c152b2001913cfb52df70f2ac65db1724245356688929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Anchor Rashmi Emotional Post: బుల్లితెరపై స్టార్ యాంకర్ రాణిస్తోంది రష్మీ గౌతమ్. ప్రస్తుతం ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌కు యాంకర్‌గా ఉన్న రష్మీ అప్పుడప్పుడు స్పెషల్ షోలకు హోస్ట్‌గానూ వ్యవహరిస్తూ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా రష్మీ గౌతమ్ ఓ షాకింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. ఈ మేరకు ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ తన ఇంట జరిగిన విషాదన ఘటన గురించి చెప్పింది. ఆమె తాతయ్య అనారోగ్యంతో మరణించినట్టు చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. "చివరిగా మా తాతయ్య తనని (నానమ్మ) స్వర్గంలో కలుసుకున్నారు. నిజమైన ఫెమినిస్టు అయిన ఆయనకు ఆగస్టు 17న తుది విడ్కోలు పలికాము. ఆమె కొల్పోయినప్పటి నుంచి ఆయన చాలా ఒంటరితనాన్ని అనుభవించారు. నానమ్మ చనిపోయి ఏడాదిన్నర అవుతుంది. ఈ ఏడాదిన్నర తనని తలుచుకోని రోజు లేదు. ప్రతి రోజు ఆమె గురించి మాట్లాడుతుండేవారు. వారి ఆత్మలు విడదీయరానివి. ఒకరు లేకుండ ఒకరు ఉండేలేరు.
View this post on Instagram
అలాంటి వారిని మన సొంత స్వార్థపూరిత భావోద్వేగ అవసరాల కోసం మనతోనే ఉండాలని కోరుకుంటాం. కానీ మా తాతయ్యకు నానమ్మ అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. ఆయన మానసిక శ్రేయస్సు కోసం ఆయనకు ఆమె అవసరం. వారి ప్రేమ అలాంటింది. నిజమైన ప్రేమకు నేను స్వయంగా చూసిన ఒక ఉదాహరణ వారు" అంటూ రష్మిక భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా వాళ్ల తాతయ్య నానమ్మకు ఆయిల్ పెడుతున్న వీడియోను షేర్ చేసింది.
Also Read: ప్రభాస్‌తో సినిమా - ఇమాన్వీనే తీసుకోవడానికి కారణమేంటో చెప్పిన హను రాఘవపూడి!
బుల్లితెరపై రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. కరెంట్ వంటి చిత్రాల్లో సహానటి పాత్రలు పోషించింది. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఇదే సమయంలో గుంటూరు టాకీస్ వంటి చిత్రాలతో హీరోయిన్‌గానూ చేసింది. యాంకర్‌గా రాణిస్తునే వీలు చీక్కినప్పుడల్లా వెండితెరపై హీరోయిన్‌గా మెరుస్తోంది. బుల్లితెరపై హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రష్మీ తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది.
వచ్చి రానీ తెలుగు మాట్లాడుతూ కుర్రకారు ఆకట్టుకుంటుంది. ఇక సుడిగాలి సుధీర్‌తో ఆమె లవ్ ట్రాక్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరు జంటగా కనిపించిన ప్రతి షో టీఆర్సీలో రేట్‌తో దూసుకుపోతుంది. అంతగా ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు తన వ్యక్తిగత విషయాలను గొప్పంగా ఉంచే రష్మీ తనకు సంబంధంచిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. జంతు ప్రేమికురాలైన ఆమె వాటిపై ఎలాంటి ఘటనలు జరిగిన సోషల్ మీడియాలో వేదికగా స్పందిస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)