అన్వేషించండి

Hanu Raghavapudi: ప్రభాస్‌తో సినిమా - ఇమాన్వీనే తీసుకోవడానికి కారణమేంటో చెప్పిన హను రాఘవపూడి!

Prabhas-Hanu Movie: సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్వీ హీరోయిన్గా తీసుకోవడంపై డైరెక్టర్‌ హను రాఘవపూడి స్పందించారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆయన ప్రభాస్‌ సరసన ఇమాన్వీని సెలక్ట్‌ చేయడానికి కారణం చెప్పాడు. 

Reason Why Hanu Raghavapudi Selected Image in Prabhas Movie: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, 'సీతారామం' ఫేం హను రాఘవపూడి కాంబినేషన్‌లో ఓ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కబోతుంది. ఇటీవల ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ఓ కొత్త అమ్మాయి, సోషల్‌ మీడియా స్టార్‌ ఇమాన్‌ ఇస్మాయిల్‌ అలియాస్‌ ఇమాన్వీని ఎంపిక చేసింది మూవీ టీం. దీంతో ఆమె ఒక్కసారిగా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలోనే ప్రభాస్‌ ఇప్పుడు నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉన్నాడు.

గ్లోబల్ స్టార్ సరసన సోషల్ మీడియా స్టారా?

అలాంటి గ్లోబల్‌ స్టార్‌ సరసన ఒక సోషల్‌ మీడియాలో స్టార్‌ని తీసుకోవడంతో అంతా షాక్‌ అయ్యారు. ఏ స్టార్‌ హీరోయిన్‌ని తీసుకుంటారో అనుకుంటే సినీ బ్యాగ్రౌండ్‌ లేని అమ్మాయిని తీసుకున్నారు. దీంతో ఇమాన్వీ ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. డెబ్యూ సినిమాతోనే పాన్‌ ఇండియా స్టార్‌తో సరసన కొట్టేయడంతో ఆమెను అంతా మోస్ట్‌ లక్కీయేస్ట్‌ గర్ల్‌ అంటూ కొనియాడుతున్నారు. అయితే హను రాఘపూడి ఈ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవడానికి కారణమేంటనేది ప్రస్తుతం అందరిని నెలకొన్న సందేహం. ఈ క్రమంలో తాజాగా హను రాఘవపూడి దీనిపై క్లారిటీ ఇచ్చారు.

సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది

రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రభాస్‌ మూవీపై స్పందించారు. అంతేకాదు ఇమాన్వీని ఈ ప్రాజెక్ట్‌లో ఫీమెల్‌ లీడ్‌గా తీసుకోవడానికి కారణమేంటో కూడా వెల్లడించారు. "సోషల్‌ మీడియాలో వల్ల కొత్త టాలెంట్‌ని గుర్తించడం సులభం అయ్యింది. ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్‌ని వెలికితీయడంలో సోషల్‌ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. కొత్త టాలెంట్‌ని తీసుకురావాలని అనుకునే దర్శక-నిర్మాతలకు సోషల్‌ మీడియాలో బాగా సాయపడుతుంది. అందులో సందేహం లేదు. సోషల్‌ మీడియా ద్వారానే నేను ఇమాన్వీని కనుగొన్నాను. అందరిలాగే నేను ఆమె వీడియోలు చూస్తుంటాను. ఆమె అందంతో పాటు ఎంతో ప్రతిభ ఉన్న అమ్మాయి. అద్బుతమైన డ్యాన్సర్‌. అంతేకాదు ఆమె భరతనాట్య కళాకారిణి కూడా. 

ఆమెలో అది బాగా ఆకట్టుకుంది

తనలో ఒక ప్రత్యేకమైన టాలెంట్‌ ఉంది. కళ్లతోనే తన హావభావాలు పలికించగలదు. వెండితెరపై స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటుందని అనిపించింది. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలని అనుకున్నా. తనని సెలక్ట్‌ చేయడం ఒక్క తన నిర్ణయమే మాత్రమే కాదన, మొత్తం టీం అంత కలిసి తీసుకున్న నిర్ణయం" అంటూ చెప్పుకొచ్చారాయన. కాగా ఇమాన్‌ ఇస్రాయిల్‌ పాకిస్తాన్‌ మూలాలు ఉన్న భారత్‌కు చెందిన అమ్మాయి. ఆమె కుటుంబం ఢిల్లీలో స్థరపడింది.  

1995 అక్టోబర్‌ 20న ఆమె జన్మించింది. చిన్నతనం నుంచే ఆమెకు డ్యాన్స్‌ అంటే ఆసక్తి. చదువుకుంటూనే ఆమె డ్యాన్స్‌ నేర్చుకుంది. అంతేకాదు ఆమెరికా కాలిఫోర్నియా యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ఇక డ్యాన్స్‌పై ఇష్టం వల్ల తన తల్లి సలహాతో నటి రేఖ, మాధురి దీక్షిత్‌ వంటి నటీమణులను ఫాలో అవుతూ వారిలా హావభావాలు పలికించడం నేర్చుకుంది. అలా ఒక్క డ్యాన్స్‌తోనే కాదు తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. ఇక ఇమాన్వీ ఎక్కువగా సౌత్‌ ఇండియన్‌ పాటలకు రీల్స్‌ చేస్తూ ఇక్కడ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. 

Also Read: యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం పెళ్లి సందడి మొదలైంది - ఫోటోలు షేర్‌ చేసిన రహస్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget