అన్వేషించండి

‘సలార్’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ తొలి భాగం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భారీ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోందని తెలిపింది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు 5 భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు  డిజిటల్ హక్కులను దక్కించుకుందట. ఇందుకోసం ఏకంగా రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘దేవర’ షూటింగ్ కంప్లీట్ కాకముందే బడ్జెట్ లో సంగం డబ్బులు వచ్చేశాయని చర్చించుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరెక్కిన మూవీ ‘స్కంద’. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం(సెప్టెంబర్ 28న) విడుదలైంది. తొలుత ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు వచ్చినా, నెమ్మదిగా థియేటర్లకు ప్రేక్షకుల తాకిగి పెరిగింది. కలెక్షన్స్  ఓ రేంజిలో వసూళు అవుతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వచ్చాయి. రామ్ పోతినేని సినీ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘స్కంద’ నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)ను ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా ప్రేక్షకులు చూస్తారు. కుటుంబ అనుబంధాలు, విలువలతో కూడిన చిత్రాలు తీస్తారని ఆయనకు పేరు ఉంది. 'నారప్ప'తో ఆయన యాక్షన్ బాట పట్టారు. 'పెద కాపు 1' టీజర్, ట్రైలర్, పాటలతో శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (Virat Karrna) ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

టైగర్‌ ష్రాఫ్ ‘గణపథ్‌‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో టైగర్‌ ష్రాఫ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గణపథ్‌‘. ‘ఆది పురుష్‘ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన కీలక పాత్ర పోషిస్తున్నారు.   స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి  వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాంచైజ్ లాగా రాబోతున్న ‘గణపథ్‌‘ నుంచి తొలి భాగం అక్టోబర్ 20న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం మొదలు పెట్టింది. ఇప్పటికే ‘గణపథ్‌’ మూవీకి సంబంధించి విడుదలైన టైగర్‌ ష్రాఫ్‌, కృతిసనన్‌ ఫస్ట్ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచేశాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Amazon India: ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ -  రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
ఏపీ సరిహద్దుకు బెంగళూరు అమెజాన్ క్యాంపస్ - రెంట్ మిగుల్చుకోవడానికి కంపెనీ అవస్థలు !
Nayanthara Vs Dhanush: ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
ఎన్ఓసీ లేకుండా వాడేసిన నయన్ - ఇప్పుడు ధనుష్ ఏం చేస్తాడో?
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
TGTET: 'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
'టెట్‌' అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు నవంబరు 22 వరకు అవకాశం
Pakistan: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Embed widget