Ganapath Teaser: టైగర్ ష్రాఫ్ ‘గణపథ్‘ టీజర్ చూశారా? యాక్షన్ సీన్లకు గూస్ బంప్స్ రావాల్సిందే!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గణపథ్‘‘. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ విడుదల అయ్యింది. అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
Ganapath Telugu Teaser: బాలీవుడ్ టాలెంటెడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గణపథ్‘. ‘ఆది పురుష్‘ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్నది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన కీలక పాత్ర పోషిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి వికాస్ భల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రాంచైజ్ లాగా రాబోతున్న ‘గణపథ్‘ నుంచి తొలి భాగం అక్టోబర్ 20న విడుదలకానుంది. సినిమా ప్రమోషన్స్ ను చిత్రబృందం మొదలు పెట్టింది. ఇప్పటికే ‘గణపథ్’ మూవీకి సంబంధించి విడుదలైన టైగర్ ష్రాఫ్, కృతిసనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలు పెంచేశాయి.
అదిరిపోయే యాక్షన్ సీన్లతో ఆకట్టుకుంటున్న ‘గణపథ్‘ టీజర్
తాజాగా మేకర్స్ ‘గణపథ్‘ తెలుగు టీజర్ ను మెగాస్టార్ చిరంజీవితో విడుదల చేయించారు. 1.45 నిమిషాల వ్యవధి ఉన్న ఈ టీజర్ అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో హాలీవుడ్ మూవీని తలపిస్తోంది. టీజర్ ప్రారంభంలో టైగర్ ష్రాప్ గుహలో ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. ఈ సినిమా 2070 ADలో జరుగుతున్నట్లు చూపిస్తారు. ప్రపంచానికి ఎలాంటి హోప్ లేనప్పుడు అంటూ, తినడానికి తిండిలేక జనాలు కొట్టుకునే పరిస్థితిని చూపిస్తారు. తిండికోసం చావుకు కూడా లెక్కచేయని పరిస్థితి నెలకొని ఉంటుంది. “మనకోసం ఓ వీరుడు వచ్చేంత వరకు ఈ యుద్ధం మొదలు పెట్టొద్దు” అనే వాయిస్ వినిపించగానే, గుహలో ధ్యానం చేసుకుంటున్న టైగర్ కనిపిస్తారు. ఆయనను చంపేందుకు అత్యాధునిక ఆయుధాలతో ఓ బృందం వెళ్తుంది. వారిని చితకబాదుతారు. ఆ తర్వాత బాక్సింగ్ రింగులో పోటీదారుడిని తన మార్క్ షాట్లతో విరుచుకుపడతాడు. అటు కృతి సనన్ సైతం అదిరిపోయే యాక్షన్ తో ఆకట్టుకుంటుంది. అమితాబ్ బచ్చన్ సరికొత్త గెటప్ లో కనిపిస్తారు. “మా వాళ్ల జోలికి వస్తే అస్సలు వదిలిపెట్టను” అనే టైగర్ డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది. “నిరీక్షణ సమయం ముగిసింది. మిమ్మల్ని మా ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి, వచేస్తున్నాము. ‘గణపథ్‘ దసరాకు కానుకగా అక్టోబర్ 20న థియేటర్లలోకి రాబోతోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
హాలీవుడ్ మూవీని తలపిస్తున్న ‘గణపథ్‘
మొత్తంగా టైగర్ ష్రాఫ్ కండలు తిరిగిన దేహంతో కనిపిస్తుంటే, కృతిసనన్ యాక్షన్ అవతార్‌లో సందడి చేసింది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌లో హీరోకు ఏ మాత్రం తగ్గకుండా కృతిసనన్ ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించింది. ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రెహమాన్, జమీల్ ఖాన్, గిరీష్ కులకర్ణి, శ్రుతి మీనన్, జియాద్ బక్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గుడ్ కో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విశాల్ మిశ్రా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Read Also: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial