By: ABP Desam | Updated at : 29 Sep 2023 03:14 PM (IST)
'పెదకాపు 1'లో విరాట్ కర్ణ
పెదకాపు 1
రూరల్ యాక్షన్ డ్రామా, పాలిటిక్స్
దర్శకుడు: శ్రీకాంత్ అడ్డాల
Artist: విరాట్ కర్ణ, రావు రమేష్, 'ఆడుకాలం' నరేన్, శ్రీకాంత్ అడ్డాల, అనసూయ తదితరులు
సినిమా రివ్యూ : పెదకాపు
రేటింగ్ : 2.5/5
నటీనటులు : విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాత్సవ, రావు రమేష్, 'ఆడుకాలం' నరేన్, శ్రీకాంత్ అడ్డాల, తనికెళ్ళ భరణి, అనసూయ భరద్వాజ్, బ్రిగిడ సాగ, రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, నాగబాబు, వికాస్, ప్రవీణ్ యండమూరి తదితరులు
ఛాయాగ్రహణం : ఛోటా కె నాయుడు
సంగీతం : మిక్కీ కె మేయర్
నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి
కథ, మాటలు, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
విడుదల తేదీ: సెప్టెంబర్ 29, 2023
శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala)ను ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడిగా ప్రేక్షకులు చూస్తారు. కుటుంబ అనుబంధాలు, విలువలతో కూడిన చిత్రాలు తీస్తారని ఆయనకు పేరు ఉంది. 'నారప్ప'తో ఆయన యాక్షన్ బాట పట్టారు. 'పెద కాపు 1' టీజర్, ట్రైలర్, పాటలతో శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బావమరిది విరాట్ కర్ణ (Virat Karrna) ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.
కథ (Peda Kapu 1 Story) : గోదావరి లంక గ్రామాల్లో ప్రజలు అయితే సత్య రంగయ్య (రావు రమేష్) లేదంటే బయన్న ('ఆడుకాలం' నరేన్) దగ్గర పని చేయాలి. 15 ఏళ్లుగా బయన్న అధికారంలో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీ పెడుతున్నట్లు ప్రకటన వచ్చింది. సత్య రంగయ్య చెప్పడంతో ఆయన దగ్గర పనిచేసే పెదకాపు (విరాట్ కర్ణ), తన అణగారిన వర్గం మనుషులతో ఏడు ఊర్ల ప్రజలకు కనిపించేలా పెద్ద చెట్టును నరుక్కొచ్చి జెండా పెడతారు. టికెట్ ఆశించిన సత్య రంగయ్య, బయన్నకు కాకుండా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా పెదకాపు పేరును ఎన్టీఆర్ పార్టీ తరఫున వచ్చిన ఇంచార్జ్ (నాగబాబు) సూచించడానికి గల కారణం ఏమిటి? మధ్యలో ఏం జరిగింది? అక్కమ్మ (అనసూయ) ఎవరు? రాజకీయాల్లో ఆమె పాత్ర ఏమిటి? చివరకు ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి.
విశ్లేషణ (Peda Kapu 1 Review) : సహజత్వంతో కూడిన యాక్షన్ సినిమాలు తమిళ పరిశ్రమ నుంచి ఎక్కువ వస్తాయని, తెలుగులో అటువంటి సినిమాలు తీయరని కొన్నాళ్ళ క్రితం వరకు విమర్శ వినిపించేది. 'రంగస్థలం', 'పలాస' వంటి చిత్రాలు అటువంటి విమర్శలకు చెక్ పెట్టాయి. శ్రీకాంత్ అడ్డాల 'నారప్ప' తీసినా... తమిళ సినిమా రీమేక్ అది. 'పెదకాపు 1' సినిమాతో తన మార్క్ మాస్ చూపించే ప్రయత్నం చేశారాయన.
గోదావరి లంక గ్రామాల నేపథ్యంలో నెత్తుటి రాజకీయాలతో కూడిన కథను తనదైన శైలిలో మాసీగా తీశారు. ఆయన రాత, తీతలో నిజాయతీ ఉంది. కొత్తగా ట్రై చేశారు. ప్రజల కోసం నిలబడే వాడిని పెదకాపు అంటరాని ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు. మరి, హీరోని ముందు నుంచి 'పెదకాపు' అని ఎందుకు పిలుస్తున్నారు? యుక్త వయసులో ఆయన ఏం చేశారు? ఎందుకు పిలుస్తున్నారు? వంటివి చూపిస్తే కథ మరింత బలంగా ఉండేది. రైటింగ్, క్యారెక్టర్ ఎస్టాబిష్ చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కథ కూడా కొత్తగా కనిపించదు. తెలుగుదేశం ప్రస్తావన పక్కన పెడితే... కథలో 'నారప్ప' ఛాయలు ఉన్నాయి. ఆ సినిమాలో తండ్రిని హీరోగా చూపిస్తే... ఈ కథలో కొడుకును హీరో చేశారు. మధ్య మధ్యలో 'రంగస్థలం' కూడా గుర్తుకు వస్తుంది.
సినిమా ఆసక్తికరంగా ప్రారంభమైంది. అయితే, గోదావరి లంక గ్రామాల్లో కులాల కుంపట్లను పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేదు. రాజకీయ గొడవలును సైతం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అధికార పోరులో అణగారి వర్గాలకు అన్యాయం జరగడంతో, వారిలో ఓ యువకుడు ధైర్యంగా పైకి వచ్చినట్లు చూపించారు. ఈ కథలో లవ్ ట్రాక్ అంతగా ఇమడలేదు. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అయినట్లు క్యారెక్టర్లు ఎక్కువ కావడంతో కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని పాత్రలకు ఇచ్చిన హైప్, ఆ తర్వాత కంటిన్యూ కాలేదు.
ఒక్క విషయంలో శ్రీకాంత్ అడ్డాలను మెచ్చుకోవాలి. టెక్నికల్ టీంతో ఫెంటాస్టిక్ వర్క్ తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ పరంగా ఛోటా కె నాయుడు హై స్టాండర్డ్స్ మైంటైన్ చేశారు. ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం కూడా ఎక్సట్రాడినరీగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మ్యూజిక్ హైలైట్. సినిమా టేబుల్ మీద ఉన్నప్పుడు లెంగ్త్ పరంగా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథనం నిదానంగా సాగింది.
నటీనటులు ఎలా చేశారంటే : హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. ప్రామిసింగ్ యంగ్ హీరో మెటీరియల్ అనిపించారు. శ్రీకాంత్ అడ్డాల సైతం హీరోని బాగా ప్రజెంట్ చేశారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు లవ్, ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు. బరువైన పాత్రను తన భుజాలపై మోసే ప్రయత్నం చేశారు. నటుడిగా శ్రీకాంత్ అడ్డాల ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో ఒదిగిపోయారు.
'పెదకాపు'లో హీరో విరాట్ కర్ణ అయితే... స్క్రీన్ మీద అసలైన హీరోలు రావు రమేష్, 'ఆడుకాలం' నరేన్! రావు రమేష్ అయితే కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తో నటించారు. ఆ కళ్ళలో కోపం, ఆవేశం, విలనిజం చూపించారు. చాలా రోజుల తర్వాత ఆయనకు డిఫరెంట్ క్యారెక్టర్ లభించడంతో చెలరేగిపోయారు. నాగబాబు, తనికెళ్ళ భరణి, వికాస్, ప్రవీణ్ యండమూరి, రాజీవ్ కనకాల తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎంఎస్ చౌదరి క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంది.
'పెదకాపు 1'లో మహిళలకు సైతం మంచి పాత్రలు లభించాయి. అనసూయ పాత్ర పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేశారామె. హీరోయిన్ ప్రగతి శ్రీవాత్సవ అందంగా కనిపించారు. డైలాగ్ డెలివరీకి లిప్ సింక్ తోడైతే ఇంకా బావుండేది. బ్రిగిడ సాగ నటన సహజంగా ఉంది. హీరో తల్లి పాత్రలో ఈశ్వరీ రావు కనిపించారు.
Also Read : 'అతిథి' రివ్యూ : హీరో వేణు తొట్టెంపూడి నటించిన హారర్ థ్రిల్లర్ సిరీస్
చివరగా చెప్పేది ఏంటంటే : సినిమాలో మాస్ సన్నివేశాలను కొన్నిటిని తీసిన విధానం షాక్ చేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ మామూలుగా లేదు. ఇంటిలో శ్రీకాంత్ అడ్డాల, అనసూయ మధ్య సీన్ & క్లైమాక్స్ సైతం అంతే! తలలు తెగి పడ్డాయ్, రక్తం ఏరులై పారింది. సినిమాలో కొన్ని హై మూమెంట్స్ ఉన్నాయి. కానీ, అవి స్టార్టింగ్ టు ఎండింగ్ కంటిన్యూ కాలేదు. సినిమాలో పెద్ద సమస్య అదే! కథ పరంగా వావ్ ఫ్యాక్టర్ ఏదీ లేదు. పైగా నిదానంగా సాగింది. పతాక సన్నివేశాల్లో, మధ్యలో ఎన్టీ రామారావు & తెలుగుదేశం పార్టీ అభిమానులకు నచ్చే సన్నివేశాలు ఉన్నాయి.
Also Read : చంద్రముఖి 2 రివ్యూ: రజనీ సినిమా సీక్వెల్‌లో రాఘవ లారెన్స్ భయపెట్టాడా? నవ్వించాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Animal: 'యానిమల్'లో హీరోయిన్‌గా ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేశారా? అసలు చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Nani : విజయ్, రష్మిక ప్రైవేట్ పిక్ కాంట్రవర్సీపై స్పందించిన నాని!
రికార్డులు బద్దలుకొడుతున్న ‘సలార్’ ట్రైలర్, రూ.230 కోట్లు దాటిన ‘యానిమల్’ - నేటి టాప్ సినీ విశేషాలివే!
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
Bhatti Vikramarka: సీఎం పదవి వస్తే బాధ్యతగా చేస్తా - భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
/body>