Medchal Murder Case: ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు
Murder Case: ఔటర్ రింగ్ రోడ్ కల్వర్ట్ కింద లభించిన గుర్తు తెలియని మహిళ మృతదేహం కేసును పోలీసులు చేధించారు. హత్య చేసిన నిందితుడ్ని అరెస్టు చేశారు.
![Medchal Murder Case: ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు Police have arrested the accused in the murder case under Outer Ring Road Medchal Murder Case: ఔటర్ కల్వర్టు కింద ఏకాంతంగా గడిపారు - అక్కడే గొడవ, హత్య - కేసు చేధించిన పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/cb49f39e0f868f5f5892b57244b653361737980093041228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Police arrested accused in the murder case: 24వ తేదీన మేడ్చల్ , మునీరాబాద్ గ్రామ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు బైపాస్ అండర్ బ్రిడ్జ్ కింద దారుణ హత్యకు గురైన మహిళ ఎవరో పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో భాగంగా నాలుగు బృందాలతో స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి పలు రకాల క్లూస్ సాధించి మృతురాలిని గుర్తించారు. హత్యకు గురైన మహిళ బోధన్ కు చెందిన శివానందగా గుర్తించారు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె చేతిలో పచ్చబొట్లుగా ఉన్నవి పిల్లల పేర్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది.
వివాహేతర బంధం పెట్టుకున్న వ్యక్తితో ఏకాంతంగా గడపడానికి వెళ్లిన శివానంద
బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చిన శివానంద ఇళ్ళల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతోంది. ఆమెకు ఇటీవలి కాలంలో హన్మకొండ జిల్లా కమలాపుర్ గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి 24వ తేదీన మేడ్చల్ వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. వారు ఎక్కడెక్కడికి వెళ్లారో ఆరా తీశారు. మునీరా బాద్ లోని ఓ మెడికల్ షాప్ లో కండోమ్స్ కొన్నట్లు సీసీ టీవీ ఫుటేజీ లభించింది. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కల్వర్టు కిందకు వెళ్లారు. జన సంచారం దాదాపుగా ఉండని ఆ ప్రాంతంలో వారిద్దరూ ఏకంగా గడిపారు.
నిర్మానుష్య ప్రదేశంలో గొడవ పడటంతో శివానందను బండరాయి మోదీ చంపేసిన ఇమామ్
అయితే ఆ సమయంలోనే వారి మధ్య గొడవ జరగడంతో ఇమామ్.. శివానందను కొట్టి చంపాడు. తర్వాత ఎవరైనా గుర్తు పడతారేమోనన్న భయంతో పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా అనుమానిస్తున్నారు. తర్వాత సైలెంట్ గా తన పని తాను చేసుకుంటున్నాడు. పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అతను మేడ్చల్ లోనే ఉన్నట్లుగా తెలుసుకుని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందో మొత్తం ఆరా తీస్తున్నారు. హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చివేయడంతో హతురాలు ఎవరో గుర్తించడం కూడా కష్టంగా మారింది. అయితే పోలీసులు సవాల్ గా తీసుకుని కేసును చేధించారు.
Also Read : Maoist Encounters: కదల్లేని వృద్ధులను సైతం ఈడ్చుకొచ్చి కాల్చేస్తున్నారు, మావోయిస్టుల అంతం అమిత్ షా వల్ల కాదు
నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా గడపడానికి వెళ్తున్న జంటలు అత్యధికం వివాహేతర బంధాలు పెట్టుకున్న వారే. ఈ కారణంగా వారి మధ్య ఏదైనా వివాదం వస్తే.. అక్కడే ఘోరాలకు పాల్పడుతున్నారు.ఇలాంటి నేరాలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయి. దీంతో ఔటర్ కల్వర్టుల కింద సరైన భద్రతా చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అక్కడే అసాంఘిక శక్తులు ఉండటంతో సామాన్యులు ఎవరైనా అటు వైపు వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)