News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!

రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘స్కంద’. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలిచింది.

FOLLOW US: 
Share:

యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరెక్కిన మూవీ ‘స్కంద’. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ గురువారం(సెప్టెంబర్ 28న) విడుదలైంది. తొలుత ఈ సినిమా గురించి నెగెటివ్ రివ్యూలు వచ్చినా, నెమ్మదిగా థియేటర్లకు ప్రేక్షకుల తాకిగి పెరిగింది. కలెక్షన్స్  ఓ రేంజిలో వసూళు అవుతున్నాయి. టాక్‌తో సంబంధం లేకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వచ్చాయి. రామ్ పోతినేని సినీ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా ‘స్కంద’ నిలిచింది.  ఇంతకీ ఈ మూవీ తొలి రోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

రామ్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్

తొలి రోజు ‘స్కంద’ మూవీ భారీగా వసూళ్లను రాబట్టింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో థండరింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక తొలి రోజు ఈ చిత్రం నైజాం ఏరియాలో రూ. 3.23 కోట్లు సాధించినట్లు తెలిపింది. సెడెడ్ లో రూ. 1.22 కోట్లు వసూళు చేసినట్లు తెలిపింది. వైజాగ్ లో రూ. 1.19 కోట్లు, తూర్పు గోదావరిలో లో రూ. 59 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ. 41 లక్షలు, కృష్ణలో రూ. 45 లక్షలు, గుంటూరులో రూ. 1.04 కోట్లు, నెల్లూరులో రూ. 49 లక్షలు సాధించింది. మొత్తంగా తొలి రోజు రూ.8.62 కోట్లు వసూళ్లు చేసింది. నిన్న(గురువారం) మార్నింగ్ షోకు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు రాకపోయినా, హాలీడే కావడంతో మాట్నీ నుంచి ఈ సినిమాకు ఓరేంజిలో బుక్సింగ్స్ పెరిగాయి. దీంతో భారీగా వసూళ్లు సాధించింది. అటు వరల్డ్ వైడ్ గానూ కలెక్షన్స్ పరంగా ఫర్వాలేదు అనిపిస్తున్నట్లు తెలుస్తోంది.   

'స్కంద' ప్రీ రిలీజ్ బిజినెస్ అదుర్స్

అటు ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.43 కోట్ల బిజినెస్ జరిగింది.  నైజాంలో 'స్కంద' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ద్వారా సుమారు 14 కోట్ల రూపాయలు రాగా, ఆంధ్రా ఏరియాలు అన్నీ కలిపి రూ. 20 కోట్లు వచ్చాయి.  సీడెడ్ రూ. 9 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగులో మొత్తం 43 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగింది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా రైట్స్ కలిపి రూ. 3 కోట్లు వచ్చాయి.  హిందీ డిజిటల్, శాటిలైట్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చిత్రనిర్మాణంలో భాగస్వామి అయిన జీ స్టూడియోస్ దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ. 40 కోట్లకు ఆ రైట్స్ అన్నీ జీ గ్రూప్ తన దగ్గర ఉంచుకుంది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ. 2.20 కోట్లు వచ్చాయట. మొత్తం మీద 'స్కంద' సినిమాకు రూ. 49 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్లు అంచనా. 

ఇక 'స్కంద'లో మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా 'కల్ట్ మామ' పాటలో స్టెప్పులు వేశారు. శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, శరత్ లోహితస్వ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఎస్ తమన్ సంగీతం అందించారు. అటు  ఈ సినిమా తర్వాత రామ్  మరోసారి పూరీ జగన్నాథ్‌తో సినిమా చేస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’  అనే ఓ సినిమా చేస్తున్నారు.  గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్‌కు ఈ సినిమా సీక్వెల్‌గా వస్తోందని తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టి అదరగొట్టింది. ఈచిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. 

Read Also: వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Sep 2023 12:52 PM (IST) Tags: Boyapati Srinu Ram Pothineni Sreeleela Skanda Movie Skanda Box Office Collection Skanda Box Office Collection Day 1

ఇవి కూడా చూడండి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

Devil Movie: ‘డెవిల్’ కోసం కళ్యాణ్‌రామ్‌కు 90 స్పెషల్ కాస్ట్యూమ్స్‌ - ఇటలీ నుంచి తెప్పిన మోహైర్ ఊల్‌తో!

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘సరిపోదా శనివారం’ రిలీజ్ అప్‌డేట్, ‘నాసామిరంగ’ ఫస్ట్ సింగిల్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samantha: బాలీవుడ్ రియాలిటీ షోలో సమంత - స్టేజీపై హైదరాబాదీ ర్యాపర్‌తో హల్‌చల్!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

Samuthirakani: ఎమ్మెల్యే బయోపిక్‌లో సముద్రఖని - తెరపైకి తెలంగాణ రాజకీయ నాయకుని కథ!

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు