వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి భారీ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ.50 కోట్లకు పైగా అమ్ముడైనట్లు సమాచారం.
మెగా హీరోల్లో రొటీన్ సినిమాలు కాకుండా డిఫరెంట్ జానెర్స్ లో సినిమాలు తీస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఈ మధ్య కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ అవి ఏవీ వర్కౌట్ అవ్వడం లేదు. అలా అని నిరాశ చెందకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉండే కథలని ఎంచుకుంటున్నాడు. రీసెంట్ గా 'గాండీవ దారి అర్జున' సినిమాతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి భారీ డీల్ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా వరుస ప్లాపుల్లో కూరుకుపోయిన వరుణ్ తేజ్ భారీ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ క్రమంలోనే త్వరలోనే 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో రాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి భారీ బిజినెస్ డీల్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ డీల్ గురించి తెలిసి ఇండస్ట్రీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకంటే ప్లాపులతో హీరోగా వరుణ్ తేజ్ మార్కెట్ డౌన్ ఫాల్ లో ఉన్నా కూడా తన కొత్త సినిమాకి భారీగా బిజినెస్ జరగడం గమనార్హం. కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఓ పైలట్ గా కనిపించబోతున్నాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ వార్ మూవీ ఇది అని మూవీ టీం మొదటి నుంచి ప్రచారం చేస్తోంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఇప్పటివరకు తెలుగులోనే కాకుండా ఇండియాలో తక్కువ సినిమాలు వచ్చాయి.
రీసెంట్ గా విడుదలైన మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి నాన్ థియెట్రికల్ డీల్ భారీగా జరిగినట్లు సమాచారం. 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ కి గాను రూ.50 కోట్లకు పైగా డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇందులోనే ఓటీటీ, శాటిలైట్ తో పాటు ఆడియో రైట్స్ కూడా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఉన్న పరిస్థితిలో ఈ డీల్ చాలా పెద్దదనే చెప్పాలి. బ్యాక్ టు బ్యాక్ రెండు డిజాస్టర్స్ తర్వాత కూడా వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి భారీ డీల్ కుదిరింది అంటే మామూలు విషయం కాదు.
వరుణ్ తేజ్ కెరీర్ లో ఇప్పటివరకు తన సినిమాలకు జరిగిన అతిపెద్ద థియేట్రికల్ బిజినెస్ ఇదే అని చెప్పొచ్చు. అంతేకాదు ఈ సినిమా తెలుగు, హిందీ భాషల థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ భారీ డీల్ పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ కి హీరోగా ఆరంగేట్రం చేస్తుండగా మానసి చిల్లర్ తెలుగు వెండితెరకి కథానాయికగా పరిచయం అవుతుంది. 2022లో విడుదలైన 'మేజర్' వంటి భారీ సక్సెస్ తరువాత సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా చిత్రీకరించబడడం విశేషం. రినైసన్స్ పిక్చర్స్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంతో ప్రతాప్ సింగ్ హడా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 8న తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
Also Read : సెన్సార్ బోర్డ్‌కు రూ.6.5 లక్షల లంచం ఇచ్చా - ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నా: విశాల్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial