News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడు అయినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

‘RRR’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ‘దేవర’ అనే సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. సుమారు రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘RRR’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. నవంబర్ చివరి నాటికి షూటింగ్ కంప్లీట్ అయ్యేలా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.

హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ తో యాక్షన్ సీక్వెన్స్

‘దేవర’ను హై వోల్టేజ్ట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీగా వెండితెరపై చిత్రీకరించేందుకు దర్శకుడు కొరటాల శివ, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ ను రూపొందించేందుకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించారట. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో గతంలో ఎప్పుడూ చూడని రీతిలో ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.  అభిమానుల అంచనాలకు సైతం అందరిని రీతిలో ఈ సినిమా ఉండబోతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

రూ. 150 కోట్లకు డిజిటల్ హక్కులు అమ్ముడు  

‘దేవర’ సినిమా విడుదలకు సంబంధించి మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు 5 భారతీయ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘దేవర’ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.  ఈ చిత్రానికి సంబంధించి ఓటీటీ డీల్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రికార్డు ధరకు  డిజిటల్ హక్కులను దక్కించుకుందట. ఇందుకోసం ఏకంగా రూ. 150 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘దేవర’ షూటింగ్ కంప్లీట్ కాకముందే బడ్జెట్ లో సంగం డబ్బులు వచ్చేయాని చర్చించుకుంటున్నారు.   

‘దేవర’ చిత్రంపై భారీ అంచనాలు

ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘RRR’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ పతాకాలపై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ‘ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘వార్’ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ‘వార్ 2’లో కనిపించబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నార్త్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు. 

Read Also: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 29 Sep 2023 12:59 PM (IST) Tags: Janhvi Kapoor Jr NTR Koratala siva NETFLIX Devara Movie Devara Digital Rights

ఇవి కూడా చూడండి

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Bootcut Balaraju Teaser: ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్, ఊర్లో మీ గాలి బ్యాచ్ బ్రాండ్ వ్యాల్యూ భలే ఉంది గురూ!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Naga Panchami Serial December 11th Episode - 'నాగ పంచమి' సీరియల్: నన్ను క్షమించండి మోక్షాబాబు, పంచమి వీడ్కోలు - హోమం దగ్గర ఫణేంద్ర తిప్పలు!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Intinti Gruhalakshmi December 11th Episode - ఇంటింటి గృహలక్ష్మి సీరియల్: విషమించిన పరంధామయ్య ఆరోగ్యం, నందుని కడిగిపారేసిన తులసి!

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Bigg Boss 17: బిగ్ బాస్‌లోకి కొరియన్ పాప్ సింగర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

Aishwarya Abhishek Bachchan: అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోనున్నారా? అమితాబ్ బచ్చన్ పోస్ట్‌కు అర్థం ఏమిటీ?

టాప్ స్టోరీస్

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

TS Rythu Bharosa: తెలంగాణలో రైతు భరోసాపై నేడు ప్రభుత్వం కీలక ప్రకటన

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Anantapur Teacher Suicide: అనంతపురంలో టీచర్ ఆత్మహత్యాయత్నం! సూసైడ్ నోట్ లో సీఎం జగన్ పేరుతో కలకలం

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Bhagwant Mann: 'అబద్ధాల మా నాన్న మూడోసారి తండ్రి కాబోతున్నారు' - పంజాబ్ సీఎం భగవంత్ పై కుమార్తె సంచలన వ్యాఖ్యలు

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి- మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!

MCRHRD Become CM Camp Office: సీఎం క్యాంప్‌ ఆఫీసు మార్చే యోచనలో రేవంత్ రెడ్డి-  మర్రి చెన్నారెడ్డి భవనంలోకి వెళ్తారా!