News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 'భగవంత్ కేసరి' సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

FOLLOW US: 
Share:

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'భగవంత్ కేసరి' మూవీ నుంచి ఓ సర్ప్రైజింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో పాటు ఓ సాంగ్ ని విడుదల చేయగా, తాజాగా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ఇప్పటికే ప్రమోషన్స్ లో జోరు పెంచిన మూవీ యూనిట్ తాజాగా అదిరిపోయే సర్ప్రైజ్ వీడియోతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. 'ది జర్నీ ఆఫ్ భగవంత్ కేసరి' పేరుతో షూటింగ్ సెట్ లోని మేకింగ్ వీడియోను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు. 8 నెలలు.. 24 అద్భుత లొకేషన్స్.. 12 భారీ సెట్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఇక వీడియోలో క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముగిసే వరకు సెట్ లో జరిగిన పలు విషయాలను చూపించారు.

కాజల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్, బాలయ్య పై చిత్రీకరించిన సీన్స్ ని ఈ వీడియోలో చూపించారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు భారీగా ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ మేకింగ్ వీడియో చివర్లో.." కలిసి మాట్లాడతా అన్నా కదా. అంతలోనే మందిని పంపాలా. ‘‘గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే" అంటూ బాలయ్య తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మేకింగ్ వీడియోతో బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 'అఖండ', 'వీర సింహారెడ్డి' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం కావడంతో 'భగవంత్ కేసరి' కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొట్టడం పక్కా అని ఫాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో బాలయ్య మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెబుతూ తన మేకోవర్, యాక్షన్ తో అదరగొట్టేశారు. ఇక సినిమాలో తమిళ సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తుండగా.. శ్రీ రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Sep 2023 09:19 PM (IST) Tags: Balakrishna Anil Ravipudi BhagavanthKesari journey of BhagavanthKesari BhagavanthKesari Movie

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి