News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Kiran Abbavaram: సొంతింటి కలను నెరవేర్చుకున్న కిరణ్ అబ్బవరం - కొత్త ఇంట్లో సందడి చూశారా?

ఎంతోమంది అప్‌కమింగ్, యంగ్ నటీనటులకు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనే కోరిక ఉంటుంది. తాజాగా కిరణ్ అబ్బవరం కూడా అలాంటి కలను నిజం చేసుకున్నాడు.

FOLLOW US: 
Share:

సినిమా రంగంలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు ఎన్నో కలలతోనే వస్తారు. కానీ అందరికీ ఆ కలలు నెరవేర్చుకునే అవకాశం రాదు. అవకాశం వచ్చినా అదృష్టం ఉండదు. అలా అన్ని కలిసొచ్చి.. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో ఎదిగినవారు చాలా తక్కువమందే ఉంటారు. అందులో ఒకరు కిరణ్ అబ్బవరం. ఎవరి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన కిరణ్ అబ్బవరం.. తాజాగా తన సొంతింటి కలను నెరవేర్చుకున్నాడు. తన ఇంటికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి కంగ్రాట్స్ చెప్తూ.. తన ఫ్యాన్స్‌తో పాటు ఎంతోమంది తెలుగు ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు.

బ్యాక్ టు బ్యాక్ హిట్స్..
యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఫేమస్ అయిన నటీనటులు ఎందరో ఉన్నారు. అందులో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. ముందుగా షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటించిన కిరణ్.. ‘రాజావారు రాణీగారు’ అనే చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఏ హైప్ లేకుండా, ఎక్కువ ప్రమోషన్స్ లేకుండా విడుదలయినా కూడా ‘రాజావారు రాణీగారు’ చిత్రం క్లీన్ హిట్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమా తర్వాత మరెన్నో ఆఫర్లు కిరణ్ అబ్బవరంను వెతుక్కుంటూ వచ్చాయి. తన రెండో చిత్రం ‘ఎస్సార్ కళ్యాణమండపం’తో కూడా మంచి హిట్‌ను అందుకున్న కిరణ్.. తాజాగా తన సొంతిటి కలను నిజం చేసుకున్నాడు. 

సొంతూరిలో సొంతిల్లు..
కిరణ్ అబ్బవరం తన సొంత ఊరిలోనే ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కట్టడం మొదలయిన దగ్గర నుండి పూర్తయ్యే వరకు జరిగిన ప్రక్రియను వీడియోగా కట్ చేసి షేర్ చేశాడు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత గృహప్రవేశం ఎలా జరిగింది అనేదాన్ని కూడా ఈ వీడియోలో చూపించాడు. ఈ కార్యక్రమాలలో తన కుటుంబ సభ్యులతో పాటు ఫ్రెండ్స్ కూడా పాల్గొనడం వీడియోలో స్పష్టంగా చూపించాడు. రాయచోటిలోని పెద్దకోడివండ్లపల్లిలో కిరణ్ అబ్బవరం ఇల్లు కట్టుకున్నాడు. మొత్తంగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన సొంతూరిలో ఇల్లు కూడా కట్టుకొని చాలామందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాడని కిరణ్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ట్రోల్స్ మొదలయ్యాయి..
కెరీర్ మొదట్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో కిరణ్ అబ్బవరం స్పీడ్‌గా దూసుకెళ్లినా కూడా మెల్లగా తన మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి. తాను నటించిన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ మరిన్ని సినిమాలు చేస్తున్నాడు అంటూ ప్రేక్షకులు తనను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తన గురించి అసభ్యకరంగా మాట్లాడారు. కానీ కిరణ్ మాత్రం వాటన్నింటికి ఓపికగానే సమాధానం చెప్పేవాడు. చివరిగా ‘మీటర్’ అనే చిత్రంలో హీరోగా కనిపించాడు కిరణ్ అబ్బవరం. కానీ ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయినా కూడా త్వరలోనే ‘రూల్స్ రంజన్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘రూల్స్ రంజన్’ నుండి విడులదయిన పాటలు, టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదే రేంజ్‌లో హైప్ క్రియేట్ అయితే.. ‘రూల్స్ రంజన్’తో కిరణ్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: సినిమాలకి బ్రేక్ ఇచ్చినా తగ్గని సమంత క్రేజ్ - సోషల్ మీడియాలో సామ్ నయా రికార్డ్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Sep 2023 05:40 PM (IST) Tags: Kiran Abbavaram Kiran Abbavaram instagram Kiran Abbavaram movies

ఇవి కూడా చూడండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

టాప్ స్టోరీస్

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?