‘స్కంద’ స్పెషల్ సాంగ్, ‘యానిమల్’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'స్కంద' ఊర మాస్ సాంగ్ వచ్చేసింది - ఊర్వశితో రామ్ ఊర మాస్ స్టెప్స్ అదుర్స్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో 'స్కంద'(Skanda) మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'అఖండ' వంటి భారీ హిట్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. బోయపాటి సినిమాలంటే ఖచ్చితంగా అందులో ఒక ఊర మాస్ సాంగ్ ఉండాల్సిందే. అందులోనూ కమర్షియల్ మూవీ అంటే కచ్చితంగా మాస్ సాంగ్ ఉండడం మన టాలీవుడ్ లో ఆనవాయితీగా వస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'యానిమల్' ఊరమాస్ టీజర్ లోడింగ్ - ఎప్పుడంటే?
'అర్జున్ రెడ్డి'(Arjun Reddy) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకి స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టిన సినిమా కూడా ఇదే. ఇక ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్'(Kabirsingh) అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. 'యానిమల్'(Animal) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రణబీర్ ని రఫ్ అండ్ రగుడ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హైదరాబాద్ ప్రజల నెత్తుటి కథ ‘రజాకార్’ - టీజర్ చూశారా
నిజాం నిరంకుశ పాలన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘రజాకార్’. సమర్ వీర్ క్రియేషన్స్ బ్యానర్‌పై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే సహా పలువురు ఈ చిత్రంలో నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వేడుకలో నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి, దర్శకుడు యాటా సత్యనారాయణ, ఎమ్మెల్యే రాజా సింగ్, హీరోయిన్ అనుష్య త్రిపాఠి సహా పలువురు నటీనటులు పాల్గొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నిఖిల్ డెబ్యూ మూవీ 'హ్యాపీడేస్' రీరిలీజ్ - కన్ఫర్మ్ చేసిన హీరో, ఎప్పుడంటే?
'కార్తికేయ 2' సక్సెస్ తో పాన్ ఇండియా వైడ్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. అప్పటివరకు టాలీవుడ్ లో మాత్రమే మీడియం రేంజ్ హీరోగా పలు సూపర్ హిట్స్ అందుకున్న నిఖిల్, ఈ మూవీతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం బడా నిర్మాతలతో భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలా ఉంటే నిఖిల్ డెబ్యూ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మన టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న పలు బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్లీ వెండితెరపై కనువిందు చేస్తున్నాయి. రీరిలీజ్ పేరుతో 4k వెర్షన్ లో మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘కుమారి శ్రీమతి’గా వస్తున్న నిత్యా మీనన్ - స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
కథ బాగుంటే, కంటెంట్ బాగుంటే అది సినిమా అయినా, ఓటీటీ అయినా ప్రేక్షకులు వాటిని కచ్చితంగా ఆదరిస్తారు. ఇక గత కొన్నేళ్లలో సినిమాలకు ఉన్న పాపులారిటీకి సమానంగా వెబ్ సిరీస్‌లు కూడా పాపులారిటీని సాధించాయి. స్టార్ హీరో, హీరోయిన్స్ సైతం సినిమాలు చేయడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారో.. సిరీస్‌లు చేయడానికి కూడా అలాగే ముందుకొస్తున్నారు. చాలావరకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కు వెబ్ సిరీస్‌ల వల్ల కూడా పాపులారిటీ వస్తోంది. అందుకే నిత్యామీనన్ లాంటి టాలెంటెడ్ నటి కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్‌లలో మెరవడానికి వెనకాడడం లేదు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్‌లలో నటించిన నిత్యా.. మరో సిరీస్‌లో మెరవడానికి, తన ఫ్యాన్స్‌ను మెప్పించడానికి సిద్ధమవుతోంది. తాజాగా నిత్యా నటించిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్ ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుంది అనే విషయాలను ప్రకటించారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)