అన్వేషించండి

HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్

HMPV Cases In India : హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోన్న రెండు నెలల బాలుడు అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

HMPV Cases In India : ఇటీవల చైనాలో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇప్పుడు దేశంలోనూ వేగంగా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ ఈ వైరస్ కు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కోల్ కత్తాలో 6నెలల చిన్నారికి ఈ వైరస్ సోకింది. దీంతో భారత్ లో ఇప్పటివరకూ ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 6కి చేరింది. ఈ 6 కేసులు కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ నుంచి నమోదయ్యాయి. అయినప్పటికీ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

అంతకుముందు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కర్ణాటకలో ఇద్దరు పిల్లలకు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్‌ పాజిటివ్ నిర్థారణ అయిందని వెల్లడించింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన రెండు నెలల బాలుడు హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో ప్రజలు భయాందోళన చెందవద్దని గుజరాత్ ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ కోరారు. వైరల్ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసిందని చెప్పారు. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ (HMPV) ఇప్పటికే చెలామణిలో ఉందని, దానితో సంబంధం ఉన్న శ్వాసకోశ వ్యాధుల కేసులు వివిధ దేశాల్లో నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. 

Also Read : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

ఇక తాజాగా కోల్ కత్తాలో 6 నెలల చిన్నారికి ఈ వైరస్‌ సోకింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ చిన్నారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు చెబుతున్నారు. చిన్నారి నవంబర్ 2024లో తన తల్లిదండ్రులతో కలిసి ముంబై నుండి కోల్‌కతాకు వచ్చాడు. కోల్‌కతా చేరుకున్న తర్వాత, పిల్లాడు అనారోగ్యం పాలయ్యాడు. విమానం దిగిన వెంటనే అతని పరిస్థితి క్షీణించింది. చిన్నారికి జ్వరం వచ్చిందని, వాంతులు, కడుపు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి ఇతర లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో ఆ చిన్నారికి మూడు వారాల పాటు చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటున్నట్టు సమాచారం.

డోంట్ పానిక్.. బీ అవేర్

బెంగళూరులో రెండు హెచ్ఎంపీవీ కేసులు నమోదవడంతో కర్ణాటకలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 'డోంట్ పానిక్, బీ అవేర్' పేరుతో ఒక అడ్వైజరీని జారీ చేసింది.  ఇన్‌ఫ్లుఎంజా లాంటి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ (SARI) కేసులను తమకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని ఆసుపత్రులకు సూచించింది. 

ట్రెండింగ్ లో లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ 

చైనాలో పుట్టి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి తెలిసిందే. సరిగ్గా 5ఏళ్ల తర్వాత మళ్లీ చైనాలోనే కొత్త వైరస్ వెలుగులోకి రావడం భయాందోళనలకు గురి చేస్తోంది.ఇక భారత్‌లో హెచ్ఎంపీవీ కేసులు నమోదవుతున్న వేళ.. సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ లతో చాలా మంది పోస్టులు పెడుతుండగా ఇప్పుడు ఈ #lockdown ఎక్స్ లో ట్రెండింగ్ లో ఉంది.

Also Read : Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget