కరోనా తర్వాత హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది. చైనాలో విజృంభిస్తోన్న ఈ వైరస్.. ఇండియాకు కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. HMPV తేలికపాటి నుంచి మితమైన ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వైరస్ సోకిన వారితో ప్రత్యక్ష సంబంధం పెట్టుకోకూడదు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారడం, మూసుకుపోవడం వంటి లక్షణాలను ఇది కలిగి ఉంది. గురక, నిద్రలో శ్వాస ఆడకపోవడం వంటి కరోనా లక్షణాలనే ఇది కూడా కలిగి ఉంది. పిల్లలు, వృద్ధులు, ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారికి ఈ వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుందట. న్యూమోనియా, బ్రోన్కైటీస్ వంటి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవారిలో పరిస్థితి తీవ్రంగా మారుతుందట. మాస్క్, శానిటైజర్స్ కచ్చితంగా ఉపయోగించాలని.. ఎఫెక్ట్ అయినవారికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా ఫాలో అయితే మంచి ఫలితాలుంటాయి.